సాక్షి, అల్లూరి: పాడేరులోని గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. నిల్వ ఉంచిన ఆహారం విద్యార్థినులకు పెట్టడంతో వారికి వాంతులు, విరేచనాలు కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
వివరాల ప్రకారం.. అల్లూరి జిల్లా పాడేరులోని గోమంగి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా ఎనిమిది మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. నిల్వ ఉంచిన ఆహారం విద్యార్థినులకు పెట్టడంతో వారికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. వారి పరిస్థితి సీరియస్‌గా మారడంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్ధినులను చూసి వారి పేరెంట్స్ ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాపాయం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, మెగా పేరెంట్ టీచర్స్ మీట్‌లో మిగిలిపోయిన వంటకాలను గురుకుల సిబ్బంది మరుసటి రోజు వడ్డించినట్టు సమాచారం. దీని వల్లే వారు అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment