సాక్షి, కామారెడ్డి/కామారెడ్డి టౌన్/ జగిత్యాల: తమ పంట భూములను కాపాడుకునేందుకు రైతులు చేసిన పోరాటం ఫలించింది. కామారెడ్డి, జగిత్యాల పట్టణాల్లో కొత్త మాస్టర్ ప్లాన్ ముసాయిదాలను రద్దు చేయాలంటూ వారు చేపట్టిన ఆందోళనకు ప్రభుత్వం తలొగ్గింది. ఈ రెండు చోట్ల మాస్టర్ ప్లాన్ ముసాయిదా ప్రక్రియలను నిలిపివేస్తూ మున్సిపల్ పాలకవర్గాలు శుక్రవారం నిర్ణయం తీసుకున్నాయి. రైతుల భూములు ఎక్కడికీ పోవని, ఆవేదన చెందవద్దని ప్రకటించాయి. రైతుల భూములకు నష్టం కలగకుండా ప్రణాళికలను రూపొందిస్తామని అధికారులు తెలిపారు.
రైతుల ఉధృత ఉద్యమంతో..
కామారెడ్డి మున్సిపాలిటీ కొత్త మాస్టర్ ప్లాన్‌కు సంబంధించి డీటీసీపీ, ఢిల్లీకి చెందిన డీడీఎఫ్ సంస్థలు కలిసి ముసాయిదా రూపొందించడం, అందులో పంట భూములను పారిశ్రా మిక, వాణిజ్య జోన్లుగా చూపడాన్ని తప్పుపడుతూ రైతులు ఆందోళనకు దిగడం తెలిసిందే. జెడ్పీ మాజీ చైర్మన్ కె.వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో రైతులు ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడి ఉద్యమానికి దిగారు.
దీనికి వివిధ రాజ కీయ పక్షాలు మద్దతుగా నిలి చాయి. అయితే అడ్లూర్ ఎల్లా రెడ్డికి చెందిన రైతు పయ్యవుల రాములు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనతో పోరాటం ఉధృతమైంది. చివరికి మాస్టర్‌ప్లాన్ ముసాయిదాను రద్దు చేస్తూ శుక్రవారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. మరోవైపు పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్‌కుమార్ కామారెడ్డి కలెక్టరేట్‌లో కలెక్టర్ జితేష్ వి.పాటిల్, అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, మున్సిపల్ కమిషనర్ దేవేందర్‌లతో సమీక్షించారు.
అనంతరం ముసా యిదా ప్రక్రియను నిలిపివేస్తున్నామని అరవింద్‌కుమార్ ప్రక టించారు. విలీన గ్రామాల ప్రజల అభిప్రాయాలను తెలుసు కుని కొత్త మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తామని తెలిపారు. రైతుల భూమిని సేకరించే ఉద్దేశంతో మాస్టర్‌ప్లాన్ తయారు చేయ లేదని, రైతుల భూములు ఎక్కడికీ పోవని చెప్పారు. కొత్త రోడ్ల నిర్మాణంలో రైతులకు నష్టం జరగకుండా ప్రణాళిక రూపొందిస్తామన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై రైతులు, నేతలు హర్షం వ్యక్తం చేశారు. అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో టపాసులు కాల్చారు. ఉద్యమానికి అండగా నిలిచారంటూ జెడ్పీ మాజీ చైర్మన్ వెంకటరమణారెడ్డిని అభినందించారు.
జగిత్యాల మున్సిపాలిటీలోనూ..
జగిత్యాల మున్సిపాలిటీలోనూ ముసాయిదా మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేస్తూ పాలకవర్గం శుక్రవారం తీర్మానించింది. జగిత్యాల మున్సిపాలిటీలో పట్టణ శివార్లలోని హుస్నాబాద్, తిప్పన్నపేట, మోతె, తిమ్మాపూర్, ధరూర్, నర్సింగాపూర్ గ్రామాలను విలీనం చేస్తూ గత ఏడాది డిసెంబర్‌లో మాస్టర్ ప్లాన్ ముసాయిదా రూపొందించారు. పలుగ్రామాల్లోని వ్యవసాయ భూములను రిక్రియేషన్, ఇండస్ట్రియల్, కమర్షియల్ జోన్ల పరిధిలో చేర్చారు.
దీనిపై ఆయా గ్రామాల ప్రజ లు, రైతులు ఆందోళనలకు దిగారు. ధర్నాలు, రాస్తారో కోలు, కలెక్టరేట్, ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి, వంటావార్పుతో నిరసనలు తెలిపారు. గురువారం జగిత్యాల మున్సిపాలిటీ ముట్టడి, పట్టణ దిగ్బంధం కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ పాలకవర్గం శుక్రవారం అత్యవసరంగా సమావేశమై.. మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రద్దు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment