కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్‌కు వినతిప్రతం అందజేస్తున్న రైతులు
కామారెడ్డి టౌన్: మునిసిపల్ మాస్టర్ ప్లాన్ వల్ల తాము తీవ్రంగా నష్టపోతు న్నామని రైతు జేఏసీ ఆధ్వర్యంలో సోమ వారం కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ సభ్యులందరికీ వినతి పత్రాలను అందజేశారు. చైర్‌పర్సన్ నిట్టు జాహ్నవి, వైస్ చైర్‌పర్సన్ ఇందుప్రియలతో పాటు 49 మంది కౌన్సిల్ సభ్యులకు ఇళ్లకు వెళ్లి వినతి పత్రాలను అందజేశారు. చైర్‌పర్సన్ అందుబాటులో లేకపో వడంతో ఆమె తండ్రి నిట్టు వేణుగోపాల్ రావుకు విన్నవించుకున్నారు.
తమకు న్యాయం జరిగేలా కౌన్సిల్‌లో చర్చించి తీర్మానం చేయాలని రైతులు కోరారు. ఈనెల 11న అభ్యంతరాలకు గడువు ముగుస్తుందని, 12న అత్యవ సర సమావేశం పెట్టుకుని తమకు న్యాయం చేయాలని వేడుకు న్నారు. ప్రభుత్వ విప్, కలెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం తమకు న్యాయం జరుగుతుందని భావించి ఉద్యమానికి తాత్కాలి కంగా విరామం ప్రకటిస్తున్నామన్నారు. ఈ కార్య క్రమంలో ఇల్చిపూర్, దేవునిపల్లి, టేక్రియాల్, అడ్లూర్, రామేశ్వరపల్లి, అడ్లూర్‌ఎల్లారెడ్డి గ్రామాల రైతులు, రైతు జేఏసీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment