సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి | Make success Workers Strike | Sakshi
Sakshi News home page

సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి

Published Sat, Aug 27 2016 12:52 AM | Last Updated on Mon, Sep 4 2017 11:01 AM

Make success Workers Strike

జడ్చర్ల టౌన్‌ : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్‌ 2న దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని మున్సిపల్‌ వర్కర్స్, ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఖమర్‌ అలీ పిలుపునిచ్చారు. శుక్రవారం బాదేపల్లి నగరపంచాయతీ ప్రాంగణంలో వర్కర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా కార్మికులు, పేద ప్రజలకు మేలు చేసే విధంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని విమర్శించారు. ప్రస్తుతం ఉన్న కార్మిక చట్టాలను సవరిస్తూ మరింత అన్యాయం చేసేందుకు కుట్ర పన్నిందని ఆరోపించారు. ఈ విధానాలను వ్యతిరేకిస్తూ అనేక కార్మిక సంఘాలు కలసి చేపట్టిన సార్వత్రిక సమ్మె అన్నిరంగాల కార్మికులు కలిసి రావాలని పిలుపునిచ్చారు. అనంతరం సమ్మె పోస్టర్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు దీప్లానాయక్, నగరపంచాయతీ వర్కర్స్‌ ఎంప్లాయిస్‌ నాయకులు వెంకటేశ్, కార్మికులు యాదమ్మ, శివలీల, లక్ష్మి, మొగులయ్య, భారతి, చంద్రయ్య, కష్ణ, బాల్‌వెంకట్, నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement