హోటళ్లు, లాడ్జీల్లో విస్త్రత తనిఖీలు
నెల్లూరు, సిటీ:
జిల్లా కోర్టు ఆవరణలో కుక్కర్ బాంబు ఘటనతో పోలీసులు నెల్లూరు నగరంలోని అన్ని హోటల్స్, లాడ్జీలు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఎస్పీ విశాల్ గున్నీ ఆదేశాలతో అన్ని స్టేషన్ల పరిధిలోని హోటల్స్, లాడ్జీల్లో సోమవారం రాత్రి నుంచి తనిఖీలు చేపట్టారు. హోటల్స్‌లోని ప్రతి గదినీ పరిశీలించారు. అనుమానితులుగా ఉన్న వారిని ప్రశ్నించి, వారి పూర్తివివరాలు సేకరించారు. మంగళవారం రాత్రి కూడా తనిఖీలు కొనసాగాయి.