బెంగళూరు: బెంగళూరు వేదికగా నిర్వహించిన విపక్షాల సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక అంశాలను చర్చించారు. కూటమి పేరుతో సహా.. పలు రాష్ట్రాల్లో పార్టీల మధ్య ఉన్న భేదాభిప్రాయాలను పక్కన పెట్టి ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్నారు. కూటమి సమన్వయానికి 11 మందితో కూడిన సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. బెంగళూరు వేదికగా జరిగిన ప్రతిపక్షాల భేటీ అనంతరం మీడియా సమావేశంలో ఖర్గే మాట్లాడారు.
కూటమికి సంబంధించి ఎవరు నాయకత్వం వహిస్తారనే అంశాలను చర్చించడానికి ముంబయి వేదికగా మరోసారి విపక్ష పార్టీలు సమావేశమవుతాయని ఖర్గే చెప్పారు. కూటమికి నాయకుడు ఎవరనే అంశాన్ని తేల్చే వ్యవహారంపై ఖర్గే పెదవి విప్పారు. కన్వినర్‌గా పనిచేస్తున్న బిహార్ సీఎం నితీష్ కుమార్.. ముంబయి సమావేశంలో ఈ విషయాన్ని తేల్చుతారని చెప్పారు. ఇవి చాలా చిన్న విషయాలని ఆయన అన్నారు.
నేడు బెంగళూరులో జరిగిన భేటీలో సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, స్టాలిన్, నితీష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సొరేన్, మమతా బెనర్జీ, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌తో సహా ప్రముఖులు రెండో రోజు పాల్గొన్నారు.
బీజేపీకి పోటీగా ఏకమైన ప్రతిపక్ష పార్టీల కూటమికి కొత్త పేరును నిర్ణయించారు. ఈ మేరకు మహాకూటమి పేరును ఇండియన్ నేషనల్ డిమోక్రటిక్ ఇంక్లూజివ్ అలయెన్స్ (ఐఎన్‌డిఐఏ)పేరును ఖరారు చేశారు. అయితే.. అలయెన్స్ (కూటమి) అనే పదంపై పునరాలోచన జరపాలని వామపక్ష పార్టీలు కోరినట్లు సమాచారం.
ఇదీ చదవండి: Opposition Meeting Live Updates: ముగిసిన ప్రతిపక్షాల రెండో రోజు భేటీ.. కీలక అంశాలు ఇవే..
Comments
Please login to add a commentAdd a comment