కాబూల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో శుక్రవారం జరిగిన బాంబు పేలుడులో ఏడుగురు చనిపోయారు. చిన్నారులు సహా 41 మంది గాయపడ్డారు. మసీదుకు సమీపంలో రోడ్డు పక్కన ఉంచిన కారు బాంబు పేలిందని తాలిబన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. తర్వాత కాల్పులు వినిపించాయన్నారు. తాలిబన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉగ్ర సంస్థ ఇస్లామిక్ స్టేట్ అఫ్గాన్‌లో తరచూ హింసాత్మక చర్యలకు పాల్పడుతోంది.
ఇదీ చదవండి: రిసార్టులో 19 ఏళ్ల యువతి హత్య.. బీజేపీ నేత కుమారుడు అరెస్టు
Comments
Please login to add a commentAdd a comment