
ప్రతీకాత్మక చిత్రం
కోల్‌కత్తా : పశ్చిమబెంగాల్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో జరిగిన బాంబు పేలుడులో ముగ్గురు మరణించగా, ఒకరు గాయపడినట్లు సరిహద్దు భద్రతా దళం వెల్లడించింది. సోమవారం సాయంత్రం 6 గంటలకు ఈ పేలుడు సంభవించిదని బీఎస్‌ఎఫ్ అధికారులు తెలిపారు. అవుట్‌పోస్టు(బీఓపీ) ఫర్జిపారా సమీపంలో పశువుల స్మగ్లర్లు బకెట్‌లో దాచిన బాంబ్ పేలడంతో ముగ్గురు అక్కడిక్కడే మరణించారని, ఒకరు తీవ్ర గాయాలపాలైనట్లు పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని బీఎస్‌ఎఫ్ అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment