నేడూ రాష్ట్రంలో వడగాడ్పులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా గురువారం అన్ని జిల్లాల్లో పలుచోట్ల తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. బుధవారం ఆదిలాబాద్, హన్మకొండల్లో 44 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని పేర్కొంది. హైదరాబాద్‌లో బుధవారం గరిష్టంగా 40.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించింది.
వడదెబ్బతో 48 మంది మృతి
సాక్షి నెట్‌వర్క్: తెలంగాణ జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు వడదెబ్బ బారిన పడి 48 మంది మృత్యువాత పడ్డారు. నల్లగొండ జిల్లాలో 12 మంది, కరీంనగర్ జిల్లాలో ఏడుగురు, ఆదిలాబాద్ జిల్లాలో నలుగురు, నిజామాబాద్ జిల్లాలో ఒకరు, వరంగల్‌లో 6, పాలమూరు జిల్లాలో 8 మంది, ఖమ్మం జిల్లాలో 8, రంగారెడ్డిలో ఇద్దరు మృత్యువాత పడ్డారు.
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఇలా..
ప్రాంతం ఉష్ణోగ్రత
ఆదిలాబాద్ 44.3
హన్మకొండ 44.2
నిజామాబాద్ 43.5
మెదక్ 42.9
భద్రాచలం 42.8
రామగుండం 42.8
నల్లగొండ 42.0
ఖమ్మం 41.4
హైదరాబాద్ 40.8
ఆంధ్రప్రదేశ్
తిరుపతి 40.2
విజయవాడ 39.6
విశాఖపట్నం 37.2
కడప 34.5