held
-
జనగణన వచ్చే ఏడాదే షురూ!. కేంద్రం కీలక నిర్ణయం. 2026 నాటికి ప్రక్రియ పూర్తి. తర్వాత లోక్‌సభ స్థానాల పునర్విభజన?
-
రిషి సునాక్- ప్రధాని మోదీ భేటీ
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌లు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు, పెట్టుబడులపై లోతుగా చర్చించినట్లు పేర్కొన్నారు. జీ20 సమ్మిట్ మొదటి సెషన్ అనంతరం ఇరు దేశాల నేతలు ప్రత్యేకంగా కలుసుకున్నారు. ప్రధాని మోదీని రిషి సునాక్ భారతీయ సాంప్రదాయంలో నమస్తేతో పలకరించారు. 🇬🇧🇮🇳 Two nations, one ambition. An ambition rooted in our shared values, the connection between our people and – of course – our passion for cricket. pic.twitter.com/1W4wkiYCjY — Rishi Sunak (@RishiSunak) September 9, 2023 'రెండు దేశాలు.. ఒకే ఆశయం. ఇరు దేశాల మధ్య పరస్పర విలువలు, ప్రజల మధ్య అనుబంధం ప్రత్యేకమైనవి' అని రిషి సునాక్ ట్విట్టర్(ఎక్స్) పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడుల వంటి ఒప్పందాల్లో మరింత పరస్పర సహకారం దిశగా అడుగులు వేయాలని చర్చించినట్లు రిషి సునాక్ తెలిపారు. ఇండియా, యూకేలు సుస్థిరాభివృద్ధి దిశగా ప్రయత్నాలు చేస్తాయని చెప్పారు. జీ20 సదస్సుకు హాజరవడానికి రిషి సునాక్ ఢిల్లీకి చేరిన విషయం తెలిసిందే. ఈ రోజు జీ20 సమ్మిట్‌లో మొదటిరోజు ఢిల్లీ డిక్లరేషన్‌పై అన్ని దేశాల నేతలు ఏకాభిప్రాయానికి ఆమోదం తెలిపారు. అనంతరం ఇద్దరు నేతలు ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఇదీ చదవండి: G20 Summit: రిషి సునాక్, అక్షతా మూర్తి పిక్ వైరల్.. -
విపక్షాల కూటమికి నాయకుడు ఎవరు..? తేల్చేది ఎవరు..? పెదవి విప్పిన ఖర్గే..
బెంగళూరు: బెంగళూరు వేదికగా నిర్వహించిన విపక్షాల సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక అంశాలను చర్చించారు. కూటమి పేరుతో సహా.. పలు రాష్ట్రాల్లో పార్టీల మధ్య ఉన్న భేదాభిప్రాయాలను పక్కన పెట్టి ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్నారు. కూటమి సమన్వయానికి 11 మందితో కూడిన సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. బెంగళూరు వేదికగా జరిగిన ప్రతిపక్షాల భేటీ అనంతరం మీడియా సమావేశంలో ఖర్గే మాట్లాడారు. కూటమికి సంబంధించి ఎవరు నాయకత్వం వహిస్తారనే అంశాలను చర్చించడానికి ముంబయి వేదికగా మరోసారి విపక్ష పార్టీలు సమావేశమవుతాయని ఖర్గే చెప్పారు. కూటమికి నాయకుడు ఎవరనే అంశాన్ని తేల్చే వ్యవహారంపై ఖర్గే పెదవి విప్పారు. కన్వినర్‌గా పనిచేస్తున్న బిహార్ సీఎం నితీష్ కుమార్.. ముంబయి సమావేశంలో ఈ విషయాన్ని తేల్చుతారని చెప్పారు. ఇవి చాలా చిన్న విషయాలని ఆయన అన్నారు. నేడు బెంగళూరులో జరిగిన భేటీలో సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, స్టాలిన్, నితీష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సొరేన్, మమతా బెనర్జీ, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌తో సహా ప్రముఖులు రెండో రోజు పాల్గొన్నారు. బీజేపీకి పోటీగా ఏకమైన ప్రతిపక్ష పార్టీల కూటమికి కొత్త పేరును నిర్ణయించారు. ఈ మేరకు మహాకూటమి పేరును ఇండియన్ నేషనల్ డిమోక్రటిక్ ఇంక్లూజివ్ అలయెన్స్ (ఐఎన్‌డిఐఏ)పేరును ఖరారు చేశారు. అయితే.. అలయెన్స్ (కూటమి) అనే పదంపై పునరాలోచన జరపాలని వామపక్ష పార్టీలు కోరినట్లు సమాచారం. ఇదీ చదవండి: Opposition Meeting Live Updates: ముగిసిన ప్రతిపక్షాల రెండో రోజు భేటీ.. కీలక అంశాలు ఇవే.. -
Yoga Mahotsav: హైదరాబాద్‌లో గ్రాండ్‌గా యోగా మహోత్సవ్ (ఫొటోలు)
-
భారత్‌లో పాక్ ప్రభుత్వ ట్విటర్ ఖాతా నిలిపివేత
పాకిస్తాన్ ప్రభుత్వ అధికారిక ట్విటర్ ఖాతాను భారత్‌లో నిలిపివేశారు. లీగల్ డిమాండ్ నేపథ్యంలోనే శనివారం నుంచి ఆ ఖాతాను భారత్‌లో ట్విటర్ బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా కోర్టు ఆదేశాల తరహా డిమాండ్‌కు ప్రతిస్పందనగా ట్విటర్ ఇలాంటి చర్యలు తీసుకోవడం సర్వసాధారణంగా జరుగుతుంది. అయితే ఇప్పుడు పాక్ గవర్నమెంట్ ట్విటర్ అకౌంట్‌ను ఉన్నపళంగా ఎందుకు బ్లాక్ చేశారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(PFI)పై భారత్‌లో నిషేధం నేపథ్యంలో ఆ సంస్థ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేసింది. తర్వాత ఇప్పుడు పాక్ ప్రభుత్వ ట్విటర్ అకౌంట్‌ను బ్లాక్ చేయడం గమనార్హం. పీఎఫ్ఐపై భారత ప్రభుత్వ నిషేధాన్ని పాక్ అధికారులు ఖండిస్తూ.. బహిరంగంగా ప్రకటనలు సైతం విడుదల చేశారు. అయితే.. ఇలా పాక్‌కు చెందిన అకౌంట్లను బ్లాక్ చేయడం, తిరిగి పునరుద్ధించడం కొత్తేం కాదు. గతంలోనూ ఇలా చాలాసార్లే జరిగింది కూడా. జూన్ నెలలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 కింద న్యూఢిల్లీ వర్గాలు చాలావరకు రాయబార కార్యాలయాలు, జర్నలిస్టులు, కొందరు ప్రముఖుల అకౌంట్లను నిషేధించిందని పాక్ మీడియా కథనాలు ప్రచురించింది. ఐరాసలో పాక్ రాయబార కార్యాలయం, టర్కీ, ఇరాన్, ఈజిప్ట్లలోనూ పాక్ రాయబార కార్యాలయ ట్విటర్ అకౌంట్లను భారత్ బ్లాక్ నిషేధించింది. అంతేకాదు.. 8 యూట్యూబ్ ఆధారిత న్యూస్ ఛానెల్స్(అందులో ఒకటి పాక్‌కు చెందింది కూడా), ఒక ఫేస్బుక్ అకౌంట్‌ను ‘భారత్ వ్యతిరేక, ఫేక్ కంటెంట్’ను పోస్ట్ చేసిందనే నెపంతో బ్లాక్ చేసింది భారత్. భారత్ వ్యతిరేక కంటెంట్ పోస్ట్ చేసినందుకుగానూ మొత్తం 100 యూట్యూబ్ ఛానెల్స్, నాలుగు ఫేజ్‌బుక్ పేజీలు, ఐదు ట్విటర్ అకౌంట్లు, మూడు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను బ్లాక్ చేసింది. ఇదీ చదవండి: అన్నీ బీజేపీ గుప్పిట్లోనే ఉన్నాయ్ కదా! -
మైనర్ బాలికల పట్ల అసభ్య ప్రవర్తన.. ప్రముఖ నటుడు అరెస్ట్
ప్రముఖ మలయాళ నటుడు శ్రీజిత్ రవిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. లైంగిక ఆరోపణల కేసులో గురువారం పోలీసులు అతడి అదుపులోకి తీసుకున్నారు. శ్రీజిత్ ఇద్దరు మైనర్ బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. బాధిత బాలికలు ఫిర్యాదు మేరకు అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు.. గత సోమావారం రోజున (జూలై 4) తిస్సూర్లోని ఎస్ఎన్ పార్క్‌లో శ్రీజిత్ ఇద్దరు బాలికల పట్ల ఆసభ్యకరంగా ప్రవర్తించినట్లు పోలీసులు సీసీటీవీమ ఆధారంగా గుర్తించారు. బాలికల వయసు 9, 14 ఏళ్లుగా పోలీసులు గుర్తించారు. చదవండి: టాలీవుడ్లో మరో విషాదం, ప్రముఖ నిర్మాత రాజేంద్రప్రసాద్ మృతి దీంతో పోక్సో చట్టం కింద పోలీసులు అతడిని గురువారం అరెస్ట్ చేశారు. కాగా శ్రీజిత్ ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొవడం ఇది తొలిసారి కాదు. గతంలో కూడా అతడు ఇలాంటి ఆరోపణలను ఎదర్కొని అరెస్ట్ అయ్యాడు. 2016లో ఓట్టప్పలం పోలీసుల ఇలాంటి కేసులోనే అతడిని అరెస్ట్ చేశారు. కొందరు స్కూల్ గల్స్‌కు చెందిన గ్రూప్‌తో అసభ్యకరరీతిలో అతడి ప్రైవేటు పార్ట్స్‌ను చూపిస్తూ అసభ్యకర రితీలో ప్రవర్తించడమే కాకుండా బాలికల ఫొటోలను తీసుకున్నాడు. దీంతో స్కూల్ ప్రిన్స్పాల్య ఫిర్యాదుతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ప్రముఖ నటుడు టి.జి రవి కుమారుడైన శ్రీజిత్ రవి మాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటులలో ఒకరు. అతడు సహా నటుడిగా, విలన్‌గా పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందాడు. చదవండి: ఖుష్బూ సుందర్‌కు కీలక బాధ్యతలు -
ఆటా వేడుకలకు వేళాయే
అమెరికన్ తెలుగు అసొసియేషన్ కన్వెన్షన్ వేడుకలకు అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని వాల్టర్ ఈ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్ ముస్తాబవుతోంది. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ఏ రోజుకారోజు ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించారు. అమెరికన్ తెలుగు అసొసియేషన్ అధ్యక్షుడు భువనేష్ భుజాల సారథ్యంలో వేర్వేరు కమిటీలు వేడుకలకు సంబంధించి వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమాల నుంచి కళా ప్రదర్శనల వరకు, అవార్డుల నుంచి హాస్పిటాలిటీ వరకు, స్వాగతాల నుంచి భోజనాల వరకు ఇలా.. చెప్పుకుంటూ పోతే దాదాపు 80 కమిటీలు, 300 మంది వాలంటీర్లు అలుపెరుగకుండా ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు. వచ్చిన అతిథులను ఆకట్టుకునేలా మూడు రోజుల్లో వేటికవే వినూత్నమైన కార్యక్రమాలను రూపొందించారు. ఈ వేడుకలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వందకు పైగా రాజకీయ, సినీ, వ్యాపార, అధికార ప్రముఖులు హాజరు అవుతున్నారు. గత మూడేళ్లుగా కరోనా పరిస్థితుల వల్ల అమెరికాలో పెద్ద తెలుగు ఈవెంట్ ఏదీ జరగలేదు. సుదీర్ఘ విరామం తర్వాత జరుగుతున్న ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగేలా ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలకు హాజరయ్యేందుకు అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి ప్రవాసాంధ్రులు ఇప్పటికే భారీగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. చారిత్రక వేదిక డిసి కన్వెన్షన్ సెంటర్ వేడుకలు నిర్వహించనున్న వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్‌కు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అమెరికా అరు వేర్వేరు అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ప్రెసిడెంట్ అభ్యర్థి సమావేశాలకు ఇదే కన్వెన్షన్ సెంటర్‌ను ఎంచుకున్నారు... * 23 లక్షల స్క్వేర్ ఫీట్ ఏరియా * అల్ట్రా మోడర్న్ స్ట్రక్చర్ * 40 వేల మందితో సమావేశాలు నిర్వహించుకునే సదుపాయం * పూర్తి పర్యావరణ అనుకూలంగా ఉండే గ్లాస్ వాల్స్ * మూడు ఎయిర్‌పోర్ట్‌లకు సులువుగా చేరుకునే సదుపాయం * అత్యంత సులువుగా అన్ని రకాల రవాణా సౌకర్యాలు కరోనా విపత్కర పరిస్థితుల నుంచి ప్రపంచం కోలుకున్న తర్వాత నిర్వహిస్తున్న అతిపెద్ద తెలుగు పండుగ ఇది. ప్రవాసాంధ్రులందరిని ఒక్కతాటిపైకి తెచ్చి ఒక కుటుంబం అన్న భావన తీసుకురావడానికే మా ఈ ప్రయత్నం. ఘనమైన తెలుగు వారసత్వాన్ని అందించడం, పుట్టిన నేలకు తమ వంతు సాయం అందించడం, కొత్త తరానికి స్పూర్తిదాయక సందేశం ఇవ్వడమే ఆటా ముందున్న లక్ష్యాలు. వాషింగ్టన్ డీసీలో జులై 1,2,3 తేదీల్లో జరగనున్న వేడుకలకు తరలిరండి!మా ఆతిథ్యాన్ని స్వీకరించండి!! ఆటా కుటుంబంలో భాగం కండి!!! - భువనేష్ భుజాల, ఆటా అధ్యక్షుడు ఎంతో ఘనకీర్తి, ఎన్నో విజయాలు సాధించిన తెలుగు వారికి ఆటా ఒక కేంద్ర బిందువు అవుతుందని భావిస్తున్నాం. వాషింగ్టన్ డీసీ కేంద్రంగా నిర్వహిస్తున్న ఈ కన్వెన్షన్.. ప్రవాసాంధ్రులందరినీ ఒక్క తాటిపైకి చేర్చబోతుంది. ఎందరో ప్రముఖులు వస్తున్న ఈ కన్వెన్షన్ మునుపెన్నడూ లేనంత ఘనంగా నిర్వహించబోతున్నాం. కార్యక్రమాల్లో అత్యున్నత సాంకేతికత, వచ్చిన అతిథులకు అత్యుత్తమ హోటళ్లు, రాకపోకలకు ఆధునాతన రవాణా వసతులు, రుచికరమైన భోజనం, మరిచిపోలేని విధంగా కళా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నాం. హరిప్రసాద్ లింగాల, ఆటా సెక్రటరీ -వాషింగ్టన్ డీసీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి -
నకిలీ నోట్ల రాకెట్ : షాకైన పోలీసులు
సాక్షి, ముంబై : మహరాష్ట్రలోని పుణేలో భారీ ఎత్తున నకిలీ నోట్లను ముద్రిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసిన పోలీసులు ఈ రాకెట్‌ను ఛేదించారు. కోట్లాది రూపాయల విలువైన స్వదేశీ, విదేశీ కరెన్సీని చూసి పోలీసు ఉన్నతాధికారులే షాక్ అయ్యారు. దీనికి సంబంధించి ఆర్మీ సిబ్బంది సహా ఆరుగురిని అరెస్టు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. సదరన్ కమాండ్ ఇంటెలిజెన్స్ వింగ్, పూణె క్రైం బ్రాంచ్ జాయింట్ ఆపరేషన్‌లో బుధవారం(జూన్ 10)న ఈ గ్యాంగ్ ను అదుపులోకి తీసుకున్నారు. మిలటరీ ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అందడంతో ఈ దాడులు నిర్వహించామని డిప్యూటీ పోలీసు కమిషనర్ క్రైమ్ బచ్చన్ సింగ్ వెల్లడించారు. మిలటరీ ఇంటెలిజెన్స్ సహకారంతో నిర్వహించిన దాడిలో ఒక జవానుతో పాటు మరికొందరు దొంగ నోట్లను ముద్రిస్తున్నారని చెప్పారు. వీటిలో వెయ్యి రూపాయల నోట్లను మినహాయించి రూ. 43.4 కోట్లు స్వదేశీ నోట్లు, రూ. 4.2 కోట్లు విదేశీ కరెన్సీ ఉన్నట్టు వివరించారు. దీనిపై ఉన్నతాధికారులు మరింత విచారణ జరుపుతున్నారనీ అదుపులోకి తీసుకున్న జవాన్‌ను పూణెలోని ఆర్మీ అధికారులకు అప్పగించామని తెలిపారు. (పెట్రో వడ్డింపు : ఎంత పెరిగిందంటే) అరెస్టయిన ఆరుగురిలో భారత ఆర్మీ జవాన్ షేక్ అలీమ్ గులాబ్ ఖాన్, ఇతరులు సునీల్ బద్రీనారాయణ సర్దా, రితేష్ రత్నాకర్, తుఫైల్ అహ్మద్ మహ్మద్ ఖాన్, రెహ్ముతుల్లా ఖాన్, అబ్దుల్ రెహమాన్ ఖాన్ అని పూణే సంయుక్త పోలీసు కమిషనర్ రవీంద్ర షిస్వే తెలిపారు. (ఫెడ్ ఎఫెక్ట్ : లాభాలకు చెక్) పోలీసులు అందించిన మరిన్ని వివరాలు రూ .43.4 కోట్ల విలువైన భారత కరెన్సీ, రూ .4.2 కోట్ల విలువైన యుఎస్ డాలర్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బదులుగా ‘చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ పేరుతో ముద్రణ వీటిలో 2016 లో కేంద్రం రద్దు చేసిన పెద్ద నోట్లు కూడా ఉన్నాయి. ఈ నకిలీ నోట్ల కట్టల్లో మొదటి నోటు మాత్రమే అసలుది ఉంటుంది. ఒక నకిలీ పిస్తోల్ స్వాధీనం Six persons, including one serving military personnel detained in possession of multiple denominations of fake Indian and foreign currency. Counting of currency & further investigation underway: Crime Branch, Pune #Maharashtra pic.twitter.com/KamjyHelV3 — ANI (@ANI) June 10, 2020 -
కేంద్రమంత్రి కంప్యూటర్ డేటా చోరీ
సాక్షి, ముంబై : కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్ ఇంట్లో చోరీ వెలుగులోకి వచ్చింది. నమ్మకంగా వుంటూనే గత మూడేళ్లుగా గోయల్ నివాసం(ముంబైలోని నేపీన్సీ రోడ్‌లోని ఖరీదైన ఎత్తైన విల్లా ఓర్బ్)లో పనిచేస్తున్న విష్ణుకుమార్ విశ్వకర్మ (28)ఈ చోరీకి పాల్పడ్డాడు. గత నెల (సెప్టెంబరు) 16 -18 మధ్య మంత్రి ఇంట్లోని వెండి, ఇతర విలువైన వస్తువులు మాయం కావడంతో ఆయన కుటుంబ సభ్యులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకొచి కూపీ లాగగా గుట్టు రట్టయింది. గోయల్ వ్యక్తిగత కంప్యూటర్లోని అధికారిక రహస్య పత్రాలను విష్ణుకుమార్ చోరీ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. దీంతో అతని మొబైల్ ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్న అధికారులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద కూడా విచారణ మొదలుపెట్టారు. కంప్యూటర్ నుంచి ముఖ్యమైన ప్రభుత్వ డేటాను చోరీ చేసి ఆ రహస్య ఫైళ్లను గుర్తు తెలియని వ్యక్తులకు ఈమెయిల్ చేశాడు. అంతేకాదు ఈమెయిల్ చేసిన అనంతరం తన ఫోన్లోని సమాచారాన్ని విష్ణుకుమార్ డిలీట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో నిందితుడు కాల్ డేటాను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. మంత్రి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు చోరీ అయిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. -
గర్ల్ ఫ్రెండ్ కోసం భార్య హత్య: ఒరాకిల్ ఉద్యోగి అరెస్ట్
బెంగళూరు: అతికిరాతకంగా భార్యను హత్య చేసి 15 సంవత్సరాలుగా తప్పించుకు తిరుగుతున్న ఓ ప్రబుద్ధుడికి పోలీసులు చెక్ పెట్టారు. పేరు మార్చుకుని ప్రముఖ ఐటీ కంపెనీ ఒరాకిల్‌లో ఉద్యోగం వెలగబెడుతూ, సంవత్సరానికి రూ. 22 లక్షల జీతంతో దర్జాగా బతుకుతున్న తరుణ్ కుమార్ జినారాజ్, అలియాస్ ప్రవీణ్ (42) చివరకు కటకటాల వెనక్కి వెళ్లాడు. వివరాల్లోకి వెళ్లితే.. అహ్మదాబాద్ వాసి తరుణ్‌కు, బ్యాంకు ఉద్యోగి సాజ్నితో నవంబరు 15, 2002న వివాహం జరిగింది. కానీ పెళ్లయిన నాలుగు నెలలకే (2003 ఫిబ్రవరి,14) ఆమెను చున్నీతో గొంతు బిగించి హత్య చేశాడు. పైగా చోరీకి వచ్చిన దొంగలు ఆమెను హత్య చేసారని అత్తమామలు సహా అందర్నీ నమ్మించాడు. అయితే ఎన్నాళ్లనుంచో ఇతగాడికోసం గాలిస్తున్న పోలీసులు ఇటీవల తరుణ్ తల్లి అన్నమ్మని విచారించారు. ఆమె తరచూ బెంగళూరుకు వెళ్లి రావడంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె ఫోన్‌కాల్స్‌పై నిఘా పెట్టారు. ఇక్కడే బాబు పోలీసులకు చిక్కాడు. బెంగళూరు ఒరాకిల్ కార్యాలయంలోని ల్యాండ్‌లైన్ ద్వారా అన్నమ్మకు వచ్చిన ఫోన్ కాల్స్ పోలీసులు కూపీ లాగగా విషయం వెలుగులోకి వచ్చింది. అయితే విచారణ అధికారి కిరణ్ చౌదరికి ఒరాకిల్ ఆఫీసులో తరుణ్ ఆచూకీ అంత ఆషామాషీగా దొరకలేదు. చివరకు పాత ఫోటోల ద్వారా గుర్తించి, నాటకీయంగా డైరెక్టుగా తరుణ్ (ప్రవీణ్) క్యాబిన్ దగ్గరి కెళ్లి.."హలో తరుణ్, నీ కథ ముగిసింది ...లెట్స్ గో" అనడంతో ప్రవీణ్ అవాక్కయ్యాడు. మొదట్లో తిరస్కరించినా చివరికి నేరాన్ని అంగీకరించక తప్పలేదు. అంతేకాదు తన భార్య(నిషా)కు ఫోన్ చేసి తన అసలు స్వరూపాన్ని కూడా వివరించాడట. ఎలా తప్పించుకున్నాడు? మధ్యప్రదేశ్‌లోని మండౌరుకు చెందిన తన పాతస్నేహితుడి సర్టిఫికెట్లను దొంగిలించి ప్రవీణ్ భాట్లీగా అవతరించాడు. ఎవరూ గుర్తు పట్టలేనంతగా పూర్తిగా మారిపోయాడు. నకిలీ సరిఫికెట్లతో ముందు కొంతకాలం పుణేలో కాల్ సెంటర్లో పనిచేశాడు. అక్కడే 2009లో నిషాను పెళ్లి చేసుకున్నాడు. అనంతరం బెంగళూరు ఓరాకిల్ సంస్థలో ఎగ్జిక్యూటివ్‌గా ఉద్యోగంలో చేరాడు. నైట్ షిఫ్ట్‌లు మాత్రమే చేస్తూ తన గుట్టు ఎవరికీ తెలియకుండా గోప్యతను పాటించాడు. తల్లిదండ్రులు, తమ్ముడు కారు యాక్సిడెంట్లో చనిపోయాడని చెప్పి నమ్మించి మరీ నిషా పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సాజ్ని తల్లితండ్రులు కృష్ణన్, రమణి కేరళలోని త్రిసూర్‌కు చెందినవారు. ఆ తరువాత వారు అహ్మదాబాద్‌లో సెటిల్ అయ్యారు. అక్కడే పుట్టి పెరిగిన సాజ్ని బ్యాంకులో పని చేస్తున్నారు. వీరి పరిచయం నాటికి అహ్మదాబాద్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో వాలీబాల్ కోచ్ గా పని చేసేవాడు తరుణ్. అప్పటికే సాజ్ని పనిచేస్తున్న బ్యాంకు పనిమీద ఒకటి రెండు సార్లు సాజ్ని ఇంటికి వచ్చాడు తరుణ్. ఈ క్రమంలో పెద్దల అంగీకారంతోనే సాజ్నిని పెళ్లి చేసుకున్నాడు. తరుణ్ అరెస్ట్‌పై కృష్ణన్, తరుణ్ సంతోషం వ్యక్తం చేశారు. తమ బిడ్డ చనిపోయిన తరువాత తమ జీవితం శూన్యంగా మారిపోయిందనీ, ఈ రోజు కోసమే ఎదురు చూస్తూ బతికామని చెప్పారు. మొదట్లో మర్యాద ప్రవర్తనతో సాజ్ని భర్త, ఆ తరువాత పోలీస్ దర్యాప్తులో పోలీసులు తమను తప్పుదారి పట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. తరుణ్ గొప్ప నటుడు అనీ, అతని ప్రవర్తన తమకు ఎపుడూ అనుమానాస్పదంగా కనిపించలేదని, తమని చూడగానే లేచి నిలబడుతూ చాలా నెమ్మదిగా, సంస్కారవంతంగా ఉండేవాడని తెలిపారు. అప్పటికే మరో మహిళతో సంబంధమున్న సంగతి కూడా తమకు తెలియదన్నారు. కానీ పెళ్లి తరువాత అనుకున్నంత అతను మంచివాడు కాదంటూ తన కూతురు బాధపడిందనీ, తన డబ్బంతా తరుణ్ బలవంతంగా లాగేసుకుంటున్నాడని వాపోయిందని కూడా గుర్తు చేసుకున్నారు. పకడ్బందీగా హత్య దొంగతనం జరిగినట్టుగా ఇల్లంతా చిందర వందర చేశాడు. బీరువాలోని వస్తువులన్నీ లాగి పడేశాడు. సాజ్ని మెడలోని బంగారం గొలుసును రెండు ముక్కలు చేశాడు. విమాన టికెట్లను, కొంత సొమ్మును కూడా కింద పడేశాడు. (మరునాడు ఆమె ట్రైనింగ్ కోసం బయలుదేరాల్సి ఉంది). ఆమె చున్నీతోనే ఉరిబిగించి చంపేసినట్టుగా సీన్ క్రియేట్ చేశాడు. గాయాలు, షాకుకు గురయ్యాననే పేరుతో సమీపంలోని ఆసుపత్రి ఐసీయూలో చేరాడు. అనుమానం ఎక్కడ మొదలైంది మరునాడు పోస్ట్‌మార్టం అనంతరం ఇంటికి తీసుకొచ్చిన సాజ్ని మృతదేహాన్ని చూసి ఆసుపత్రి నుంచి వచ్చిన తరుణ్ బోరున విలపిస్తూ మరోసారి తన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించాడు. కానీ సాజ్నీ మెడలోని చున్నీని వాసన చూసిన స్నిఫర్ డాగ్స్ మాత్రం అతగాడి వాసన పసిగట్టాయి. గట్టిగా అరవడం మొదలు పెట్టాయి. దీంతో అప్పటివరకూ సంస్కారవంతమైన అల్లుడిగా భావించిన కృష్ణన్ , రమణలకు అనుమానం మొదలైంది. తమ కూతురు చెప్పిన సంగతులు గుర్తొచ్చాయి. అంతేకాదు..ఇక్కడ బోరున ఏడ్చి కారెక్కిన తరువాత నవ్వుతున్నాడంటూ అక్కడున్నవారు గొణుక్కోవడం కూడా సాజ్ని తల్లి చెవిన పడింది. దీంతో వారు తరుణ్‌పై కేసు నమోదు చేశారు. కానీ అప్పటినుంచి తరుణ్ పోలీసులకు దొరకకుండా పరారీలో ఉన్నాడు. 15సంవత్సరాల తరువాత కేసును ఎలా ఛేదించారు నిజానికి ఈ హత్య కేసు పదిహేను సంవత్సరాల తరువాత ఛేదించడమే విశేషం. ఇందుకు సాజ్ని తల్లి దండ్రులు పెద్దపోరాటమే చేశారు. తరుణ అరెస్ట్ అనంతరం మాట్లాడుతూ రాజకీయాల్లో చేరకు ముందు నుంచే ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోదీ బాగా తెలుసుననీ, ఆయన తరచుగా తమ ఇంటికి కూడా వచ్చేవారని రమణి చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే సాజ్ని హత్య జరిగాక దాదాపు ఆరేళ్ల తరువాత తమకు అత్యంత సన్నిహితుడి ద్వారా మోదీని పలుమార్లు కలిసి, తమకు న్యాయం చేయాల్సిందిగా అభ్యర్థించామని కృష్ణన్, రమణి దంపతులు వివరించారు. దీంతో జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎకె శర్మ , డీసీపి హిమాంశు శుక్లా ఆధ్వర్యంలో 6 సంవత్సరాల సుదీర్ఘ విచారణ ప్రారంభమైంది. ఆ తరువాత డీసీపీ దీపన్ భద్రాన్ ఆధ్వర్యంలోని బృందం చాకచక్యంగా తరుణ్ ఆట కట్టించింది. తరుణ్ తల్లికి వచ్చిన దాదాపు లక్ష ఫోన్ కాల్స్‌ను పరిశీలించామని అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ ప్రత్యేక పోలీసు కమిషనర్ జేకే భట్ చెప్పారు. వాలెంటైన్స్ డే గిఫ్ట్‌గా ఫిబ్రవరి 14న హత్య గర్ల్ఫెండ్కు వాలెంటైన్స్ డే గిఫ్ట్‌గా భార్య హత్య చేసినట్టుగా పోలీసులు విచారణలో తేలింది. భార్యను హత్య చేసిన అనంతరం గర్ల్‌ఫ్రెండ్‌కు ఫోన్ చేశాడు తరుణ్. కానీ హంతకులతో తనకు స్నేహం అక్కరలేదని ఖరాకండిగా తేల్చి చెప్పిందట ఆమె. -
చిత్తూరు జిల్లా పరిషత్ సమావేశంలో రసాభాస
-
చివరకు పవర్ బ్యాంకును కూడా..
సాక్షి, ముంబై: అతి విలువైన బంగారం అక్రమ రవాణాలో వింతపోకడలు పోలీసులు సైతం విస్తుపోయేలా చేస్తున్నాయి. టెక్నాలజీకి తగ్గట్టుగా ట్రెండ్ మారుస్తున్న అక్రమార్కులు టెక్నాలజీ బాగా వాడేస్తున్నారు. తాజాగా ఏకంగా స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్‌నకు ఉపయోగించే పవర్‌బ్యాంక్‌ను ఎంచుకున్నారు. ఇందులో గోల్డ్ బార్స్‌ను చాకచక్యంగా దాచిపెట్టి తప్పించుకోవాలని ప్రయత్నించారు. కానీ, చివరకు నిఘా అధికారులకు చిక్కక తప్పలేదు. పవర్ బ్యాంక్‌లో గోల్డ్ బార్స్‌ను పెట్టి అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని ముంబై ఎయిర్‌పోర్ట్‌లో సీఐఎస్ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. 600 గ్రాముల బంగారం బార్లను పవర్ బ్యాంకులో తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన సీఐఎస్ఎఫ్ సిబ్బంది వాటిని స్వాధీనం చేసుకొని అతడిని కస్టమ్ అధికారులకు అప్పగించారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ దాదాపు 18 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. మరో కేసులో 24 లక్షల రూపాయల విలువ చేసే బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి కొచ్చికి వచ్చిన సిద్ధిఖి వెల్లై మీరన్ ఖాదర్ మొహిదీన్ నుంచి సుమారు 800వందల గ్రాముల పసిడిని నిఘా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అండర్ గార్మెంట్స్‌లో దాచి పెట్టి అక్రమంగా రవాణా చేస్తుండగా పట్టుకున్నామని దీని విలువ రూ.24.36 లక్షలని కస్టమ్స్ కమిషనర్ సుమిత్ కుమార్ వెల్లడించారు. నిందితుడిని అరెస్ట్ చేశామని తెలిపారు. -
గ్యాంగ్‌స్టర్ అయూబ్ పై 72 కేసులు
-
కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ పట్టివేత
సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసులకు వాంటెడ్‌గా ఉన్న రౌడీషీటర్ అయూబ్ ఖాన్ ఆదివారం ముంబైలో చిక్కాడు. ఇతడిపై లుక్ ఔట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) జారీ అయి ఉండటంతో షార్జా నుంచి వస్తూ ఎయిర్‌పోర్ట్‌లో ఇమ్మిగ్రేషన్ సిబ్బందికి దొరికాడు. విషయం తెలుసుకున్న నగర పోలీసు అధికారులు ఓ ప్రత్యేక బృందాన్ని పంపి అయూబ్‌ను హైదరాబాద్ కు తీసుకువచ్చారు. ఫతేదర్వాజా ప్రాంతానికి చెందిన అయూబ్ ఖాన్ 1990లో హుస్సేనీఆలంలో నేరజీవితాన్ని ప్రారంభించాడు. అదే ఏడాది దోపిడీ, హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. దీంతో 1991లో హుస్సేనీఆలం పోలీసులు హిస్టరీ షీట్ తెరిచారు. అయూబ్ కాలాపత్తర్‌లోని తాడ్‌బండ్‌కు మకాం మార్చడంతో ఈ షీట్‌ను ఆ ఠాణాకు బదిలీ చేశారు. హత్య, హత్యాయత్నం, దోపిడీ, బెదిరింపులు, ఆయుధ చట్టం తదితర ఆరోపణలపై నగరంలో వివిధ పోలీసుస్టేషన్లలో 48 కేసులు నమోదు కావడంతో గ్యాంగ్‌స్టర్‌గా మారాడు. రెండేళ్ళ క్రితం విశాఖపట్నం నుంచి బోగస్ పాస్‌పోర్ట్ తీసుకున్న అయూబ్ దాని సాయంతో దుబాయ్ పారిపోయాడు. అక్కడ ఉండి నగరంలో వ్యవస్థీకృతంగా బంగారం స్మగ్లింగ్ సహా ఇతర దందాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నగరంలో నమోదైన కేసులకు సంబంధించి అయూబ్‌పై నాన్–బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. వీటి ఆధారంగా పోలీసులు ఎల్ఓసీ జారీ చేసి అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలకు పంపారు. విదేశాల్లో ఉన్న అయూబ్ ఏ ఎయిర్‌పోర్టులో దిగినా... అదుపులోకి తీసుకుని తమకు సమాచారం ఇవ్వాల్సిందిగా వాటిలో కోరారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం తెల్లవారుజామున షార్జా నుంచి అయూబ్ నేరుగా ముంబై చేరుకున్నాడు. హైదరాబాద్‌కు వస్తే పోలీసులకు చిక్కుతాననే ఉద్దేశంతో అక్కడి ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాడు. ఎల్ఓసీ జారీ అయిన విషయం గుర్తించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని అక్కడి ఎయిర్పోర్ట్ పోలీసులకు అప్పగించాయి. దీనిపై సమాచారం అందుకున్న నగర పోలీసు ఉన్నతాధికారులు అయూబ్‌ను తీసుకురావడానికి ఓ ప్రత్యేక బృందాన్ని అక్కడకు పంపారు. ఈ టీమ్ అయూబ్‌ఖాన్‌ను హైదరాబాద్ తీసుకువచ్చింది. విశాఖపట్నంలో మరో పాస్‌పోర్ట్ పొందడంతో ఏవైనా ఉల్లంఘనలకు ఉండి, ఆధారాలు లభిస్తే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడం ద్వారా కేసు నమోదు చేయించాలని భావిస్తున్నారు. -
ఖమ్మంలో వైఎస్ షర్మిళ పుట్టిన రోజు వేడుకలు
-
ఘనంగా దత్తాత్రేయ కూమార్తె వివాహం
-
పాక్ నుంచి పావురం రెక్కపై ఉర్దూలో రాసి
చంఢీఘడ్: రెక్కలపై ఉర్దూ భాషలో అక్షరాలు రాసివున్న పావురం పంజాబ్ లో కలకలం సృష్టించింది. ఈ పావురాన్ని పరిశీలిస్తున్న ఇంటిలిజెన్స్ అధికారులు పాకిస్తాన్-ఇండియా బోర్డర్ ను దాటి వచ్చినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హోషయాపూర్ జిల్లా మోట్లా గ్రామంలో ఓ వ్యక్తి తెల్లపావురం రెక్కలపై ఉర్దూలో రాసివుందని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దాంతో ఆ ప్రాంతానికి చేరుకుని పావురాన్ని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. పావురం రెక్కలపై ఉర్దూలో రాసివున్న అక్షరాలను ఆర్మీ, ఇంటిలిజెన్స్ అధికారులు పరిశీలించినట్లు పేర్కొన్నారు. పావురానికి ఎక్స్ రే స్కానింగ్ పరీక్ష కూడా చేయించినట్లు చెప్పారు. రెక్కలపై పదకొండు అంకెలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఆ నంబర్లు రహస్యంగా చేరవేస్తున్న ఫోన్ నంబరా? పాకిస్తాన్ నుంచి ఆ పావురం వచ్చిందా? వంటి కోణాల్లో దర్యాప్తు సాగుతున్నట్లు చెప్పారు. రెక్కలపై నంబర్లతో పాటు ఉర్దూలో కొన్ని పదాలతో పాటు గుర్తుతెలియని ఒక స్టాంప్ కూడా ఉందని పేర్కొన్నారు. కొన్ని పదాలను తర్జూమా చేయగా.. ఆదివారం, బుధవారం, గురువారం అని రాసి ఉందని తెలిపారు. గత ఏడాది కూడా పఠాన్ కోట్ జిల్లాలో రెక్కలపై ఉర్దూలో రాసివున్న పావురాన్ని అధికారులు గుర్తించారు. పఠాన్ కోట్ లోని ఎయిర్ ఫోర్స్ బేస్ పై ముష్కరాలు దాడి చేసిన విషయం తెలిసిందే. -
కౌన్సిలింగ్ పారదర్శకంగా జరుపుతాం
-
ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి
ఖమ్మం సిటీ: ఈ నెల 9న ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగరావు అన్నారు. నగరంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీఆర్ఎస్ నేతల ప్రోత్సాహంతో పోలీసులు, అటవీ అధికారులు కలిసి తమ పార్టీ కార్యకర్తలకు.. గిరిజనుల చెందిన నిలువెత్తున పెరిగిన పంట చేలను ట్రాక్టర్లతో దున్నించారని విమర్శించారు. టేకులపల్లి మండలం వాగొట్టుగూడెంలో మహిళలపై దాడి చేసి, సృహ కోల్పోయేలా కొట్టి 100 ఎకరాలలో పంట దున్నారని అన్నారు. ఇల్లందు ఏరియాలో ఎమ్మెల్యే, డీఎస్పీ కలిసి పేదలపై, గిరిజనులపై కక్షపూరితంగా దాడులు చేస్తున్నారని విమర్శించారు. ఇల్లందు ఏరియాలో పోలీసు రాజ్యాన్ని డీఎస్పీ సాగిస్తున్నారని అరోపించారు. గిరిజనులు, పేదలపై దాడులను నిరసిస్తూ ఈ నెల 8,9 తేదీలలో రాష్ట్రవ్యాపితంగా నిరసన చేపట్టనున్నట్టు చెప్పారు. సమావేశంలో నాయకులు రాయల చంద్రశేఖర్‌రావు, వెంకటేశ్వర్లు, ఆవుల వెంకటేశ్వర్లు, రామయ్య, అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఇండియన్ ప్రిన్సెస్ 2016 ఆడిషన్స్
-
1,500 మంది మహిళలను వేధించాడు..
న్యూఢిల్లీ: ఏడాదికాలంగా దేశవ్యాప్తంగా 1,500 మంది మహిళలకు ఫోన్లు చేసి అసభ్యకరంగా మాట్లాడుతూ, మెసేజ్ ల రూపంలో బూతులను పంపుతున్న వ్యక్తిని ఢిల్లీ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గుర్తు తెలియని వ్యక్తి ఎవరో ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని నగరానికి చెందిన ఓ ఐటీ ఉద్యోగిని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు వ్యక్తి ఫోన్ నంబర్ ఆధారంగా బలిమారన్ ప్రాంతంలో ఓ షాపు రన్ చేసే మహమ్మద్ ఖలీద్ గా గుర్తించారు. మహిళలకు అసభ్యకరమైన మెసేజ్ లు పంపి గుర్తించడానికి వీలు లేకుండా వెంటనే ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేస్తాడని వివరించారు. నకిలీ గుర్తింపు కార్డుల ద్వారా మూడు సిమ్ కార్డులను ఉపయోగిస్తూ గత ఏడాదిగా 1,500 మంది మహిళలను వేధించినట్లు తెలిపారు. వీరిలో కేవలం ఐదుగురు మాత్రమే పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పారు. నిందితుడి సిమ్ కార్డుల్లో దాదాపు 2,000 మంది ఫోన్ నంబర్లు ఉన్నాయని వాటిలో 1,500 నంబర్లకు తరచూ అసభ్యకరమైన మెసేజ్ లు పంపినట్లు చెప్పారు. కేసు విచారణ ఒక దశలో ఖలీద్ దొరికే అవకాశం లేదని భావించామని, అదే సమయంలో ఖలీద్ నంబర్ నుంచి జార్ఖండ్ లోని మహిళకు ఫోన్ చేయడంతో అతన్ని గుర్తించినట్లు తెలిపారు. అతని ఇంటి నుంచే ఈ ఫోన్లు రావడం గుర్తించిన పోలీసులు బృందంగా ఏర్పడి వలపన్ని ఖలీద్ ను పట్టుకున్నారు. ఖలీద్ దగ్గర ఉన్న సిమ్ కార్డులన్నీ చాందినీ చౌక్ లోని మొబైల్ షాపుల్లో కొనుగోలు చేసినట్లు వెల్లడించాడని చెప్పారు. ఈ నెంబర్లకు తరచూ ఖలీద్ రీచార్జ్ లు చేయించినట్లు కూడా గుర్తించినట్లు చెప్పారు. విచారణలో ఖలీద్ చెప్పిన విషయాలను విన్న పోలీసులు నివ్వెరపోయారు. రోజుకు 25 నుంచి 30 మంది మహిళలను వేధిస్తాడని నిందితుడు ఒప్పుకున్నట్లు తెలిపారు. అతను చెప్పినట్లు వినకపోతే ఫోన్ నంబర్లు, ఫోటోలను ఫేస్ బుక్ లో పెడతానని బెదిరించేవాడని చెప్పారు. ఖలీద్ కు పెళ్లి చూపుల సమయంలో వివాహం చేసుకోనని కొంతమంది అమ్మాయిలు నిరాకరించడం వల్లే మహిళలను వేధించడం ప్రారంభించినట్లు వెల్లడించారు. బాధితులకు సంబంధించిన ఇతర వివరాలు ఏమైనా ఖలీద్ వద్ద ఉన్నాయేమోనని అన్వేషిస్తున్నారు. సరైన డాక్యుమెంట్లు లేకుండా సిమ్ కార్డులను యాక్టివేట్ చేసినట్లు విచారణలో వెల్లడైతే టెలికాం ఆపరేటర్లకు 50 వేల జరిమానా ఉంటుందని వివరించారు. -
చిత్రం వెనుక కథ!
కొత్తగా పుట్టిన పిల్లలు నిద్రలో నవ్వుతుంటే... వారికి గతజన్మలో విషయాలు గుర్తుకొస్తాయని , దేవుడే ఆ చిన్నారులను నవ్విస్తాడని వారి వారి నమ్మకాలను బట్టి చెప్తుంటారు. అయితే ఫేస్ బుక్ లో ఇటీవల కనిపించిన ఓ పసిపాప చిత్రం.. కోట్ల హృదయాలను కొల్లగొట్టింది. కొత్తగా లోకంలో అడుగుపెట్టి, నిద్రలోనే బోసినవ్వులను కురిపిస్తూ కనిపించిన ఆ ఫోటో వెనుక కథ ఎందరినో కదిలింప జేసింది. సుమారు నలభై లక్షలమంది లైక్ చేసిన చిత్రం.. ఎనభైవేల సార్లు షేర్ కూడ అయ్యింది. ఇంతకూ ఆ చిత్రం వెనుక కథేమిటో చూద్దామా. తొమ్మిది నెలలు మోసి కని పెంచే తల్లితోపాటు, కంటికి రెప్పలా కాపాడే తండ్రి స్పర్శకు సంబంధించిన విషయం.. ప్రతి గుండెను తట్టింది. లోకం తెలీని పసిపాప ప్రస్తుతం నిద్రలో నవ్వులు చిందిస్తున్నా... ఊహ తెలిపిన తర్వాత ఎంత వేదన పడుతుందో అంటూ సానుభూతి వ్యక్తమౌతోంది. ఆమె పుట్టడానికి కేవలం నెల రోజుల ముందు బైక్ రేసర్ అయిన తండ్రి చనిపోయినా.. అతడు వాడిన గ్లౌజ్ లు, హెల్మెట్ స్పర్శతోనే ఆమె నిద్రలో నవ్వులు పూయించడం ఓ మిరాకిల్ గా మారింది. మోటార్ సైకిల్ రేస్ అంటే అమితంగా ఇష్టపడే హెక్టార్ డానియల్ ఫెర్రర్ అల్వరేజ్ ఫ్లోరిడాలో ఏప్రిల్ నెలలో స్నేహితుడి చేతులో హత్యకు గురయ్యాడు. ఆయన జ్ఞాపకాలను మరచిపోలేని అల్వరేజ్ భార్య.. కేథరిన్ విలియమ్స్.. ఆయన వాడిన గ్లౌజ్ లు , హెల్మెట్ ను అతడి ప్రేమకు గుర్తుగా భద్రపరచుకుంది. నెలరోజుల తర్వాత ఆయన గుర్తుగా బిడ్డ ఆబ్రే పుట్టినా... మామూలు ప్రపంచంలోకి రాలేకపోయింది. భర్తను తలచుకొంటూ, అతడి ప్రేమకు గుర్తుగా గ్లౌజ్ లు, హెల్మెట్ దాచుకుంది. బిడ్డను హత్తుకున్నట్లుగా, తండ్రి చేతుల్లోనే నిద్రపోతున్నట్లు గ్లౌజ్ లు, హెల్మెట్ బిడ్డను హత్తుకున్నట్లుగా పెట్టి ఫోటోలు తీయించింది. గాఢంగా నిద్రపోతున్న ఆ పసిపాప.. తండ్రి గ్లౌజుల స్పర్మ తగలగానే చిరునవ్వులు ప్రారంభించిందని, నిజంగా ఆ సన్నివేశం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించిందంటూ ఫోటోగ్రాఫర్ కిమ్ స్టోన్ వివరించాడు. పసిపాప అమ్మమ్మ ఫోటో సెషన్ కోసం తనను బుక్ చేసిందని, చిన్నారి పుట్టక ముందే ఆమె తండ్రి చనిపోయినట్లు ఆవిడ చెప్పిందని, ఆ సన్నివేశాలు చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాలను తీయాలంటూ తనను బుక్ చేశారని కిమ్ స్టోన్ తెలిపాడు. కుమార్తెను నిజంగా పట్టుకున్నట్లు గ్లౌజ్ లను పెట్టగానే..పసిపాప బోసి నవ్వులు చిందించడం ఆశ్చర్యం కలిగించినట్లు కిమ్ చెప్తున్నాడు. అలా కిమ్ తీసిన ఫోటోల్లోని ఓ చిత్రమే ఇప్పుడు ఫేస్ బుక్ లో వైరల్ గా మారింది. ఫొటో వివరాలను చెప్తూ కిమ్... సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అతి తక్కువ వ్యవధిలో కోట్లకొద్దీ మనసులను దోచుకుంది. ఆ చిట్టితల్లి చిరకాలం అలా నవ్వుతూనే ఉండాలంటూ ప్రతి మనసూ కోరుకుంది. స్టోన్ పోస్ట్ కు స్పందించిన విలియమ్స్.. అలాగే తన చిన్నారికి జీవితాంతం ప్రపంచవ్యాప్తంగా అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆయనకు సందేశాన్ని పంపింది. తన బిడ్డ కోసం ప్రపంచం ఎంత ప్రార్థించిందో ఆమె పెద్దయిన తర్వాత చూపిస్తానంటూ విలియమ్స్ తన సందేశంలో వివరించింది. తండ్రి కలలను ఫోటో నిజం చేసిందని, ఆయన చనిపోయినా చిరస్థాయిగా నిలిచేట్టు చేసిందని ఆమె సంతోషం వ్యక్తం చేసింది. నిద్రలో నవ్వుతుంటే పసిపాపలకు దేవుళ్ళు కనిపిస్తారంటారు... అది నిజంగా నిజమేనేమో అంటూ స్టోన్ వ్యాఖ్యానించగా.. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ఫోటోను చూసి, ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తండ్రి పాత్రకు తగిన గుర్తింపునిచ్చే ఉద్దేశ్యంతో సోనారా.. జూన్ మూడో ఆదివారాన్ని ఫాదర్స్ డే పండుగ వెలుగు చూసేలా చేస్తే... అదే సమయంలో.. తండ్రి స్పర్శ, జ్ఞాపకాలకు సంబంధించిన గుర్తులతో 'ఆబ్రే' ఫోటో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించడం.. అందమైన 'ఫాదర్స్ డే' ఉత్సవానికి మరో మచ్చుతునకైంది. -
బాలీవుడ్ ప్రముఖుల కాల్ రికార్డులు దోచేసి..
పేరున్న వ్యాపారవేత్తలు, బాలీవుడ్ స్టార్స్ కాల్ రికార్డులను సేకరిస్తూ పోలీస్ ఐటీ సెల్ విభాగం కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని గుడ్ గావ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసులు వివరాల ప్రకారం.. సెలబ్రిటీల కాల్ డేటాలను అందిస్తే ఉద్యోగం చూపుతానన్న వ్యక్తికి ప్రదీప్ కుమార్(30) సమాచారం చేరవేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ముంబైలో ఉంటున్న ఆ వ్యక్తి తన ఫేస్ బుక్ అకౌంట్ పేరును దీప్ బురాగా ఉంచినట్లు గుర్తించినట్లు తెలిపారు. ఇప్పటివరకు ఇరువురి మధ్య దాదాపు 15 మంది సెలబ్రిటీల కాల్ డేటాలు చేతులు మారినట్లు వివరించారు. ఫోన్ నంబర్లు ఏ సెలబ్రిటీకి చెందినవో కూడా కుమార్ కు తెలియదని, కేవలం ముంబైకు చెందిన వ్యక్తి డేటాను అందించి అప్పుడప్పుడు డబ్బులు తీసుకుంటుంటాడని ఎస్సై సజ్జన్ కుమార్ చెప్పారు. కుమార్ నుంచి ల్యాప్ టాప్, హార్డ్ డిస్క్, మొబైల్ ఫోన్, ఫేక్ ఐడీ కార్డును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బిలాస్ పూర్ లోని క్రైమ్ యూనిట్ 6 నుంచి అధికారిక ఈ మెయిల్ ఐడీ ద్వారా కాల్ రికార్డులు కావాలంటూ పంపడంతో ఈ ఉదంతం బయటకు వచ్చింది. -
డీజిల్ అక్రమ అమ్మకం:జీహెచ్ఎంపీ డ్రైవర్ల అరెస్టు
కీసర: జీహెచ్ఎంసీ వాహనాల నుంచి అక్రమంగా డీజిల్ ను దొంగలించి తరలిస్తున్న డ్రైవర్లను ఎస్ఓటీ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. గత కొంతకాలంగా జీహెచ్ఎంసీ వాహనాల్లోని డీజిల్ మిస్సవుతోందనే ఫిర్యాదులు అందుతుండటంతో అప్రమత్తమైన అధికారులు లారీల డ్రైవర్లను చాకచక్యంగా పట్టుకున్నారు. కీసర మండలం చిర్యాల వద్ద అక్రమంగా తూచిన డీజిల్ ను అమ్ముతున్న ముగ్గురు జీహెచ్ఎంసీ డ్రైవర్లను అరెస్టు చేసి విచారిస్తున్నారు. డ్రైవర్ల వద్ద నుంచి ఆరు డ్రమ్ముల డీజిల్ ను స్వాధీనం చేసుకున్నట్టు కీసర సీఐ గురువారెడ్డి తెలిపారు. -
రూ. 30 కోట్లు లంచమడిగి.. దొరికిన మంత్రిగారి పీఏ
ముంబై: భూమి కేటాయింపులకు సంబంధించి రూ. 30 కోట్ల లంచం డిమాండ్ చేసిన మహారాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఏక్ నాథ్ ఖడ్సే పీఏను ఏసీబీ పోలీసులు అరెస్టు చేశారు. ప్రముఖ ఆర్థికవేత్త రమేశ్ జాదవ్.. తన భూమికి సంబంధించిన ఎన్ఓసీ ఇవ్వాలంటూ మంత్రి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా.. ఖడ్సే పీఏగా చెప్పుకొంటున్న గగన్ జన్ పాటిల్ లంచం డిమాండ్ చేశారు. థానే జిల్లాలోని కళ్యాణ్ తాలుకాలో ఉన్న నిల్జే గ్రామంలో భూముల వివరాల కోసం జాదవ్ ను పాటిల్ 30 కోట్ల రూపాయలు కోరినట్లు తెలిపారు. 2004 లో నిల్జే తాను నడుపుతున్న స్వచ్ఛంద సంస్థ కోసం 37 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. స్థలానికి సంబంధించిన కాగితాలు అగ్నిప్రమాదంలో కాలిపోవడంతో ఎన్ఓసీ కోసం గత కొద్ది రోజులుగా జాదవ్ పాటిల్ తో సంప్రదింపులు చేస్తున్నట్లు వివరించారు. మొదట్లో కోటి రూపాయల నగదుతో పాటు ఫ్లాట్ ఇవ్వాలని కోరిన పాటిల్ తర్వాత రేటు పెంచేశాడని తెలిపారు. దీంతో జాదవ్ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)ను ఆశ్రయించగా.. పోలీసులు పాటిల్ ను పట్టుకున్నారు. ఈ విషయంపై స్పందించిన ఖడ్సే ఈ వివాదంతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. పాటిల్ తన నియోజకవర్గంలో చికిత్సల కోసం వచ్చే వారిని ముంబైకి తీసుకువచ్చే ఒక కార్యకర్తగా మాత్రమే తనకు తెలుసునని అన్నారు. ప్రభుత్వ లేదా ప్రైవేటు పరంగా పాటిల్ ను తన కార్యాలయంలో నియమించుకోలేదని వివరించారు. -
ఆర్ఎస్ఎస్ చీఫ్ ఫొటో మార్ఫింగ్, ఇద్దరి అరెస్ట్
కార్గాన్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ఫోటోను మార్ఫింగ్ చేసిన ఘటనలో ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మోహన్ భగవత్ ఫోటోను అభ్యంతరకంగా మార్పులు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడం, ఆ ఫోటో సామాజిక మాధ్యమంలో హల్ చల్ చేయడం మధ్యప్రదేశ్‌లో కలకలం సృష్టించింది. 22 ఏళ్ళ షాఖిర్, 20 ఏళ్ళ వసీమ్ అనే యువకులు మోహన్ భగవత్ చిత్రాన్ని మార్ఫింగ్ చేసి భికన్ గోన్ పట్టణంలోని స్థానిక సోషల్ నెట్ వర్కింగ్ గ్రూప్‌లో పోస్టు చేశారు. కాగా ఆ ఫొటోను మార్చి 16న పోస్టు చేసినట్లు గుర్తించామని, వారిద్దరినీ అరెస్టు చేసినట్లు ఏఎస్పీ అంతర్ సింగ్ కనేష్ వెల్లడించారు. మరోవైపు మోహన్ భగత్ మార్ఫింగ్ ఫొటోపై ఆర్ఎస్ఎస్, బిజెపి కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారిద్దరికీ వ్యతిరేకంగా ఐటీ చట్టం సెక్షన్ 67, భారత శిక్షాస్మృతి 505 (2) సెక్షన్లకింద భికాన్ గాన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేసినట్లు ఏఎస్పీ తెలిపారు. కోర్టు వారిద్దర్ని ఈనెల 30 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అయితే నిందితులు మాత్రం తమకు ఆ ఫొటో మరో గ్రూప్ నుంచి వచ్చిందని, కేవలం దాన్ని తాము పోస్టు చేసినట్లు చెప్తున్నారని ఏఎస్పీ పేర్కొన్నారు. -
కాల్‌మనీ వ్యవహారంలో కొత్త కోణాలు
-
సీఎంకు వ్యతిరేకంగా పోస్ట్ పెట్టి బుక్కయ్యాడు
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసి ఇబ్బందుల్లో పడ్డాడో జర్నలిస్టు. రాష్ట్రంలోని మాంది నగరానికి చెందిన రాజేశ్ శర్మ గురువారం సోషల్ మీడియాలో సీఎం కు వ్యతిరేకంగా కామెంట్స్ పోస్ట్ చేశాడు. దీంతో దుమారం రేగింది. తమ నేత ప్రతిష్టకు భంగం కలిగేలా రాజేశ్ శర్మ ఫేస్ బుక్ లో వ్యాఖ్యలు చేశాడంటూ కాంగ్రెస్ నాయకుడు పూరన్ చాంద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో జర్నలిస్టును పోలీసులు అరెస్ట్ చేశారు. ఇండియన్ పీనల్ కోడ్ లోని వివిధ సెక్షన్ల కింద అతడిపై కేసులు నమోదు చేశారు. -
మహిళా మావోయిస్టు అరెస్టు
కాంకేర్: ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో ఓ మహిళా మావోయిస్టును పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవలె రాయ్ పూర్ ప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎన్ కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. మావోయిస్టులను ఏరివేసే చర్యల్లో భాగంగా బీఎస్ఎఫ్ బలగాలు, పోలీసులు ఉమ్మడిగా గాలింపులు చేపడుతుండగా ఆయుధాలతో కొందరు మావోయిస్టులు తారసపడ్డారు. అయితే, ఎలాంటి కాల్పులు జరపకుండానే వారు పారిపోతుండగా వెంబడించిన బలగాలు వారిలో ఒక మహిళను అదుపులోకి తీసుకున్నారు. కాంకేర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఖాడ్కా గ్రామం సమీపంలో ఆమె పట్టుబడింది. ఆ మావోయిస్టు ఎవరనే వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. -
పర్వతపు అంచున నగ్నంగా ఫొటోలు.. అరెస్టు
కౌలాలంపూర్: పర్వతారోహణకు వెళ్లి శిఖరం అంచున నగ్నంగా ఫొటోలకు పోజులిస్తూ నిలుచున్న నలుగురు వ్యక్తులను మలేషియా పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయినవారిలో ఇద్దరు కెనడియన్లు ఒక డచ్ వ్యక్తి మరోకరు బ్రిటన్‌కు చెందినవారు ఉన్నారు. మలేషియాకు చెందిన కినాబలు పర్వతాన్ని అక్కడ ప్రజలు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇటీవలె అక్కడ 5.9 తీవ్రతతో భూకంపం వచ్చింది. అయితే, తాము పవిత్రంగా చూసే ఆ పర్వతంపైకి అంతకుముందు టూర్ పేరిట వచ్చిన కొందరు అసభ్యకరంగా బట్టలు విప్పేసి తిరగడం, శిఖరాగ్రాన్ని చేరి ఫొటోలు తీసుకోవడంవంటివి చేయడం మూలంగా దాని పవిత్రత దెబ్బతిన్నదని అందుకే భూకంపం వచ్చిందని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా అక్కడికి వచ్చిన ఇతర పర్యాటకులకు కూడా తీవ్ర ఇబ్బందులు కలిగించారని స్థానికులు ఆరోపణలు చేయడంతో పోలీసులు న్యూసెన్స్ కేసు కింద నలుగురిని అరెస్టు చేశారు. మరో ఆరుగురు టూరిస్టుల కోసం వెతుకుతున్నామని చెప్పారు. -
యువతుల అక్రమ రవాణా?
విజయనగరం: శ్రీకాకుళం నుంచి పూరి- తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వెళుతున్న పదిమంది యువతుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన విజయనగరం జిల్లా కేంద్రంలో గురువారం వేకువ జామున చోటుచేసుకుంది. ఒడిశా, శ్రీకాకుళం సరిహద్దు ప్రాంతానికి చెందిన 17 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న 10 మంది యువతుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని శిశు సంక్షేమ అధికారులకు అప్పగించారు. మహిళల అక్రమ రవాణా జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో విజయనగరం రైల్వే స్టేషన్లో వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని పోలీసులు ప్రశ్నించగా పొంతన లేని సమాధానలతో పాటు ఒరియా, తెలుగు భాషల్లో మాట్లాడుతున్నారు. భీమవరంలో ఓ చేపల చెరువు కాంట్రాక్టర్ వద్ద పనిచేసేందుకు వెళుతున్నామని యువతులు తెలిపారు. అయితే వారికి సంబంధించిన సమగ్ర వివరాలతో పాటు సదరు కాంట్రాక్టర్ గురించి తప్పుడు సమాచారం తెలిపినట్లు సమాచారం. మరో 7 మంది యువతులు పోలీసుల నుంచి తప్పించుకున్నారు. వీరిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
అటవీ ప్రాంతంలో నలుగురు మిలిషియా సభ్యులు అరెస్ట్
ఖమ్మం(చర్ల): చర్ల మండలం చెన్నాపురం అటవీ ప్రాంతంలో నలుగురు మావోయిస్టు మిలిషియా సభ్యులతో పాటు ఒక దళ సభ్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు చెన్నాపురం అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా పోలీసుల్ని చూసి పారిపోతుండగా వీరిని పట్టుకున్నారు. పట్టుబడిన వారిని విచారించగా తాము మిలిషియా సభ్యులమని ఒప్పుకున్నారు. పట్టుబడిన వారు: చెన్నాపురం గ్రామానికి చెందిన మరకం గంగ, మడివి మూడ, బక్కచింతలపాడు గ్రామానికి చెందిన బాడిక ఉంగయ్య, మడివి ఇలమయ్య లుగా నిర్ధారించగా..దళ మెంబర్ గోరుకొండ గ్రామానికి చెందిన మడవి రాములయ్యగా గుర్తించారు . -
ఖాకీ దొంగాట
-
ఇద్దరు ఆకతాయిల ఆటకట్టించిన యువతి
కర్నూలు: మహిళలపై, టీనేజ్ బాలికలపై లైంగిక వేధింపులు రోజూ ఏదో మూలన చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అయితే తనను కొంతకాలంగా వేధిస్తున్న ఇద్దరు యువకుల ఆటకట్టించింది ఓ యువతి. కర్నూలులో గత కొన్ని రోజులుగా ఓ యువతిని ఇద్దరు వేధిస్తున్నారు. శుక్రవారం ఆ ఇద్దరు ఆకతాయిలు మరోసారి ఆమె వెంటబడ్డారు. దీంతో ఓపిక నశించిన ఆ యువతి వారిని అడ్డుకోవడమే కాకుండా చెంప చెళ్లుమనిపించింది. అనంతరం ఆ యువకుల్ని పోలీసులకు అప్పగించింది. -
కోడి పందాల స్థావరాల పై పోలీసుల దాడి
-
సెర్చ్ ఆపరేషన్
-
పంధ్రాగస్టు వేడుకలకు రాజధాని సిద్దం