
ప్రముఖ మలయాళ నటుడు శ్రీజిత్ రవిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. లైంగిక ఆరోపణల కేసులో గురువారం పోలీసులు అతడి అదుపులోకి తీసుకున్నారు. శ్రీజిత్ ఇద్దరు మైనర్ బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. బాధిత బాలికలు ఫిర్యాదు మేరకు అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు.. గత సోమావారం రోజున (జూలై 4) తిస్సూర్‌లోని ఎస్‌ఎన్ పార్క్‌లో శ్రీజిత్ ఇద్దరు బాలికల పట్ల ఆసభ్యకరంగా ప్రవర్తించినట్లు పోలీసులు సీసీటీవీమ ఆధారంగా గుర్తించారు. బాలికల వయసు 9, 14 ఏళ్లుగా పోలీసులు గుర్తించారు.
చదవండి: టాలీవుడ్‌లో మరో విషాదం, ప్రముఖ నిర్మాత రాజేంద్రప్రసాద్ మృతి
దీంతో పోక్సో చట్టం కింద పోలీసులు అతడిని గురువారం అరెస్ట్ చేశారు. కాగా శ్రీజిత్ ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొవడం ఇది తొలిసారి కాదు. గతంలో కూడా అతడు ఇలాంటి ఆరోపణలను ఎదర్కొని అరెస్ట్ అయ్యాడు. 2016లో ఓట్టప్పలం పోలీసుల ఇలాంటి కేసులోనే అతడిని అరెస్ట్ చేశారు. కొందరు స్కూల్ గల్స్‌కు చెందిన గ్రూప్‌తో అసభ్యకరరీతిలో అతడి ప్రైవేటు పార్ట్స్‌ను చూపిస్తూ అసభ్యకర రితీలో ప్రవర్తించడమే కాకుండా బాలికల ఫొటోలను తీసుకున్నాడు. దీంతో స్కూల్ ప్రిన్స్‌పాల్‌య ఫిర్యాదుతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ప్రముఖ నటుడు టి.జి రవి కుమారుడైన శ్రీజిత్ రవి మాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటులలో ఒకరు. అతడు సహా నటుడిగా, విలన్‌గా పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందాడు.
చదవండి: ఖుష్బూ సుందర్‌కు కీలక బాధ్యతలు