commisioner
-
Election Commissioner: నేడు కమిషనర్ల ఎంపిక.. మోదీతో కీలక భేటీ
సాక్షి, ఢిల్లీ: నేడు కేంద్ర ఎన్నికల సంఘంలో నూతన కమిషనర్ల ఎంపిక జరుగనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సమావేశం కానున్నారు. అయితే, ఫిబ్రవరిలో ఎన్నికల కమిషనర్ అనూప్‌చంద్ర పాండే రిటైర్ అవడం, అరుణ్ గోయల్ ఆకస్మిక రాజీనామాతో కేంద్ర ఎన్నికల సంఘంలో ఒక్క చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాత్రమే ఉన్నారు. కాగా, మరికొన్ని రోజుల్లో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో ఈసీల నియామకం వేగంగా జరుగుతోంది. మరోవైపు.. కొత్త చట్టం ప్రకారం ఎన్నికల కమిషనర్ల నియామకం చేపట్టవద్దని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్)అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం(మార్చ్ 15) విచారించనుంది. ఇక, లోక్‌సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఎన్నికల కమిషన్‌లో రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ రెండు ఖాళీలను నింపేందుకు ప్రధాని నేతృత్వంలోని కమిటీ ఈ వారంలోనే సమావేశమవనుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏడీఆర్ వేసిన పిటిషన్‌ను లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కొత్త చట్టం ప్రకారం ఈ కమిటీలో ప్రధాని, కేంద్ర మంత్రి, లోక్‌సభలో ప్రతిపక్షనేత సభ్యులుగా ఉంటారు. గతంలో ఉన్న చట్టం ప్రకారం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా(సీజేఐ) కమిటీలో సభ్యుడిగా ఉండగా కొత్త చట్టంలో ఆయన స్థానంలో కేంద్రమంత్రికి అవకాశం కల్పించారు. అయితే ఎంపిక కమిటీ నుంచి సీజేఐని తప్పించిన తర్వాత తొలిసారి ఈసీలను కేంద్రం ఎంపిక చేస్తుండటంతో ఏడీఆర్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు చెప్పనుందనేదానిపై ఉత్కంఠ నెలకొంది. -
అద్దెకు ‘సై’కిళ్లు
ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణపై ‘గ్రేటర్’ యంత్రాంగం దృష్టిసారించింది. ఢిల్లీ, హైదరాబాద్, విజయవాడ తరహాలో సైక్లింగ్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు శ్రీకారం చుట్టింది. పైలట్ ప్రాజెక్టుగా నిట్ క్యాంపస్‌లో.. పాలిటెక్నిక్ నుంచి భద్రకాళి వరకూ సైకిల్‌పై ప్రయాణించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు కమిషనర్ గౌతమ్ పలు సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు. అతి తక్కువ చార్జీలతో సైకిళ్లను అద్దెకు ఇచ్చేలా సమాలోచనలు చేశారు. వరంగల్ అర్బన్: ప్రజల ఆరోగ్యంతోపాటు పర్యావరణ పరిరక్షణకు సైకిల్ ప్రయాణం ఎంతగానో దోహదపడుతుంది. ఢిల్లీ, హైదరాబాద్, విజయవాడ నగరాల తరహాలో వరంగల్ స్మార్ట్ నగరంలో సైకిల్ వినియోగాన్ని అమల్లోకి తెచ్చేందుకు గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు సన్నాహాలు మొదలుపెట్టారు. ఈ మేరకు గురవారం వరంగల్ మహా నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ వీపీ.గౌతమ్‌తో లీ అసోసియేట్స్, హైదరాబాద్ సైకిల్ అసోసియేషన్(హెచ్‌బీసీ), పీడబ్ల్యూసీ సంస్థల ప్రతినిధులు భేటీ అయ్యారు. సైకిల్ ప్రయాణంతో ప్రజలు, పర్యావరణ పరిరక్షణకు జరిగే మేలు గురించి ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అద్దెకు సైకిళ్లు ఇస్తామని.. ఇందుకోసం గ్రేటర్ వరంగల్ నుంచి సహాయ సహకారాలను అందజేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ నగరంలోని పలు ప్రాంతాల్లో అనువైన రహదారులపై చర్చించారు. తొలుత పైలట్ ప్రాజెక్టుగా సైకిల్ సవారీని నిట్ క్యాంపస్‌లో.. పాలిటెక్నిక్ కాలేజి నుంచి భద్రకాళి ఆలయం వరకు అమలు చేయాలని సూచించారు. అతి తక్కువ చార్జీలతో సైకిళ్లను అద్దెకు ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇందుకోసం ప్రత్యేకంగా షెడ్డును నిర్మించుకుంటామని సంస్థల ప్రతినిధులు తెలిపారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ సైకిల్ వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. సైకిల్ వినియోగం పెంచేలా నగర ప్రజలను ప్రోత్సహించేందుకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామని, అన్ని విధాలుగా సహకారాన్ని అందిస్తామని సంస్థ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. సైక్లింగ్ కోసం ప్రత్యేకంగా రహదారులను నిర్మిస్తామన్నారు. సమావేశంలో లీ అసోసియేట్స్ ప్రతినిధి జగదీష్, హెచ్‌బీసీ చీఫ్ మేనేజర్ విజయ్, పీడబ్ల్యూసీ ప్రతినిధులు బాలాజీ, సంతోష్, రాజేశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి జాడేది?
ప్రచార ఆర్భాటంగానే స్మార్ట్ సిటీ ప్రజలపై దండయాత్ర చేస్తున్న దోమలు అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ అవసరం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు కమిషనర్‌కు పార్టీ నేతల వినతి పత్రం కాకినాడ : స్మార్ట్ సిటీగా ఎంపికయిందన్న ప్రచారమే తప్ప ఎక్కడా అభివృద్ధి జాడ కనిపించడంలేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు విమర్శించారు. ఆకర్షణీయ నగరంగా ఎంపికయ్యాక ఏడాది ఉత్సవాలు కూడా పూర్తి చేసుకున్న ప్రజాప్రతినిధులు, నగరపాలక సంస్థ అధికారులు తీరు కేవలం ప్రచార ఆర్భాటంగానే కనిపిస్తోందన్నారు. భూగర్భ డ్రెయినేజీ, స్మార్ట్ సిటీ, నగరంలోని ప్రధాన సమస్యలపై వైఎస్సార్ సీపీ కాకినాడ సిటీ కో–ఆర్డినేటర్ ముత్తా శశిధర్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు సోమవారం కమిషనర్ అలీమ్‌బాషాను కలిసి వినతి పత్రం అందజేశారు. అంతకుముందు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట నేతలంతా సమావేశమై సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ ప్రణాళిక లేకుండా నిర్మిస్తున్న డ్రెయినేజీ వ్యవస్థ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ప్రణాళిక బద్ధంగా ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించాలని డిమాండ్ చేశారు. స్మార్ట్‌సిటీని కొంత ప్రాంతానికి మాత్రమే పరిమితం చేయడం సరికాదన్నారు. నగరంలో అభివృద్ధి కుంటుపడింది, ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని విమర్శించారు. ప్రభుత్వం దోమలపై దండయాత్ర పేరుతో హంగామా చేస్తున్నప్పటికీ వాస్తవానికి దోమలే ప్రజలపై దండయాత్ర చేస్తున్నాయన్నారు. ఎక్కడా ఫ్యాగింగ్ జరుగుతున్న దాఖలాలు కనిపించడంలేదన్నారు. సిటీ కో–ఆర్డినేటర్ ముత్తా శశిధర్ మాట్లాడుతూ కాకినాడ నగరాన్ని ప్రాతిపదికగా తీసుకుని అభివృద్ధి చేయడంలేదని విమర్శించారు. కేవలం మెయిన్‌రోడ్డు, సినిమారోడ్డు వంటి ప్రధాన ప్రాంతాల్లోనే పనులు చేపట్టడం ద్వారా మిగిలిన ప్రాంతాలను నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. ప్రస్తుతం నిర్మిస్తున్న డ్రెయినేజీ రోడ్డుకన్నా ఎత్తులో చేపట్టారని, దీనివల్ల ముంపు సమస్య యథావిధిగానే కొనసాగుతుందన్నారు. సరైన ప్రణాళికతో డ్రెయినేజీ పనులు చేపట్టాలని సూచించారు. వైఎస్సార్ సీపీ నగరాధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులకు, ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి కొరవడిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ర్యాలి రాంబాబు, మాజీ కౌన్సిలర్ బొట్టా కృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యులు చాట్ల చైతన్య, బెజవాడ బాబి, చిలుకూరి మనోజ్‌కుమార్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ప్రసాదరెడ్డి, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
మొక్కల పరిరక్షణకు తోడ్పాటును అందించాలి
జడ్చర్ల : బాదేపల్లి నగర పంచాయతీలో హరితహారంలో నాటిన మొక్కలను పరిరక్షించేందుకు పట్టణ వాసులు, ప్రముఖులు తోడ్పాటునందించాలని నగర పంచాయతీ కమిషనర్ గంగారాం పేర్కొన్నారు. శనివారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్ నాయకులు బాదేపల్లి రంజిత్‌బాబు హరితహారం కార్యక్రమానికి తన వంతుగా రూ.10వేల నగదును కమిషనర్‌కు అందజేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి పిలుపు మేరకు మొక్కల పరిరక్షణకు ట్రీగార్డ్‌లను ఏర్పాటు చేసేందుకు సహాయం అందజేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ గంగారాం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ పట్టణంలోని వివిధ కాలనీలు, రహదారులు తదితర ప్రాంతాల్లోదాదాపు 50 వేల మొక్కలకు పైగా నాటామని తెలిపారు. ట్రీగార్డుల ఏర్పాటుకు వ్యాపారులు, ప్రముఖులు తదితరులు మొక్కలను కాపాడేందుకు తమ వంతు సహాయం చేయాలని కోరారు. -
భక్తులకు ఇబ్బందులు లేకుండా చూద్దాం
జాయింట్ పోలీస్ కమిషనర్ శ్రీహరికుమార్ విజయవాడ (లబ్బీపేట) : పుష్కరాల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని, భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడటం మన బాద్యత అని నగర జాయింట్ పోలీస్ కమిషనర్ ఏ.శ్రీహరికుమార్ విద్యార్థులకు హితవు పలికారు. బందరురోడ్డులోని శ్రీదుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో గురువారం తెలుగు, హిందీ విభాగాల ఆధ్వర్యంలో ‘తెలుగు, హిందీ సాహిత్యాలు – నదీ ప్రాశస్త్యం – పర్యావరణ చైతన్యం’ అనే అంశంపై జాతీయ సదస్సు జరిగింది. ప్రిన్సిపాల్ టి.విజయలక్ష్మి అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథిగా పాల్గొన్న శ్రీహరికుమార్ జ్యోతి వెలిగించి సదస్సు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత విద్యార్థులదేనన్నారు. అతిథి, ఆంధ్రా ఆర్ట్స్ అకాడమీ ప్రతినిధి గోళ్ల నారాయణరావు మాట్లాడుతూ తెలుగు వారి సంస్కతి, సంప్రదాయం ఎంతో గొప్పదన్నారు. మరో అతిథి జె.ఆత్మారామ్ మాట్లాడుతూ ఒక అశ్వమేధ యాగం చేస్తే ఎంత ఫలితం వస్తుందో.. పుష్కర స్నానం చేయడం వల్ల అంతే ఫలితం వస్తుందని చెప్పారు. సదస్సులో సిద్ధార్థ అకాడమీ జాయింట్ సెక్రటరీ ఎన్.లలితప్రసాద్, రాజగోపాల్ చ్రM] వర్తి, వై.పూర్ణచంద్రరావు, వలివేలి వెంకటేశ్వరరావు తదితరులు ప్రసంగించారు. తెలుగు, హిందీ విభాగాధిపతులు డాక్టర్ ఎ.నాగజ్యోతి, రామలక్ష్మి పాల్గొన్నారు.