
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో మరోసారి తాలిబన్లు తీవ్ర రక్తపాతం సృష్టించారు. ఆదివారం ఆత్మాహుతి కారు బాంబు పేల్చారు. ఈ పేలుడు స్థానిక ఆర్మీ బేస్ ప్రాంతంలో జరగడంతో సుమారు 26 మంది ప్రాణాలు కోల్పోయినట్ల తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఘాజీ నగర శివారు ప్రాంతంలో ఉన్న తూర్పు ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ‘ఈ దాడిలో ఇప్పటివరకు 26 మృతదేహాలను గుర్తించాము. మరో 17మంది తీవ్రంగా గాయపడ్డారు. వారంతా ప్రభుత్వ భద్రత సిబ్బంది’ అని స్థానిక ఘాజీ ఆస్పత్రి డైరెక్టర్ బాజ్ మహ్మద్ హేమత్ తెలిపారు. చదవండి: శాస్త్రవేత్త దారుణ హత్య.. ట్రంప్‌పై అనుమానం!
ఇక ఈ ప్రాంతాల్లో తరచూ తాలిబన్లు, ప్రభుత్వ బలగాల మధ్య దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ దాడిలో మృతులకు సంబంధించిన సంఖ్యను ఘాజీ ప్రావిన్స్ కౌన్సిల్ సభ్యుడు నాసిర్ అహ్మద్ వెల్లడించారు. అంతర్గత వ్యవహారాల శాఖ ప్రతినిధి తారిక్ అరియన్ వాహనాన్ని పేలుడు పదార్ధాలతో పేల్చివేశారు. బామియన్‌లో రెండు బాంబు పేలుళ్ల ఘటనలు మరవక ముందే ఆదివారం ఘాజీలో ఆత్మాహుతి కారు బాంబు దాడి జరిగింది. ఖతార్ రాజధాని దోహాలో గత సెప్టెంబర్ 12న జరిగిన శాంతి చర్చల అనంతరం అఫ్గానిస్తాన్‌లో జరిగిన అతి పెద్ద బాంబు పేలుడు దాడి ఇదే.
Comments
Please login to add a commentAdd a comment