యువతుల అక్రమ రవాణా? | 10 teenage girls held | Sakshi
Sakshi News home page

యువతుల అక్రమ రవాణా?

Published Thu, May 21 2015 8:06 AM | Last Updated on Sun, Sep 3 2017 2:27 AM

10 teenage girls held

విజయనగరం: శ్రీకాకుళం నుంచి పూరి- తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వెళుతున్న పదిమంది యువతుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన విజయనగరం జిల్లా కేంద్రంలో గురువారం వేకువ జామున చోటుచేసుకుంది. ఒడిశా, శ్రీకాకుళం సరిహద్దు ప్రాంతానికి చెందిన 17 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న 10 మంది యువతుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని శిశు సంక్షేమ అధికారులకు అప్పగించారు. మహిళల అక్రమ రవాణా జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో విజయనగరం రైల్వే స్టేషన్‌లో వీరిని అదుపులోకి తీసుకున్నారు.

 

వీరిని పోలీసులు ప్రశ్నించగా పొంతన లేని సమాధానలతో పాటు ఒరియా, తెలుగు భాషల్లో మాట్లాడుతున్నారు. భీమవరంలో ఓ చేపల చెరువు కాంట్రాక్టర్ వద్ద పనిచేసేందుకు వెళుతున్నామని యువతులు తెలిపారు. అయితే వారికి సంబంధించిన సమగ్ర వివరాలతో పాటు సదరు కాంట్రాక్టర్ గురించి తప్పుడు సమాచారం తెలిపినట్లు సమాచారం. మరో 7 మంది యువతులు పోలీసుల నుంచి తప్పించుకున్నారు. వీరిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement