డబుల్ డెక్కర్ టెక్నాలజీ.. ఈ తరానికి ఓ అదనపు సౌకర్యం. ప్రస్తుతం కుక్ వేర్‌లో కూడా అదే టెక్నాలజీని ఉపయోగించి.. శ్రమను, సమయాన్ని ఆదా చేస్తున్నాయి కంపెనీలు. భోజన ప్రియులకు రుచులను పండగ చేసుకోమంటున్నాయి. చిత్రంలోని ఇండోర్/అవుట్‌డోర్ గ్రిల్‌పై చికెన్, మటన్, ఫిష్, రొయ్యలు వంటివెన్నో గ్రిల్ చేసుకోవడం, ఆమ్లెట్స్, పాన్‌కేక్స్ వంటివెన్నో కుక్ చేసుకోవడం తేలిక. టు ఇన్ వన్ నాన్‌స్టిక్ గ్రిల్ ప్లేట్ (రిమూవబుల్ డబుల్ జోన్ నాన్‌స్టిక్ బేక్ వేర్) ఉన్న ఈ మేకర్ పైభాగంలో చాలా రుచికరంగా క్రిస్పీగా సిద్ధం చేసుకోవచ్చు. ఇక కింద భాగంలో అటు నాలుగు, ఇటు నాలుగు మినీ పాన్‌ప్లేట్స్ పెట్టుకుని ఎనిమిది రకాల వెరైటీలను తయారుచేసుకోవచ్చు. 1500ఠీ సామర్థ్యం గల ఇంటెలిజెంట్ థర్మోస్టాట్ టెక్నాలజీ కలిగిన ఈ మేకర్‌కు వెనుకవైపు ఉన్న రెగ్యులేటర్‌లో టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు. గాడ్జెట్ నుంచి గ్రిల్ ప్లేట్స్‌ను చాలా సులభంగా వేరు చేసుకోవచ్చు. దాంతో శుభ్రం చేసుకోవడం ఈజీ అవుతుంది.
ధర 89 డాలర్లు (రూ.6,529)
డిజిటల్ ఎయిర్ ఫ్రైయర్ ఓవెన్
చిన్న చిన్న పార్టీలు, ఫంక్షన్స్‌కి చాలా చక్కగా, అనువుగా ఉండే ఈ ఫ్యామిలీ సైజ్ ఓవెన్.. ఎయిర్ ఫ్రైయర్‌లా కూడా పనిచేస్తుంది. డిజిటల్ టచ్‌స్క్రీ¯Œ తో ఆయిల్‌లెస్ రుచులని అందిస్తుంది. చికెన్, ఫిష్, పిజ్జా, కేక్, స్టిక్స్, వింగ్స్, కుకీస్, ఫ్రెంచ్‌ఫ్రైస్ ఇలా చాలానే చేసుకోవచ్చు. 1700గి సామర్థ్యం కలిగిన ఈ మేకర్‌కి ముందు భాగంలో దానికి ఆనుకునే గుండ్రటి మూత ఉంటుంది. దాన్ని పైనుంచి కిందకు ఓపెన్ చేసుకోవచ్చు. లోపల ట్రాన్స్‌పరెంట్ బౌల్ పెట్టుకుని.. మూడు సొరుగులుగా గ్రిల్ ప్లేట్స్ అమర్చి, వాటిపై ఆహారాన్ని బేక్ చేసుకోవచ్చు. ఇందులో 3600ఊ వద్ద పిజ్జా 10 నిమిషాలు, కూరగాయలు 12 నిమిషాలు, ఫిష్ 15 నిమిషాలు, కేక్ 30 నిమిషాలు సమయం పడుతుంది. 4300ఊ వద్ద.. పాప్‌కార్న్ 8 నిమిషాలు, చికెన్ వింగ్స్ 10 నిమిషాలు, ఫ్రెంచ్‌ఫ్రైస్ 20 నిమిషాలు, హోల్ చికెన్ 30 నిమిషాలు సమయం తీసుకుంటాయి. అధిక–నాణ్యత గల మెటీరియల్‌తో రూపొందిన చికెన్ ఫోర్క్, డిప్ ట్రే, రొటేటింగ్ బాస్కెట్, ఎయిర్ ఫ్లో రాక్స్, మెస్ బాస్కెట్ వంటివన్నీ మేకర్‌తో పాటు లభిస్తాయి. ఈ గాడ్జెట్ 80 శాతం నూనె వాడకాన్ని తగ్గించి ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. ఆప్షన్స్ అన్నీ మేకర్ ముందువైపు డిస్‌ప్లేలో బొమ్మలతో సహా వివరంగా కనిపిస్తుంటాయి. దాంతో దీన్ని ఆపరేట్ చెయ్యడం ఎవరికైనా సులభమే.
ధర 119 డాలర్లు (రూ. 8,729)
మ్యాజికల్ స్మార్ట్ కుకర్
ఎలక్ట్రిక్ మేకర్స్ ఎప్పటికప్పుడు కొత్త హంగులతో వినియోగ దారులని ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గృహిణుల శ్రమను తగ్గించే ఇలాంటి మేకర్స్‌కి మార్కెట్‌లో ప్రత్యేక స్థానం ఉంది. ఈ మ్యాజికల్ స్మార్ట్ మేకర్.. ఎయిర్ ఫ్రైయర్‌లా, ప్రెషర్ కుకర్‌లా పని చేస్తుంది. అందుకు చెయ్యాల్సింది కేవలం మూతలు మార్చడమే. స్టీమర్ బాస్కెట్, రోస్ట్ రాక్, రెసిపీ బుక్, గ్లాసులు, గరిటెలు, మిట్స్ (చేతులు కాలకుండా ఉపయోగ పడేవి) వంటివన్నీ మేకర్‌తో లభిస్తాయి. దాంతో ఇందులో సూప్స్, నూడూల్స్, కేక్స్, హోల్ చికెన్‌తో పాటు అన్నిరకాల రైస్ ఐటమ్స్ రెడీ చేసుకోవచ్చు. గాడ్జెట్ ముందు వైపు ఉన్న ఆప్షన్స్ ప్రెషర్ కుకర్‌కు, ఎయిర్ ఫ్రైయర్ లిడ్ మీద ఉన్న ఆప్షన్స్ ఫ్రైయర్ కోసం కేటాయించినవి. వాటిని సెట్ చేసుకుని టైమింగ్, టెంపరేచర్ ఫిక్స్ చేసుకుని, అవసరాన్ని బట్టి మూత మార్చుకుంటే సరిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment