నల్లగొండ: చేతిలో నాటు బాంబు పేలడంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం డొంకతండ గ్రామంలో మంగళవారం జరిగింది. వివరాలు..డొంకతండ గ్రామానికి చెందిన కానావత్ బికన్(55) చేపలు పట్టేందుకు నాటు బాంబులు తీసుకొని వెళ్లాడు. గ్రామ సమీపంలోని తుంగపాడు బంధంలో చేపల వేట కోసం బాంబును విసిరే క్రమంలో అది చేతిలోనే పేలింది. దీంతో బికన్ అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, చేపల వేట కోసం బికన్ నాటు బాంబులను అడవిదేవులపల్లి నుంచి తీసుకొని వచ్చినట్లు సమాచారం. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. కాగా, మృతుడికి నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారని, భార్య రెండు సంవత్సరాల క్రితం చనిపోయిందని బంధువులు తెలిపారు.
(త్రిపురారం)
నాటు బాంబు పేలి వ్యక్తి మృతి
Published Tue, Feb 24 2015 8:19 PM | Last Updated on Sat, Sep 2 2017 9:51 PM
Advertisement
Advertisement