సాక్షి, సంగారెడ్డి: జోగిపేట/వట్‌పల్లి(అందోల్): తల్లి మృతితో అప్పటికే కడుపు నిండా బాధతో ఉన్నారు.. కాస్త కడుపు నింపుకొందామనుకుని తిన్న ఆహారం కాస్తా యమపాశంగా మారింది. తిన్న జొన్న రొట్టెలే ప్రాణాలు హరించాయి. తల్లి 10 రోజుల కింద జొన్న రొట్టె తిని అస్వస్థతకు గురై మరణించింది. ఆమె అంత్యక్రియలకు వచ్చిన ఇద్దరు కుమారులు, ఒక కోడలు సైతం జొన్న రొట్టెలు తిని విగతజీవులయ్యారు. మరో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. 10 రోజుల వ్యవధిలోనే ఒకే కుటుం బంలో నలుగురు మృతి చెందడం తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ విషాదకర ఘటన సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం పల్వట్లలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, కుటుం బసభ్యులు తెలిపిన ప్రకారం.. పల్వట్లకి చెందిన మఠం శంకరమ్మ (80) ఈనెల 13న విరేచనాలు, వాంతులతో అస్వస్థతకు గురై మృతి చెందింది. ఆమె దశదినకర్మ ముగిసిన అనంతరం, సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఉన్న జొన్న పిండితో రొట్టె లు చేసుకుని శంకరమ్మ కుమారులు చంద్రమౌళి (55), శ్రీశైలం (48), కోడళ్లు సుశీల (60), అనసూజ, సరిత తిన్నారు. చదవండి: మొన్న తమ్ముడు.. నేడు అన్న
మనవలు, మనవరాళ్లు శిరీష, సంధ్య, సాయి వరుణ్ రొట్టెలు వద్దనడంతో వారికి అన్నం వండి పెట్టారు. రొట్టెలను తిన్న వారికి కొద్ది సేపటికే మత్తు రావడంతో కొద్దిసేపు పడుకున్నా రు. గంట తర్వాత విరేచనాలు, వాంతులు కావడంతో మనవలు, మనవరాళ్లు ఇంటి పక్క వారి సాయంతో 108 వాహనంలో జోగిపేట ప్రభుత్వ ఆ సుపత్రికి తరలించారు. అక్కడి నుంచి సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించేలోపే చంద్రమౌళి, సుశీ ల మృతి చెందారు. శ్రీశైలం, సరితను మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా కు, అనసూజను బాలానగర్‌లోని బీబీఆర్ ఆస్పత్రికి తరలిం చారు. ఉస్మానియా ఆస్పత్రిలో సోమవారం రాత్రి శ్రీశైలం కూడా మరణించాడు. సరిత, అనసూజ పరిస్థి తి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, తల్లి శంకరమ్మ దహన సంస్కారాలు నిర్వహించిన ఆమె చిన్న కుమారుడు సంతోష్ తన భార్యతో కలసి నారాయణఖేడ్ వెళ్లడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.
విష పదార్థాలు కలిసుండొచ్చు
జొన్నపిండిలో ఏమైనా విషపదార్థాలు ఉన్నాయా.. లేదా అన్నదానిపై మూడు రోజుల్లో నివేదిక వస్తుంది. పిండి, రొట్టెలను స్వాధీనం చేసుకొని నాచారం వద్ద పరీక్ష కేంద్రానికి పంపించాం. పిండిలో క్రిమి సంహారక మందులు కలిస్తే తప్ప ఇంత ప్రమాదం జరగదు. క్రిమిసంహారక మందు వంటిది ఉంటేనే గంటలోపు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. శిరీష అనే అమ్మాయి కొంత భాగమే తినడంతో ప్రమాదం నుంచి బయటపడింది.
–మోజీ రాం రాథోడ్, డీఎంహెచ్‌వో, సంగారెడ్డి
జొన్నలు విషపూరితం కావు..
జొన్నలను మరాడించాక 2 నెలల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. అంతకుమించి నిల్వ ఉంటే పురుగు పడుతుంది. విషపూరితం మాత్రం కాదు. పురుగులు పట్టిన పిండిని రొట్టె చేసుకొని తింటే స్వల్ప ఆరోగ్య సమస్యలే వస్తాయి. జొన్నలను మర ఆడించేటప్పుడు (గిర్ని) లేదా ఇంట్లో రొట్టెలు చేసుకునే సమయంలో ఇతర పిండి కలిసినట్లయితే కొద్ది గా విషతుల్యం కావచ్చు. జొన్న పిండిని నానబెట్టి కొద్దిగా వాడినట్లయితే కూడా ఫంగస్ వచ్చి విషమమ్యే అవకాశం ఉంది. బల్లి, పాములు, ఇతర విషపూరిత క్రిమికీటకాలు పిండిలో ఎక్కువసేపు ఉన్నా విషపూరితం కావచ్చు
– నర్సింహారావు, జిల్లా వ్యవసాయాధికారి, సంగారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment