శంభు సరిహద్దులో హైవేల మూసివేత పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ | Supreme Court to Hear Petition on Opening Shambhu Border Today live updates | Sakshi
Sakshi News home page

శంభు సరిహద్దులో హైవేల మూసివేత పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ

Published Mon, Dec 9 2024 9:42 AM | Last Updated on Mon, Dec 9 2024 11:38 AM

Supreme Court to Hear Petition on Opening Shambhu Border Today live updates

న్యూఢిల్లీ: శంభు సరిహద్దులో హైవేల మూసివేతపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టులో సోమవారం విచారణ జరగనుంది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం విచారించనుంది.

పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంతోపాటు తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ.. హర్యానా, పంజాబ్‌ రైతులు ఢిల్లీ చలో కార్యక్రమం చేపట్టారు. సంయుక్త కిసాన్‌ మోర్చ నేతృత్వంలో వందలాది మంది రైతులు శంభు సరిహద్దు గుండా రాజధానిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు శంభు సరిహద్దు హైవేలను నిర్బందించారు. రాకపోకల్ని నిలిపివేశారు. 

హైవేల నిర్బందం, రైతులు చేపట్టిన ఢిల్లీ చలో కార్యక్రమంపై పంజాబ్‌కు చెందిన ఓ సామాజిక కార్యకర్త సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌లో రైతుల నిరసనలతో మూతపడ్డ శంభు సరిహద్దు సహా హైవేలను తిరిగి తెరవాలని, నిరసన తెలుపుతున్న రైతులను హైవేపై నుంచి తొలగించాలని పంజాబ్, హర్యానా ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వానికి సూచించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. 

శాంతిభద్రతలను కాపాడేలా నిరసన తెలిపే రైతులను కూడా కోర్టు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.  ఈ విధంగా హైవేలను అడ్డుకోవడం ప్రజల ప్రాథమిక హక్కులకు విరుద్ధమని, జాతీయ రహదారి చట్టం భారతీయ న్యాయ సంహిత ప్రకారం నేరమని, హైవేలను దిగ్బంధించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పిటిషనర్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement