రక్తంతో తడిసి ముద్దయిన రైల్వే స్టేషన్‌ | Bomb Explosion At Railway Train Station In Pakistan, More Than 15 Members Died | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌ భారీ పేలుడు: రక్తంతో తడిసి ముద్దయిన రైల్వే స్టేషన్‌

Published Sat, Nov 9 2024 10:41 AM | Last Updated on Sat, Nov 9 2024 4:48 PM

Bomb explosion at railway train station in Pakistan

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ రైల్వే స్టేషన్‌లో సంభవించిన భారీ పేలుడులో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. క్వెట్టా రైల్వే స్టేషన్ మొత్తం రక్తంతో తడిసి ముద్దయ్యింది. మృతుల సంఖ్య 25కి చేరిందని, క్షతగాత్రుల్లో ఇంకొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరగవచ్చని అక్కడి అధికారులు తెలిపారు. 

అసలేం జరిగిందంటే.. 
క్వెట్టా రైల్వే స్టేషన్ సమీపంలో ఇవాళ ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటి స్టేషన్‌ పైకప్పు ఎగిరిపోయింది. ప్లాట్‌ఫారం మీద ఉన్న ప్రయాణికులంతా చెల్లాచెదురుగా పడిపోయారు.  పేలుడు సమయంలో రైల్వే స్టేషన్‌లో జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్లాట్‌ఫాం నుంచి పెషావర్‌కు బయలుదేరడానికి సిద్ధంగా ఉందని.. అదే సమయంలో పేలుడు చోటు చేసుకుందని అక్కడి మీడియా వెల్లడించింది. మరోవైపు.. బలూచ్‌ లిబరేషన్‌  ఆర్మీ సంస్థ పేలుడు జరిపింది తామేనని ప్రకటించుకుంది. 

మానవ బాంబుతో..
క్వెట్టా నుంచి పెషావర్‌కు జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌  రైలు బయలుదేరే సమయంలో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇప్పటివరకు 25 మంది మృతి చెందారు’ అని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆపరేషన్స్ ముహమ్మద్ బలోచ్ తెలిపారు.  మృతుల్లో ఎక్కువగా సైనికులు ఉండడంతో..  వాళ్లనే లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. పేలుడు జరిగిన విధానం బట్టి ఆత్మాహుతి దాడిగా నిర్ధారణకు వచ్చారు. 

 

 


 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement