కమిషనర్‌కు నగదును అందజేస్తున్న రంజిత్‌బాబు
జడ్చర్ల : బాదేపల్లి నగర పంచాయతీలో హరితహారంలో నాటిన మొక్కలను పరిరక్షించేందుకు పట్టణ వాసులు, ప్రముఖులు తోడ్పాటునందించాలని నగర పంచాయతీ కమిషనర్ గంగారాం పేర్కొన్నారు. శనివారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో టీఆర్‌ఎస్ నాయకులు బాదేపల్లి రంజిత్‌బాబు హరితహారం కార్యక్రమానికి తన వంతుగా రూ.10వేల నగదును కమిషనర్‌కు అందజేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి పిలుపు మేరకు మొక్కల పరిరక్షణకు ట్రీగార్డ్‌లను ఏర్పాటు చేసేందుకు సహాయం అందజేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ గంగారాం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ పట్టణంలోని వివిధ కాలనీలు, రహదారులు తదితర ప్రాంతాల్లోదాదాపు 50 వేల మొక్కలకు పైగా నాటామని తెలిపారు. ట్రీగార్డుల ఏర్పాటుకు వ్యాపారులు, ప్రముఖులు తదితరులు మొక్కలను కాపాడేందుకు తమ వంతు సహాయం చేయాలని కోరారు.