సాక్షి, కర్నూలు: జిల్లా శివారులోని డంప్ యార్డ్ వద్ద భారీ బాంబు పేలుడు సంభవించటంతో ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అసలు ఏంజరిగిందో అర్థం కాక ప్రజలు, అధికారులు అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. వివరాలు.. డంప్ యార్డు పరిసర ప్రాంతాల్లో రెవెన్కూ, పోలీసు అధికారులు భూసర్వే చేస్తుండగా ఒక్క సారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏఎస్‌ఐ జంపాల శ్రీనివాస్‌తో సహా మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలస్తోంది. మరికొంత మంది తీవ్ర గాయాలపాలయ్యారు. సంఘటన స్థలానికి చేరుకున్న ప్రజలు, అధికారులు క్షతగాత్రులను అసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసుల వివరాలు సేకరిస్తున్నారు. పేలుడుకు గల కారణాలను పోలీసుల పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సివుంది.
Comments
Please login to add a commentAdd a comment