ఆలేరు: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ము గ్గురు మృతిచెందారు. జిల్లాలోని ఆలేరు, చివ్వెంల మండలాల పరిధిలో చోటు చేసుకున్న ఘటనల వివరాలు.. వరంగ ల్ జిల్లా కొడకొండ్ల మండలం పాకాల గ్రామానికి చెందిన శ్రీధర్‌రెడ్డి(25), కరీంనగర్ జిల్లా సైదాపేట మండలం ఆకుకుంట్ల గ్రామానికి చెందిన కోళ్ల సుమన్‌రెడ్డి(24)లు తెల్లవారుజామున బైక్‌పై హైదరాబాద్ నుంచి ఆలేరు మీ దుగా వరంగల్‌కు వెళ్తున్నారు. ఈ సమయంలో స్థానిక ఇండియన్ పెట్రోల్ బం క్ ఎదుట వీరి బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్ పై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న బైక్ పూర్తిగా దగ్ధమైంది. అయితే పెట్రోల్ బంక్ నుంచి సుమారు 200మీటర్ల దూరానికి వీరి బైక్‌ను ఢీకొట్టిన వాహనం ఈడ్చుకెళ్లింది. బైక్ పూర్తిగా గుర్తుపట్టరాని విధంగా దగ్ధమైంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాఘవేందర్ తెలిపారు.
ప్రాణం తీసిన నిద్రమత్తు
ఐలాపురం(చివ్వెంల): వరంగల్ జిల్లా మల్లంపల్లి నుంచి దామరచర్ల మండలంలోని ఇండెన్ సిమెంట్‌కు మట్టిలోడుతో ఆదివారం తెల్లవారుజామున వెళ్తోంది. లారీ చివ్వెంల మండల పరిధిలోని ఐలాపురం గ్రామస్టేజీ వద్దకు రాగానే డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకున్నాడు. దీంతో లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో గుర్రంపోడు మండలం చింతగూడెం ఆవాసం శాఖాజీపురం గ్రామానికి చెందిన లారీక్లీనర్ గొడ్డెటి సత్యనారయణ(23) తలకు తీవ్రగాయలై అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్ అమరబోయిన ఏడుకొండలుకు తీవ్రగాయలయ్యాయి. పోస్తుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.మృతుడు అవివాహితుడు. మృతుడి తండ్రి బుచ్చయ్య ఫిర్యాదు మేరకు ఏఎస్‌ఐ రామచంద్రరావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రాణం తీసిన నిద్రమత్తు
Published Sun, May 24 2015 11:50 PM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM
Advertisement
Advertisement