bomb explosion
-
రక్తంతో తడిసి ముద్దయిన రైల్వే స్టేషన్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ రైల్వే స్టేషన్లో సంభవించిన భారీ పేలుడులో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. క్వెట్టా రైల్వే స్టేషన్ మొత్తం రక్తంతో తడిసి ముద్దయ్యింది. మృతుల సంఖ్య 25కి చేరిందని, క్షతగాత్రుల్లో ఇంకొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరగవచ్చని అక్కడి అధికారులు తెలిపారు. అసలేం జరిగిందంటే.. క్వెట్టా రైల్వే స్టేషన్ సమీపంలో ఇవాళ ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటి స్టేషన్ పైకప్పు ఎగిరిపోయింది. ప్లాట్ఫారం మీద ఉన్న ప్రయాణికులంతా చెల్లాచెదురుగా పడిపోయారు. పేలుడు సమయంలో రైల్వే స్టేషన్లో జాఫర్ ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫాం నుంచి పెషావర్‌కు బయలుదేరడానికి సిద్ధంగా ఉందని.. అదే సమయంలో పేలుడు చోటు చేసుకుందని అక్కడి మీడియా వెల్లడించింది. మరోవైపు.. బలూచ్ లిబరేషన్ ఆర్మీ సంస్థ పేలుడు జరిపింది తామేనని ప్రకటించుకుంది. మానవ బాంబుతో..క్వెట్టా నుంచి పెషావర్‌కు జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు బయలుదేరే సమయంలో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇప్పటివరకు 25 మంది మృతి చెందారు’ అని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆపరేషన్స్ ముహమ్మద్ బలోచ్ తెలిపారు. మృతుల్లో ఎక్కువగా సైనికులు ఉండడంతో.. వాళ్లనే లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. పేలుడు జరిగిన విధానం బట్టి ఆత్మాహుతి దాడిగా నిర్ధారణకు వచ్చారు. A tragic loss of 24 innocent lives in the suicide attack at Quetta Railway Station in Balochistan. Strongly condemn this cowardly act. Heartfelt condolences to the families of the martyrs and prayers for the swift recovery of the injured. #Quetta pic.twitter.com/NDtlfAhKEn— Azam Joyo A J (@AzamJoyo01) November 9, 2024 #BREAKING: 21 killed and over 30 injured in a bomb blast at Quetta Railway Station in Balochistan. Baloch Liberation Army claims responsibility for the attack on Pakistan Army’s unit while they were in Jaffer Express Train. Casualties likely to increase. pic.twitter.com/ob2on4rJ7M— Aditya Raj Kaul (@AdityaRajKaul) November 9, 2024 -
సిరియాలో బాంబు పేలి.. ఏడుగురు చిన్నారులు మృతి
డెమాస్కస్: సిరియాలో కల్లోలిత దరా ప్రావిన్స్‌లో రోడ్డు పక్కన అమర్చిన బాంబు పేలిన ఘటనలో ఏడుగురు చిన్నారులు చనిపోగా మరో ఇద్దరు గాయపడ్డారు. బాంబు పేలుడుకు బాధ్యులెవరో తెలియా ల్సి ఉంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు దరా ప్రావిన్స్‌లో జరిగిన వివిధ ఘటనల్లో 100 మందికి పైగా చనిపో యారు. ఇజ్రాయెల్ ఆక్రమిత గొలాన్ హైట్స్, జోర్డాన్‌కు మధ్యలో దరా ప్రావిన్స్ ప్రాంతముంది. సిరియాలో 2011లో అంతర్యుద్ధానికి బీజం పడిందిక్కడే. -
కారు బాంబు పేలి.. ఏడుగురి దుర్మరణం
కాబూల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో శుక్రవారం జరిగిన బాంబు పేలుడులో ఏడుగురు చనిపోయారు. చిన్నారులు సహా 41 మంది గాయపడ్డారు. మసీదుకు సమీపంలో రోడ్డు పక్కన ఉంచిన కారు బాంబు పేలిందని తాలిబన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. తర్వాత కాల్పులు వినిపించాయన్నారు. తాలిబన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉగ్ర సంస్థ ఇస్లామిక్ స్టేట్ అఫ్గాన్‌లో తరచూ హింసాత్మక చర్యలకు పాల్పడుతోంది. ఇదీ చదవండి: రిసార్టులో 19 ఏళ్ల యువతి హత్య.. బీజేపీ నేత కుమారుడు అరెస్టు -
ఎస్వీయూలో పేలిన నాటుబాంబులు
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ వసతి గృహాల్లో నాటుబాంబుల పేలుళ్లు సంచలనం కలిగించాయి. బుధవారం రాత్రి, గురువారం ఉదయం ఇవి పేలాయి. బుధవారం అర్ధరాత్రి నిద్రలో ఉన్న విద్యార్థులు బాంబు పేలుడుతో లేచి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. హెచ్ బ్లాక్ సమీపంలో వేటగాళ్లు అడవిపందులు, ఇతర వన్యమృగాల కోసం పెట్టిన నాటుబాంబులు ఈ కలకలం రేపాయి. ఈ బాంబుల పేలుళ్లలో ఒక పంది, ఒక కుక్క మృతిచెందాయి. ఈ పేలుళ్ల నేపథ్యంలో యూనివర్సిటీ పోలీసులు, బాంబు, డాగ్ స్క్వాడ్ల వారు రంగంలోకి దిగి హెచ్ బ్లాక్ పరిసరాలు జల్లెడ పట్టారు. పేలని రెండు నాటుబాంబులను గుర్తించారు. ఈ సంఘటనకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వన్యమృగాల కోసమే... ఎస్వీ యూనివర్సిటీ శేషాచలం అటవీప్రాంతం దిగువన ఉండటంతో ఈ క్యాంపస్‌లో అడవిపందులు, జింకలు, కణితి ఇతర జంతువులు సంచరిస్తుంటాయి. అడవి జంతువుల కోసం వేటగాళ్లు వర్సిటీ వసతి గృహాల సమీపంలో నాటుబాంబులు పెట్టారు. బాంబులు కొరికిన పంది, కుక్క అవి పేలడంతో మృతిచెందాయి. విద్యార్థులు నిత్యం సంచరించే ఈ ప్రాంతంలో నాటుబాంబులు పెట్టడంతో వారు ఆందోళనకు గురవుతున్నారు. ఈ సంఘటనపై వర్సిటీ ఎస్ఐ సుమతి మాట్లాడుతూ వన్యప్రాణుల కోసం పెట్టిన ఈ బాంబులు పేలుడు గుణం కల్గిన టపాసుల్లో వాడే మందుతో తయారు చేసినవని చెప్పారు. వర్సిటీ రిజిస్ట్రార్ శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ అంశంపై ఏఐఎస్ఎఫ్ నాయకులు రిజిస్ట్రార్‌కు వినతిపత్రం సమర్పించారు. వర్సిటీ ఆవరణ చుట్టూ ఫెన్సింగ్ వేయించాలని, వర్సిటీలో భద్రత పెంచాలని కోరారు. -
కొడుకును వేసేద్దామనుకున్నాడు.. కానీ
కోల్‌కతా: కోల్‌కతాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్న కొడుకును ఖతం చేద్దామనుకున్న తండ్రి అనూహ్యంగా తనే ప్రాణాలు విడిచాడు. కొడుకు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల సమాచారం ప్రకారం.. మద్యానికి బానిసైన షేక్ మట్లబ్ (65) కుటుంబంతో తరచూ గొడవ పడుతుండేవాడు. అతని కొడుకు షేక్ నాజీర్ సమీపంలోని ఓ కర్మాగారంలో పని చేసేవాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం పని ముగించుకుని ఇంటికి వచ్చిన షేక్ నజీర్‌కు తండ్రి మద్యం మత్తులో కనిపించాడు. దీంతో నజీర్ తండ్రితో గొడవకు దిగాడు. మాటామాటా పెరడంతో.. షేక్ మట్లబ్ నాటు బాంబుతో కొడుకుపై దాడి చేసేందుకు యత్నించాడు. తండ్రి చేతిలో బాంబు చూసిన నజీర్ అతడి చేయి పట్టుకుని ఆపే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో చేతిలోనే బాండు పేలి ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. బాంబు శబ్దం విన్న స్థానికులు ఘటనా స్థలానికి వెళ్లి చూడగా ఇద్దరూ తీవ్ర గాయాలతో కనిపించారు. వారిని స్థానిక ఆర్జీ కర్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. వారికి చికిత్స అందిస్తుండగా తండ్రి షేక్ మట్లబ్ మృతి చెందగా కొడుకు షేక్ నజీర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే షేక్ మట్లబ్‌కు ఆ బాంబ్ ఎక్కడి నుంచి వచ్చింది.. ఇంకా ఘటనా స్థలంలో ఏమైనా బాంబులు ఉన్నాయని పోలీసులు బృందం గాలించింది. షేక్ మట్లబ్‌కు నేర చరిత్ర ఉందని, కొన్నేళ్ల క్రితం పలు కేసుల్లో అతను నిందితునిగా ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. -
అమెరికాలోని నాష్‌విల్లేలో బాంబు పేలుడు
నాష్విల్లే : అమెరికాలోని నాష్విల్లే డౌన్టౌన్లో శుక్రవారం పేలుడు సంభవించింది. దట్టమైన నల్లటి పొగ వ్యాప్తించిందని స్థానికులు చెప్పారు. పేలుడు ఘటనలో కొన్ని ఇళ్లు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. కిటికీలు పగిలిపోయాయి. ముగ్గురు గాయపడ్డారు. గుర్తు తెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ఈ పేలుడుకు పాల్పడినట్లు భావిస్తున్నామని అధికారులు చెప్పారు. దీనిపై ఎఫ్‌బీఐ దర్యాప్తు ప్రారంభించింది. నాష్విల్లే డౌన్‌టౌన్ ప్రముఖ పర్యాటక ప్రాంతం. ఇక్కడ బార్లు, రెస్టారెంట్లు అధికంగా ఉంటాయి. క్రిస్మస్ పండుగ రోజే పేలుడు జరగడం చర్చనీయాంశంగా మారింది. -
బాంబు పేలుడు: 26 మంది దుర్మరణం
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో మరోసారి తాలిబన్లు తీవ్ర రక్తపాతం సృష్టించారు. ఆదివారం ఆత్మాహుతి కారు బాంబు పేల్చారు. ఈ పేలుడు స్థానిక ఆర్మీ బేస్ ప్రాంతంలో జరగడంతో సుమారు 26 మంది ప్రాణాలు కోల్పోయినట్ల తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఘాజీ నగర శివారు ప్రాంతంలో ఉన్న తూర్పు ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ‘ఈ దాడిలో ఇప్పటివరకు 26 మృతదేహాలను గుర్తించాము. మరో 17మంది తీవ్రంగా గాయపడ్డారు. వారంతా ప్రభుత్వ భద్రత సిబ్బంది’ అని స్థానిక ఘాజీ ఆస్పత్రి డైరెక్టర్ బాజ్ మహ్మద్ హేమత్ తెలిపారు. చదవండి: శాస్త్రవేత్త దారుణ హత్య.. ట్రంప్‌పై అనుమానం! ఇక ఈ ప్రాంతాల్లో తరచూ తాలిబన్లు, ప్రభుత్వ బలగాల మధ్య దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ దాడిలో మృతులకు సంబంధించిన సంఖ్యను ఘాజీ ప్రావిన్స్ కౌన్సిల్ సభ్యుడు నాసిర్ అహ్మద్ వెల్లడించారు. అంతర్గత వ్యవహారాల శాఖ ప్రతినిధి తారిక్ అరియన్ వాహనాన్ని పేలుడు పదార్ధాలతో పేల్చివేశారు. బామియన్‌లో రెండు బాంబు పేలుళ్ల ఘటనలు మరవక ముందే ఆదివారం ఘాజీలో ఆత్మాహుతి కారు బాంబు దాడి జరిగింది. ఖతార్ రాజధాని దోహాలో గత సెప్టెంబర్ 12న జరిగిన శాంతి చర్చల అనంతరం అఫ్గానిస్తాన్‌లో జరిగిన అతి పెద్ద బాంబు పేలుడు దాడి ఇదే. -
గర్భిణి ఏనుగు మృతి: వెలుగులోకి కొత్త విషయం
తిరువనంతపురం : కేరళలో గర్భంతో ఉన్న ఏనుగుకు పైనాపిల్ బాంబును తినిపించి చంపిన ఘటనలో కొత్త విషయం వెలుగులో వచ్చింది. ఇన్ని రోజులు పేలుడు పదార్థాలు నింపిన పైనాపిల్ తినడం వల్ల ఏనుగు చావుకు కారణమయ్యిందని అందరూ అనుకుంటుండగా.. తాజాగా టపాకాయలు నింపిన కొబ్బరికాయను తిని ఏనుగు మరణించిందని అటవీశాఖ అధికారి సునీల్ కుమార్ వెల్లడించారు. ఏనుగు చనిపోయిన ఘటనపై యావత్ దేశం స్పందిస్తూ, అన్యాయంగా మూగజీవిని పొట్టనపెట్టుకున్న వారిని కఠినంగా శిక్షించాలంటూ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఏనుగు మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు కేసుతో సంబంధం ఉన్న ఒకరిని నిన్న(శుక్రవారం) అరెస్టు చేశారు. (ఏనుగు పోస్టుమార్టం రిపోర్టు: షాకింగ్ నిజాలు) సాక్ష్యాల సేకరణలో భాగంగా అధికారులు నిందితుడిని పేలుడు పదార్థాలు తయారు చేసే ప్రాంతానికి తీసుకెళ్లారు. ఈ విషయంపై అధికారి మాట్లాడుతూ.. ‘కేసు దర్యాప్తులో భాగంగా అరెస్టు చేసిన వ్యక్తిని ప్లాంటేషన్ షెడ్‌కు తీసుకెళ్లారు. అక్కడ అతను మరో ఇద్దరికి బాంబులు తయారు చేయడంలో సహాయం చేస్తున్నాడు.’ అని పేర్కొన్నారు. నిందితుడి పేరు విల్సన్‌గా, ఇతడు చెట్ల నుంచి రబ్బరు తీసేవాడుగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కేసులో మిగతా ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే పట్టుకుంటామని అధికారులు తెలిపారు. (ఏనుగు మృతి కేసులో తొలి అరెస్టు) కాగా.. క్రూరమైన అడవి జంతువుల నుంచి తమ పంటలను రక్షించుకునేందుకు స్థానికులు టపాకాయలు తయారు చేసి పండ్లు, జంతువుల కొవ్వులో నింపి ఉచ్చులుగా ఉంచుతారు. ఈ క్రమంలో ఏనుగు పేలుడు పదార్థంతో నింపిన కొబ్బరికాయను తినడం వల్ల అది ఏనుగు నోటిని పూర్తిగా గాయపరిచింది. ఇలా విపరీతమైన నొప్పితో బాధపడుతున్న ఏనుగు కొన్ని రోజులుగా ఆహారం, నీరు తీసుకోకుండా ఇబ్బంది పడింది. తీవ్రమైన గాయాలతో పాలక్కాడ్‌లోని వెల్లార్ నదిలోకి దిగిన ఏనుగు రోజంతా అలాగే ఉండి నీరసంతో చివరికి మరణించింది.అయితే ఏనుగు 20 రోజుల క్రితం గాయపడినట్లు, అప్పటి నుంచి ఆకలితో ఉండి మరణించినట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ కేసుపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. (అమానుష ఘటనపై రతన్ టాటా ఆవేదన) -
పశ్చిమబెంగాల్ సరిహద్దుల్లో బాంబు పేలుడు..
కోల్కత్తా : పశ్చిమబెంగాల్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో జరిగిన బాంబు పేలుడులో ముగ్గురు మరణించగా, ఒకరు గాయపడినట్లు సరిహద్దు భద్రతా దళం వెల్లడించింది. సోమవారం సాయంత్రం 6 గంటలకు ఈ పేలుడు సంభవించిదని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. అవుట్‌పోస్టు(బీఓపీ) ఫర్జిపారా సమీపంలో పశువుల స్మగ్లర్లు బకెట్లో దాచిన బాంబ్ పేలడంతో ముగ్గురు అక్కడిక్కడే మరణించారని, ఒకరు తీవ్ర గాయాలపాలైనట్లు పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని బీఎస్ఎఫ్ అధికారులు పేర్కొన్నారు. -
కర్నూలులో భారీ పేలుడు.. ముగ్గురి మృతి
సాక్షి, కర్నూలు: జిల్లా శివారులోని డంప్ యార్డ్ వద్ద భారీ బాంబు పేలుడు సంభవించటంతో ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అసలు ఏంజరిగిందో అర్థం కాక ప్రజలు, అధికారులు అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. వివరాలు.. డంప్ యార్డు పరిసర ప్రాంతాల్లో రెవెన్కూ, పోలీసు అధికారులు భూసర్వే చేస్తుండగా ఒక్క సారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏఎస్ఐ జంపాల శ్రీనివాస్‌తో సహా మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలస్తోంది. మరికొంత మంది తీవ్ర గాయాలపాలయ్యారు. సంఘటన స్థలానికి చేరుకున్న ప్రజలు, అధికారులు క్షతగాత్రులను అసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసుల వివరాలు సేకరిస్తున్నారు. పేలుడుకు గల కారణాలను పోలీసుల పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సివుంది. -
మక్కా మసీద్ పేలుళ్ల కేసులో ఎన్నో కోణాలు
-
దోషులు ఎవరు?
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మక్కా మసీదు బాంబు పేలుడు ఘటనపై ఇప్పటికీ సందిగ్ధత వీడని పరిస్థితి నెలకొంది. ఆదిలోనే ఈ కేసులో పోలీసులు అత్యుత్సాహం చూపడం, దర్యాప్తు నాలుగు చేతులు మారడం, సాక్షులు ఎదురు తిరగడం వంటివెన్నో ప్రాసిక్యూషన్ విఫలం కావడానికి కారణమయ్యాయి. అసలు మక్కా మసీదు బాంబు పేలుడు కేసులో దోషులు ఎవరనేది ‘మిస్టరీ’గా మారిపోయింది. పోలీసుల అత్యుత్సాహంతో.. మక్కా మసీదులో.. అదీ శుక్రవారం ప్రార్థనల తర్వాత బాంబు పేలుడు జరగడంతో పోలీసు విభాగం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈ ఘాతుకానికి పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ హర్కతుల్ జిహాద్ అల్ ఇస్లామీ (హుజీ) కారణమని.. హైదరాబాద్‌కు చెందిన ఉగ్రవాది బిలాల్ అలియాస్ షాహెద్ బాధ్యుడని ప్రాథమికంగా భావించారు. తీవ్ర ఒత్తిళ్ల నేపథ్యంలో.. కేసును త్వరగా ఓ కొలిక్కి తీసుకురావాలన్న అత్యుత్సాహంతో పోలీసులు దాదాపు రెండు వందల మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారంతా ఒక వర్గానికి చెందిన వారే కావడం, అందులోనూ కొందరికే బిలాల్‌తో సంబంధాలు ఉన్నట్టు తేలడంతో మొదటి ఎదురుదెబ్బ తగిలింది. అనుమానితుల్లో 38 మందిని మక్కా మసీదు పేలుడులో బాధ్యుల్ని చేస్తూ అరెస్టు చేయగా.. మరో 180 మందిపై గోపాలపురం పోలీసుస్టేషన్లో కుట్ర కేసు నమోదు చేశారు. కుట్ర కేసు వీగిపోగా.. పేలుడు కేసులో అనుమానితులుగా పేర్కొన్న వారికి కోర్టులో క్లీన్చిట్ లభించింది. దాంతో వారికి నష్టపరిహారం చెల్లిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాల్సి వచ్చింది. ఇలా పోలీసుల అత్యుత్సాహంతో కేసు దర్యాప్తుపై ప్రభావం పడింది. గందరగోళంగా దర్యాప్తు.. మక్కా మసీదులో పేలుడు కేసు దర్యాప్తు సైతం కలగాపులగంగా సాగింది. ఆ ఘటనపై ప్రాథమికంగా స్థానిక హుస్సేనీఆలం ఠాణాలో కేసులు నమోదయ్యాయి. అనంతరం అప్పట్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సెల్‌కు మార్చారు. కానీ హైదరాబాద్ పోలీసుల దర్యాప్తు, అరెస్టుల తీరుపై విమర్శలు రావడంతో.. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ను రంగంలోకి దింపారు. అజ్మీర్ దర్గాలో పేలుడు ఘటనకు సంబంధించి రాజస్తాన్ పోలీసులు చేసిన అరెస్టులతో మక్కా మసీదు పేలుడు కేసు చిక్కుముడి వీడింది. కొందరు నిందితులను అరెస్టు చేసిన సీబీఐ అధికారులు.. వారిపై చార్జిషీట్ సైతం దాఖలు చేశారు. ఈ కేసు విచారణకు వచ్చేలోగా కేంద్రం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)ను ఏర్పాటు చేయడంతో.. కేసులు దాని పరిధిలోకి వెళ్లాయి. దర్యాప్తు చేసిన ఎన్ఐఏ మరికొందరు నిందితులను అరెస్టు చేసి, మూడు సప్లిమెంటరీ చార్జిషీట్లను దాఖలు చేసింది. ఒక్కొక్కరు ఒక్కో తీరులో, వివిధ కోణాల్లో దర్యాప్తు చేయడం కేసులో ఓ స్పష్టత లేకుండా చేసింది. ప్రత్యక్ష సాక్షులు కరువు ఈ కేసులో ఎక్కడా ప్రత్యక్ష సాక్షులు లేకుండా పోయారు. 2007లో పేలుడు జరగగా.. 2010లో కేసు ఓ కొలిక్కి వచ్చింది. ఆ లోపు అనేక సాక్ష్యాధారాలు మాయమైపోయాయి. 2007లో హైదరాబాద్‌లో ఎక్కడా సీసీ కెమెరాలు లేకపోవడంతోపాటు పలు ఇతర కారణాల నేపథ్యంలో పక్కా సాంకేతిక ఆధారాలు లభించలేదు. కేవలం సందర్భానుసారం నిందితులను చూసిన, పరిణామాలు తెలిసిన సాక్షులు మాత్రమే ఈ కేసులో కీలకంగా మారారు. వారిలోనూ 50 మందికిపైగా కోర్టులో దర్యాప్తు సంస్థకు ఎదురు తిరిగారు. బాంబు పేలుళ్లకు వాడిన సెల్ఫోన్లను ఉగ్రవాదులకు విక్రయించిన దుకాణం యజమాని, ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చిన వారితో పాటు అనేక మంది కీలక సాక్షులు ప్రతికూలంగా మారారు. ఈ కేసులో ఆరో నిందితుడు స్వామి అసీమానంద ఇచ్చిన నేరాంగీకార వాంగ్మూలంపైనా అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. చివరికి ఇవన్నీ తీర్పు ప్రతికూలంగా రావడానికి కారణమయ్యాయి. మొత్తంగా అసలు 2007లో మక్కా మసీదులో పేలుడుకు పాల్పడింది ఎవరనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. కోర్టు తీర్పు ప్రతిని అధ్యయనం చేశాక.. ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేసే అంశాన్ని పరిశీలిస్తామని ఎన్ఐఏ ప్రకటించింది. ఆ కమిషన్ నివేదిక ఏమైంది? మక్కా మసీదు పేలుడు ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ రోజు ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు పోలీసు కాల్పుల వరకు వెళ్లాయి. మొఘల్‌పుర పెట్రోల్ పంపు ప్రాంతంలో ఐదుగురు కన్నుమూశారు. తీవ్రంగా విమర్శలు రావడంతో.. పోలీసు కాల్పుల ఉదంతంపై విచారణ కోసం ప్రభుత్వం జస్టిస్ వి.భాస్కర్‌రావు నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ నియమించింది. సుదీర్ఘ విచారణ జరిపిన ఆ కమిషన్ 2010లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అయితే ఆ నివేదికలోని పూర్తి వివరాలు ఏమిటి, దాని ఆధారంగా తీసుకున్న చర్యలేమిటన్నది ఇప్పటికీ గోప్యంగానే ఉండిపోయింది. -
పేలిన దశాబ్దాల నాటి బాంబు
- ఆరుగురు మృతి హనోయి: దశాబ్దాల క్రితం నాటి బాంబు పేలి ముగ్గురు చిన్నారులు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వియత్నాంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 1970 లలో అమెరికా, వియత్నాం మధ్య యుద్ధం సందర్భంగా అమెరికా వైమానిక బలగాలు వేలకొద్దీ బాంబులను వియత్నాంపై విసిరాయి. వీటిలో కొన్ని పేలిపోగా మరికొన్ని ఇంకా బయటపడుతున్నాయి. ఇటువంటి ఓ బాంబు ఖాన్హ్హో ప్రావిన్స్‌లోని టా లువాంగ్ గ్రామానికి చెందిన ఓ రైతు భూమి దున్నుతుండగా దొరికింది. ఆ రైతు కుటుంబసభ్యులు దానిని ఇంటికి తీసుకెళ్లి ఇనుప వస్తువులను వేరు చేసేందుకు ప్రయత్నించగా బాంబు ఒక్కసారిగా పేలింది. దీంతో ముగ్గురు చిన్నారులు సహా ఆరుగురు చనిపోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి ఆ ఇల్లు కుప్పకూలింది. క్షతగాత్రులను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. 1975 సంవత్సరంలో అమెరికా, వియత్నాం యుద్ధం ముగిసింది. ఈ యుద్ధంలో 42 వేల మంది చనిపోగా 62 వేల మందికి పైగా గాయపడ్డారు. యుద్ధ సమయంలో అమెరికా విసిరిన బాంబులు ఇప్పటికీ అటవీ ప్రాంతాల్లో, రైతులు పొలాలు దున్నే సమయంలో బయటపడుతూనే ఉన్నాయి. కొన్ని సార్లు ఆ బాంబులు పేలి ప్రాణనష్టానికి కారణమవుతున్నాయి. అయితే, కొన్ని సార్లు రైతులు ఈ బాంబుల నుంచి పేలుడు పదార్ధాలను సేకరించి మత్స్యకారులకు విక్రయిస్తుంటారు. ఇనుపసామగ్రిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇది కూడా ఒక్కోసారి వారి ప్రాణాంతకంగా మారుతోంది. -
హోటళ్లు, లాడ్జీల్లో విస్త్రత తనిఖీలు
నెల్లూరు, సిటీ: జిల్లా కోర్టు ఆవరణలో కుక్కర్ బాంబు ఘటనతో పోలీసులు నెల్లూరు నగరంలోని అన్ని హోటల్స్, లాడ్జీలు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఎస్పీ విశాల్ గున్నీ ఆదేశాలతో అన్ని స్టేషన్ల పరిధిలోని హోటల్స్, లాడ్జీల్లో సోమవారం రాత్రి నుంచి తనిఖీలు చేపట్టారు. హోటల్స్‌లోని ప్రతి గదినీ పరిశీలించారు. అనుమానితులుగా ఉన్న వారిని ప్రశ్నించి, వారి పూర్తివివరాలు సేకరించారు. మంగళవారం రాత్రి కూడా తనిఖీలు కొనసాగాయి. -
బంగ్లాలో పండుగ విషాదం: ఈద్గా వద్ద పేలుడు
ఢాకా: ముస్లింలు పర్వదినాన్ని ఆనందోత్సాహల మధ్య జరుపుకొంటోన్న తరుణంలో ఉగ్రమూకల కళ్లుకుట్టాయి. ప్రార్థనలు చేస్తున్నవారే లక్ష్యంగా దాడులకు తెగబడ్డాయి. బంగ్లాదేశ్ లోనే అతి పెద్ద ఈద్గా వద్ద గురువారం ఉదయం ముష్కరులు బాంబులు పేల్చారు. ఇప్పటివరకు తెలిసిన సమాచారం మేరకు పేలుళ్లలో ఒక పోలీసు, పౌరుడు మృతి చెందారు. 12 మందికి పైగా గాయపడ్డారు. ఈద్గాకు సమీపంలోని ఓ ఇంట్లోకి చొరబడ్డ ముష్కరులు.. లోపలినుంచి కాల్పులు జరుపుతున్నారు. రంగంలోకి దిగిన భద్రతా బలగాలు ఉగ్రవాదులను మట్టుపెట్టే ఆపరేషన్ ను ప్రారంభించారు. కాల్పుల మోతతో ఈద్గా పరిసరాలు భీతావాహంగా మారాయి. బంగ్లా రాజధాని ఢాకాకు 100 కిలోమీటర్ల దూరంలోని కిశోర్ గంజ్ పట్టణ శివారులో గల షోలాకియా ఈద్గా.. ఆ దేశంలోనే అతిపెద్ద ప్రార్థనా స్థలం. పర్వదినంనాడు దాదాపు 4 లక్షల మంది ముస్లింలు అక్కడ ప్రార్థనలు చేస్తారు. పెద్ద సంఖ్యలో జనం గుమ్మికూడటాన్ని అవకాశంగా తీసుకున్న ఉగ్రవాదులు బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈద్గా ప్రవేశ ద్వారం వద్ద చోటుచేసుకున్న పేలుడులో ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు ఒకరు మరణించగా, ఐదుగురికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత వారం ఢాకాలోని ఓ రెస్టారెంట్ లోకి చొరబడ్డ ఐసిస్ ఉగ్రవాదులు 20 మందిని పొట్టనపెట్టుకున్న సంఘటన నుంచి తేరుకోకముందే పండుగనాడు పేలుడు జరగడం బాగ్లాదేశీల్లో విషాదం నింపింది. -
రంజాన్ షాపింగ్ లో బాంబుపేలుడు..
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ లో భారీ బాంబు పేలుడు సంభవించింది. బలూచిస్తాన్ ప్రావిన్స్ లో శుక్రవారం బాగా రద్దీగా ఉన్న ప్రాంతంలో ఈ బాంబు పేలడంతో పెద్ద ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా మరో 20 మందికిగా పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సివిల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. క్వెట్టా సిటీలో రోడ్డు పక్కన పార్క్ చేసిన మోటార్ బైక్ లో అమర్చిన బాంబు ఒక్కసారిగా పేలడంతో రంజాన్ షాపింగ్ లో ఉన్న ప్రజలు పరుగులు తీశారు. రంజాన్ పండుగ సందర్భంగా ఈ ఏరియాలో షాపింగ్ సందడి నెలకొంటుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, భద్రతా బలగాలు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. దర్యాప్తును ప్రారంభించాయి. ఈ దాడికి బాధ్యులుగా ఎవరూ ప్రకటించకపోయినప్పటికీ, తాలిబన్లు, బలోచ్ మిలిటెంట్ల కదలికలు ఈ ఏరియాలో చురుగ్గా ఉంటాయి. దీంతో ఇది మిలిటెంట్ల పనే అన్న అనుమానాలు బలపడుతున్నాయి. -
హుగ్లీలో బాంబు పేలుడు; ఇద్దరికి గాయాలు
హుగ్లీ: బాంబు పేలుడు ఘటనలో ఇద్దరు గాయపడిన ఘటన పశ్చిమబెంగాల్ లోని హుగ్లీ జిల్లాలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. బాలాగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుప్తిపారాలోని మార్కెట్ లో ఈ ఘటన జరిగింది. హార్డ్ వేర్ షాపు ముందుపెట్టిన పాతబడిన క్యాన్ ను పక్కకు పెడుతున్నప్పుడు ఒక్కసారిగా పేలుడు సంభవించింది. షాపులో పనిచేస్తున్న తపస్ రాజబంగ్షీ, నితాయ్ దాస్ అనే మరో వ్యక్తి ఈ ఘటనలో గాయపడ్డారని పోలీసులు తెలిపారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పేలుడు భయంతో షాపులు మూసివేశారని, పలువురు దుకాణాలు తెరవలేదని పోలీసులు చెప్పారు. -
విమానంలో పేలుడు: రష్యా 'రెడ్ అలర్ట్'
పారిస్/మాస్కో: బాంబు పేలుడు వల్లే రష్యా విమానం.. ఈజిప్టులోని సీనాయి పర్వతంపై కుప్పకూలిందనే అమెరికా, బ్రిటన్ల వాదనకు మరింత బలం చేకూరింది. సంఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్న బ్లాక్ బాక్సుకు పారిస్‌లో నిర్వహించిన పరీక్షల్లో ప్రమాదం ఎలా జరిగిందనే విషయం తేలినట్లు విశ్వసనీయ సమాచారం. ఎర్రసముద్రం తీరంలోని షార్మ్ అల్ షేక్ నుంచి రష్యాలోని పీటర్స్ బర్గ్ కు టేక్ ఆఫ్ అయిన 24 నిమిషాల తర్వాత విమానం కూలిపోయింది. అయితే ఆ 24 నిమిషాల్లో విమానంలో ఎలాంటి సమస్యలు తలెత్తలేదని, అంతవరకు ప్రయాణం సజావుగా సాగినట్లు తెలిసింది. అయితే 24 నిమిషంలో మాత్రం ఒక్కసారిగా ఏదో భారీ విస్పోటనం జరిగిన ఆనవాళ్లు బ్లాక్‌బాక్స్‌లో రికార్డయ్యాయని నిపుణుల బృందం పేర్కొన్నట్లు తెలిసింది. విమానాన్ని తామే పేల్చేశామని ఐఎస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించడం, అటు అమెరికా, బ్రిటన్లు కూడా బాంబు పేలుడు వల్లే విమానం కూలిపోయిందని నిర్ధారించడం తాజా పరీక్షలకు బలం చేకూర్చాయి. పరిస్థితి తీవ్రత దృష్ట్యా రష్యా ఫెడరల్ ఏవియేషన్ ఈజిప్టుకు వెళ్లే అన్ని సర్వీసులను రద్దుచేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశాలమేరకు అన్ని సర్వీసులు రద్దుచేసి, అలర్ట్ ప్రకటించినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు ఇప్పటికే ఈజిప్టులోని పర్యాటక ప్రాంతాల్లో ఉన్న రష్యన్లను వెనక్కి రప్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. 'రెడ్ సీ లోని షార్మ్ అల్ షేక్ సహా ఈజిప్ట్ లోని అన్ని పర్యాటక ప్రాంతాల్లో దాదాపు 40 వేల మంది రష్యన్లు ఉండిఉంటారని అంచనా. ఆమేరకు వారిని వెనక్కి తీసుకొచ్చేందుకు చర్యలు ప్రారంభించాం' అని అని రష్యా రక్షణ విభాగం చీఫ్ అలెగ్జాండర్ బోర్ట్నికోవ్ చెప్పారు. ప్రమాదానాకి అసలు కారణం అధికారికంగా నిర్ధారణ అయిన తర్వాతే ఈజిప్ట్ కు విమాన సర్వీసుల పునరుద్ధరణపై ఆలోచిస్తామన్నారు. సిరియాలో జరుగుతున్న అంతర్యుద్ధంలో అధ్యక్షుడు అసద్ కు మద్దతు తెలిపిన రష్యా.. ఐఎస్ ఉగ్రవాదులు, తిరుగుబాటు దళాలపై దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ దాడులకు ప్రతీకారంగా రష్యన్లను టార్గెట్ చేసుకున్న తీవ్రవాదులు.. భీకర ప్రతిదాడులు చేయాలని భావిస్తున్నట్లు, ఆ క్రమంలోనే రష్యా విమానాన్ని పేల్చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కంటెయినర్ లో కాకుండా నేరుగా తానే బాంబులు తీసుకెళ్లిన ప్రయాణికుడు తనను తాను పేల్చుకోవటం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు ఓ నిర్ధారణకు వచ్చారు. అక్టోబర్ 31న జరిగిన విమాన పేలుడులో 224 మంది చనిపోయిన సంగతి విదితమే. -
నాటు బాంబు పేలి వ్యక్తి మృతి
నల్లగొండ: చేతిలో నాటు బాంబు పేలడంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం డొంకతండ గ్రామంలో మంగళవారం జరిగింది. వివరాలు..డొంకతండ గ్రామానికి చెందిన కానావత్ బికన్(55) చేపలు పట్టేందుకు నాటు బాంబులు తీసుకొని వెళ్లాడు. గ్రామ సమీపంలోని తుంగపాడు బంధంలో చేపల వేట కోసం బాంబును విసిరే క్రమంలో అది చేతిలోనే పేలింది. దీంతో బికన్ అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, చేపల వేట కోసం బికన్ నాటు బాంబులను అడవిదేవులపల్లి నుంచి తీసుకొని వచ్చినట్లు సమాచారం. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. కాగా, మృతుడికి నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారని, భార్య రెండు సంవత్సరాల క్రితం చనిపోయిందని బంధువులు తెలిపారు. (త్రిపురారం) -
ఆ బాంబులు సీమాంధ్ర కోసమేనా?
గురువారం చెన్నైలో పేలిన బాంబులు నిజానికి ఆంధ్రప్రదేశ్ లో పేల్చాలని ఉగ్రవాదులు పథకం వేశారా? ఆ బాంబులను ఆంధ్రప్రదేశ్ లోకి తరలిస్తున్నారా? అవుననే అంటున్నారు ఉగ్రవాద వ్యవహారాల నిపుణులు. ఎందుకంటే సీమాంధ్ర తప్ప మొత్తం దక్షిణ భారతదేశంలో ఎన్నికలు అయిపోయాయి. ఈ బాంబులు పేలిక కంపార్ట్ మెంట్లలోని ప్రయాణికులు అందరూ కోస్తా ప్రాంతానికి వెళ్తున్న వారే. కాబట్టి ఆంధ్ర ప్రాంతంలో ఎన్నికలను ప్రభావితం చేసేందుకు వీటిని ఉద్దేశించి ఉండవచ్చునని హోం శాఖ కు చెందిన ఒక నిపుణుడు పేర్కొన్నారు. రైలు చెన్నైకి దాదాపు రెండు గంటలు ఆలస్యంగా వచ్చింది. సమాయినికి రైలు ప్రయాణించి ఉంటే బాంబు పేలే సమయానికి అది కోస్తా ప్రాంతంలో ఉండి ఉండేదని నిపుణులు చెబుతున్నారు. అయితే బాంబులను టైమర్ ద్వారా పేల్చి ఉండవచ్చునని చెబుతున్నారు. మరో వైపు బాంబు పేలుళ్ల నేపథ్యంలో రైలులోనే ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చెన్నై రైల్వే స్టేషన్ లో కానీ, తమిళనాడులో రైళ్లలో కానీ పేలుళ్లు జరగడం ఇదే తొలిసారి. తమిళనాట ఇంతకుముందు ఒకే బాంబు పేలుడు సంఘటన జరిగింది. అంది 1998 లో కోయంబత్తూరులో ఒకే సారి 12 చోట్ల బాంబులు పేలి, 60 మంది చనిపోయారు. దాదాపు 200 మంది గాయపడ్డారు. ఆ తరువాత జరిగిన సంఘటన ఇదే. -
మణిపూర్‌లో బాంబు పేలుడు: ముగ్గురికి గాయాలు
పశ్చిమ మణిపూర్ జిల్లాలో మంత్రిపుక్కిరి ప్రాంతంలో గత రాత్రి శక్తిమంతమైన బాంబు పేలి ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారని పోలీసు ఉన్నతాధికారి ఆదివారం ఇక్కడ వెల్లడించారు. రోడ్డు పక్కన ఉన్న హోటల్లో ఆ బాంబు పేలడం వల్ల ఆ హోటల్ సిబ్బంది ముగ్గురు గాయాలపాలైయ్యారన్నారు. అయితే వారిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారమని తెలిపారు. అయితే వారు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారన్నారు. బాంబు పేలుడుపై కేసు నమెదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. హోటల్ యజమానినికి తీవ్రవాదులు నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే అతడు నిరాకరించడంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు భావిస్తున్నామని పోలీసు ఉన్నతాధికారి వివరించారు. -
హొమ్ సిటిలో బాంబు పేలుడు