mosque bombing
-
మసూద్ అజార్ హతం?
ఇస్లామాబాద్: కాందహార్ విమానం హైజాక్ సూత్రధారి మసూద్ అజార్ బాంబు పేలుడులో హతయ్యాడంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్‌గా మారాయి. సోమవారం ఉదయం 5 గంటల సమయంలో పాకిస్తాన్‌లోని భావల్పూర్ మసీదు నుంచి వస్తుండగా బాంబు పేలిన ఘటనలో అతడు హతమైనట్లు ధ్రువీకరించని ట్వీట్ల ద్వారా తెలుస్తోంది. పేలుడుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అనంతరం పాక్ ఆర్మీ దావూద్ ఇబ్రహీం సహా పలువురు ఉగ్రవాదులపై దాడులు చేపట్టినట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తోంది. భారత్‌లో మోస్ట్ వాంటెడ్‌గా ఉండి పాకిస్తాన్లో తలదాచుకుంటున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తదితర రెండు డజన్ల మంది వరకు ఉగ్రవాదులు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందినట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలోనే తాజా పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. 2001 పార్లమెంట్‌పై దాడి ఘటనకు సంబంధించిన కేసుల్లో అజార్‌ను భారత్ వాంటెడ్‌గా ప్రకటించింది. 2008లో నేపాల్ నుంచి భారత్‌కు బయలుదేరిన ఇండియన్ఎయిర్ లైన్స్ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసి, అఫ్గానిస్తాన్‌లోని కాందహార్‌కు తీసుకెళ్లారు. హైజాకర్ల డిమాండ్ మేరకు జైళ్లలో ఉన్న అజార్ సహా ముగ్గురు కరడుగట్టిన ఉగ్రవాదులను భారత్ ప్రభుత్వం విడిచిపెట్టింది. విమాన ప్రయాణికుల్లో ఒకరిని పొడిచి చంపిన ఉగ్రవాదులు, మరికొందరిని గాయపరిచారు. వారంపాటు కొనసాగిన తీవ్ర ఉత్కంఠ అనంతరం అందులోని 176 మందిని ఉగ్రవాదులు సురక్షితంగా విడిచిపెట్టారు. -
కారు బాంబు పేలి.. ఏడుగురి దుర్మరణం
కాబూల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో శుక్రవారం జరిగిన బాంబు పేలుడులో ఏడుగురు చనిపోయారు. చిన్నారులు సహా 41 మంది గాయపడ్డారు. మసీదుకు సమీపంలో రోడ్డు పక్కన ఉంచిన కారు బాంబు పేలిందని తాలిబన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. తర్వాత కాల్పులు వినిపించాయన్నారు. తాలిబన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉగ్ర సంస్థ ఇస్లామిక్ స్టేట్ అఫ్గాన్‌లో తరచూ హింసాత్మక చర్యలకు పాల్పడుతోంది. ఇదీ చదవండి: రిసార్టులో 19 ఏళ్ల యువతి హత్య.. బీజేపీ నేత కుమారుడు అరెస్టు -
మసీదులో భారీ పేలుడు.. 20 మంది మృతి!
కాబుల్: అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్‌లోని ఓ మసీదులో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం సాయంత్రం ప్రార్థనల సందర్భంగా ఈ పేలుడు జరగటంతో భారీ ప్రాణనష్టం సంభవించినట్లు స్థానికులు, పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. మరోవైపు.. 35 మంది వరకు ప్రాణాలు కోల్పోయి ఉంటారని తాలిబన్ నిఘా విభాగం అధికారి ఒకరు తెలిపారు. ఉత్తర కాబుల్, ఖైర్ ఖానా ప్రాంతంలోని మసీదులో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించిందని ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. పేలుడు ధాటికి సమీపంలోని భవనాలు కిటికీలు, అద్దాలు పగిలిపోయాయన్నారు. సమాచారం అందుకున్న వెంటనే అంబులెన్స్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించాయి. మృతుల్లో మసీదు ఇమామ్ సైతం ఉన్నట్లు అధికారులు తెలిపారు. నిఘా విభాగం బృందాలు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టాయి. ఇదీ చదవండి: పాపం! సహోద్యోగి గట్టిగా కౌగిలించుకున్నాడని కోర్టుకెక్కిన మహిళ.. తీర్పు ఏంటంటే? -
లంక దాడి ఐసిస్ పనే
కొలంబో: శ్రీలంకలో గత ఆదివారం, ఈస్టర్ పండుగనాడు బాంబు పేలుళ్లకు పాల్పడింది తామేనని ఐసిస్ ఉగ్రవాద సంస్థ మంగళవారం ప్రకటించింది. ఈ దాడుల్లో మరణించిన వారి సంఖ్య 321కి పెరిగింది. ‘శ్రీలంకలో బాంబు దాడులు చేసినవారు మా కోసం పోరాడేవారే’ అని ఐసిస్ అమఖ్ అనే వార్తా సంస్థకు తెలిపింది. ఈ అమఖ్ వార్తా సంస్థ ఇస్లామిక్ రాజ్యస్థాపనకు, ఉగ్రవాదానికి మద్దతు తెలిపేదే. ఆత్మాహుతి దాడి చేసిన ఉగ్రవాదుల పేర్లను ఐసిస్ ప్రకటించింది. ఈ దాడుల్లో గాయపడిన, చనిపోయిన వారి మొత్తం సంఖ్య దాదాపు వేయి అని పేర్కొంది. ప్రభుత్వ అధికార ప్రతినిధి, ఆరోగ్య మంత్రి రజిత సేనరత్నే మాట్లాడుతూ స్థానిక ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ నేషనల్ తౌహీద్ జమాత్ ఈ దాడులకు కుట్రపన్నినట్లు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఆత్మాహుతి దాడులకు పాల్పడిన వారందరూ శ్రీలంక జాతీయులేననీ, వారికి ఐసిస్ లేదా ఏదేనీ ఇతర విదేశీ ఉగ్రవాద సంస్థ మద్దతు ఇచ్చి ఉండొచ్చన్నారు. మరో ఇద్దరు భారతీయుల మృతి పేలుళ్లలో మృతి చెందిన మరో ఇద్దరు భారతీయుల పేర్లను భారత హై కమిషన్ మంగళవారం వెల్లడించింది. ఎ.మోరెగౌడ, హెచ్.పుట్టరాజు పేలుళ్లలో మరణించారని తెలిపింది. ఈ పేలుళ్లలో చనిపోయిన మొత్తం భారతీయుల సంఖ్య తాజాగా 10కి చేరింది. మొత్తం 40 మంది అరెస్టు ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తులు ఉపయోగించిన వ్యాన్‌కు డ్రైవర్‌గా పనిచేసిన వ్యక్తిని సహా మొత్తం 40 మంది అనుమానితులను శ్రీలంక పోలీసులు ఇప్పటివరకు అరెస్టు చేశారు. గత 24 గంటల్లో 16 మందిని అరెస్టు చేశామని పోలీసు విభాగం అధికార ప్రతినిధి రువాన్ గుణశేఖర మంగళవారం చెప్పారు. మరోవైపు దేశ భద్రతను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష నేత మహిందా రాజపక్స నిందించారు. మసీదుపై దాడికి ప్రతీకారంగానే గత నెల 15న న్యూజిలాండ్‌లో మసీదుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి 50 మంది మృతికి కారణమవ్వడం తెలిసిందే. ఆ దాడికి ప్రతీకారంగానే స్థానిక ఇస్లాం తీవ్రవాదులు శ్రీలంకలో ఈస్టర్ నాడు బాంబు దాడులు చేశారని శ్రీలంక రక్షణ శాఖ సహాయ మంత్రి రువాన్ విజెవర్ధనే మంగళవారం పార్లమెంటుకు చెప్పారు. విజెవర్ధనే మాట్లాడుతూ ‘ప్రాథమిక దర్యాప్తు ప్రకారం మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఈ దాడి క్రైస్ట్‌చర్చ్ కాల్పులకు ప్రతీకారంగానే జరిగింది’ అని అన్నారు. ఆత్మాహుతి దాడిలో ఇద్దరు ముస్లింలు శ్రీలంకలో ఆత్మాహుతి దాడికి దిగినవారిలో ఇద్దరు ముస్లిం సోదరులు ఉన్నారని పోలీసులు తెలిపారు. వారిద్దరూ కొలంబోకి చెందిన ఓ మసాలా దినుసుల వ్యాపారి కొడుకులని చెప్పారు. ఒకరు షాంగ్రీ లా హోటల్లో, మరొకరు సిన్నమన్ గ్రాండ్ హోటల్లో ఆత్మాహుతికి పాల్పడ్డారు. శ్రీలంకలో ఉగ్రవాదుల బాంబు దాడుల్లో హైదరాబాద్‌లోని మణికొండ ప్రాంతంలో నివసించే మాకినేని శ్రీనివాసబాబు అనే వ్యక్తి గాయపడ్డారు. ఉగ్రవాదుల బాంబు వీరికి సమీపంలో పేలడంతో శ్రీనివాసబాబుకు తీవ్రగాయాలయ్యాయి. అయితే, ఆయనతోపాటు వెళ్లిన మరో వ్యక్తి మృతి చెందినట్టు తెలిసింది. వైఫల్యానికి ప్రభుత్వం సారీ దాడులు జరిగే అవకాశం ఉందంటూ నిఘా వర్గాలు సమాచారం ఇచ్చినా పేలుళ్లను అడ్డుకోలేకపోవడంపై శ్రీలంక ప్రభుత్వం క్షమాపణలు చెప్పింది. దాడులకు ముందే తమకు హెచ్చరికలు అందాయని ప్రభుత్వ అధికార ప్రతినిధి రజిత సేనరత్నే చెప్పారు. ‘మేం హెచ్చరికలను పరిశీలించాం. అయినా తగిన విధంగా చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వం మీకు క్షమాపణ చెబుతోంది. బాధితులుగా మిగిలిన కుటుంబాలు, సంస్థలను ప్రభుత్వం క్షమాపణలు వేడుకుంటోంది’ అని ఆయన చెప్పారు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందజేస్తామనీ, చర్చిలను పునఃనిర్మిస్తామని తెలిపారు. -
ఆత్మాహుతి దాడుల్లో 27 మంది మృతి
లాగోస్ : నైజీరియాలోని ముబి పట్టణంలో రెండు ఆత్మాహుతి దాడులు చోటుచేసుకున్నాయి. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు తమను తాము పేల్చేసుకున్నారు. ఈ ఘటనలో 27 మంది అక్కడికక్కడే మృతిచెందగా..మరో 56 మంది తీవ్రంగా గాయపడ్డారు. మొదటి ఆత్మాహుతి మసీదు లోపల జరిగిందని, మరో దాడి అదే మసీదుకు సమీపంలో బట్టల మార్కెట్ బయట జరిగిందని అడమావా రాష్ట్ర సమాచార కమిషనర్ అహ్మద్ సాజో పేర్కొన్నారు. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని, ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేస్తున్నామని స్థానిక అధికారి వెల్లడించారు. -
మసీదులో ఆత్మాహుతి దాడి : 21 మంది మృతి
సౌదీ అరేబియా : సౌదీ అరేబియా పశ్చిమ ప్రావెన్స్లోని షియా మసీదులో శుక్రవారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 21 మంది మరణించారు. మరో 80 మంది గాయపడ్డారని సౌదీ ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. క్షతగాత్రులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని చెప్పారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. శుక్రవారం అల్ ఖీదా గ్రామంలోని షియా మసీదులో ప్రార్థన సమయంలో ఓ వ్యక్తి ప్రవేశించి... ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారని చెప్పారు. ఈ ఆత్మాహుతి దాడికి తామే బాధ్యులమని అల్ ఖైదా ట్విట్టర్లో ప్రకటించింది.