సౌదీ అరేబియా : సౌదీ అరేబియా పశ్చిమ ప్రావెన్స్లోని షియా మసీదులో శుక్రవారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 21 మంది మరణించారు. మరో 80 మంది గాయపడ్డారని సౌదీ ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. క్షతగాత్రులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని చెప్పారు.
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. శుక్రవారం అల్ ఖీదా గ్రామంలోని షియా మసీదులో ప్రార్థన సమయంలో ఓ వ్యక్తి ప్రవేశించి... ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారని చెప్పారు. ఈ ఆత్మాహుతి దాడికి తామే బాధ్యులమని అల్ ఖైదా ట్విట్టర్లో ప్రకటించింది.