ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌లు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు, పెట్టుబడులపై లోతుగా చర్చించినట్లు పేర్కొన్నారు. జీ20 సమ్మిట్ మొదటి సెషన్ అనంతరం ఇరు దేశాల నేతలు ప్రత్యేకంగా కలుసుకున్నారు. ప్రధాని మోదీని రిషి సునాక్ భారతీయ సాంప్రదాయంలో నమస్తేతో పలకరించారు.
🇬🇧🇮🇳
— Rishi Sunak (@RishiSunak) September 9, 2023
Two nations, one ambition.
An ambition rooted in our shared values, the connection between our people and – of course – our passion for cricket. pic.twitter.com/1W4wkiYCjY
'రెండు దేశాలు.. ఒకే ఆశయం. ఇరు దేశాల మధ్య పరస్పర విలువలు, ప్రజల మధ్య అనుబంధం ప్రత్యేకమైనవి' అని రిషి సునాక్ ట్విట్టర్(ఎక్స్) పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఇరు దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడుల వంటి ఒప్పందాల్లో మరింత పరస్పర సహకారం దిశగా అడుగులు వేయాలని చర్చించినట్లు రిషి సునాక్ తెలిపారు. ఇండియా, యూకేలు సుస్థిరాభివృద్ధి దిశగా ప్రయత్నాలు చేస్తాయని చెప్పారు.
జీ20 సదస్సుకు హాజరవడానికి రిషి సునాక్ ఢిల్లీకి చేరిన విషయం తెలిసిందే. ఈ రోజు జీ20 సమ్మిట్‌లో మొదటిరోజు ఢిల్లీ డిక్లరేషన్‌పై అన్ని దేశాల నేతలు ఏకాభిప్రాయానికి ఆమోదం తెలిపారు. అనంతరం ఇద్దరు నేతలు ప్రత్యేకంగా కలుసుకున్నారు.
ఇదీ చదవండి: G20 Summit: రిషి సునాక్, అక్షతా మూర్తి పిక్ వైరల్..
Comments
Please login to add a commentAdd a comment