భారత్‌ను ఇలా చూడడం గర్వంగా ఉంది: రిషి సునాక్‌ | UK PM Rishi Sunak Says He Likes G20 Theme And India - Sakshi
Sakshi News home page

భారత్‌ను ఇలా చూడడం గర్వంగా ఉంది: రిషి సునాక్‌

Published Fri, Sep 8 2023 6:32 PM | Last Updated on Fri, Sep 8 2023 7:31 PM

UK PM Rishi Sunak Says He Likes G20 Theme And India  - Sakshi

ఢిల్లీ: ఇండియాకు రావడం చాలా సంతోషంగా ఉందని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అన్నారు. మోదీ అంటే తనకు ప్రత్యేక అభిమానం అని అన్నారు. వసుధైక కుటుంబం అనే గొప్ప థీమ్‌తో జీ20 సమావేశం జరుగుతున్నందుకు సంతోషిస్తున్నట్లు చెప్పారు. జీ20 నిర్వహణకు భారత్ సరైన వేదిక అని రిషి సునాక్ తెలిపారు. భారత్‌-బ్రిటన్‌ మధ్య ప్రత్యేకమైన వాణిజ్య ఒప్పందానికి ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు. జీ20 కార్యక్రమాన్ని భారత్‌ దిగ్విజయంగా నిర్వహిస్తున్నందున గర్వంగా ఉందని అన్నారు. 

జీ20 థీమ్ వసుధైక కుటుంబంపై హర్షం వ్యక్తం చేశారు రిషి సునాక్. ఒకే కుటుంబం థీమ్.. భారత్-యూకే మధ్య స్నేహసంబంధాలకు సరిగ్గా సరిపోతుందని చెప్పారు. ఖలిస్థానీ వివాదంపై మాట్లాడిన రిషి సునాక్.. యూకేలో ఇలాంటి శక్తులకు స్థానం లేదని చెప్పారు. 

భారత్ అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపిన రిషి సునాక్.. తన కుటుంబం ఇక్కడి నుంచే ప్రారంభం అయిందని చెప్పడానికి ఏ మాత్రం సంకోచించనని అన్నారు. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంపై భారత్ తీరుపై ఆయన మాట్లాడారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో ఇండియా శాంతివైపే ఉంటుందని అన్నారు. 

ఇదీ చదవండి: ఢిల్లీకి చేరిన ఐఎంఎఫ్‌ చీఫ్‌.. ఫోక్ సాంగ్‌కు డ్యాన్సులు..


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement