సాక్షి, ముంబై : ఇటీవల పాకిస్తాన్, ఆస్ట్రేలియాలలో ఉగ్రవాదులు సృష్టించిన బీభత్సాన్ని దృష్టిలో ఉంచుకొని డిసెంబర్ 31 వేడుకల నిమిత్తం నగరంలోని అన్ని రైల్వే స్టేషన్లలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేస్తున్నారు. గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్పీ) తన సిబ్బందిని అన్ని రైల్వే స్టేషన్లలో మోహరించనుంది. వీరితోపాటు మరో 800 పోలీసులు కూడా ఆ రోజు విధులు నిర్వహించనున్నట్లు జీఆర్‌పీ కమిషనర్ రవీంద్ర సింఘాల్ తెలిపారు.
అన్ని రైల్వే స్టేషన్లలో బ్యాగేజ్ తనిఖీలను నిర్వహించనున్నామన్నారు. నగర వ్యాప్తంగా రెల్వే స్టేషన్లను స్కాన్ చేసేందుకు ఐదు స్నిఫర్ డాగ్‌లను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. సెంట్రల్, వెస్టర్న్ రైల్వేలు కూడా ఎక్కడ అవసరం ఉంటే ఆయా స్టేషన్లలో కమాండో బృందాలు పోలీసులకు సహాయ సహకారాలు అందించనున్నాయి. ఈ మొత్తాన్ని కూడా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసులు పర్యవేక్షించనున్నారు.
రైల్వేస్టేషన్లకు భద్రత పెంపు
Published Fri, Dec 26 2014 10:07 PM | Last Updated on Sat, Sep 2 2017 6:47 PM
Advertisement