
బైక్ నుంచి పెట్రోల్‌ను బాటిల్‌లో నింపిన తీరు
జడ్చర్ల: మోటార్ బైక్‌లు, తదితర వాహనాల్లో రాత్రివేళ పెట్రోల్ చోరీ చేసే దొంగలను పట్టుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌లో అప్పగించిన సంఘటన ఆదివారం స్థానిక లక్ష్మీనగర్‌కాలనీలో చోటు చేసుకుంది. కాలనీవాసులు తెలిపిన వివరాలిలా.. గత ఏడాది కాలంగా ఇళ్ల ముందు పార్కు చేసిన మోటార్ బైక్‌లు, తదితర వాహనాల్లో పెట్రోల్‌ను అపహరించడంతో పాటుగా ఇంజన్ విడిభాగాలను సైతం విడదీసి తీసుకెళ్లడం జరిగిందని, పలుసార్లు నిఘా వేసి పట్టుకునేందుకు ప్రయత్నించామన్నారు. విషయాన్ని స్థానిక పోలీసుల దృష్టికి సైతం తీసుకెళ్లినట్లు వివరించారు. ఈక్రమంలో ఆదివారం తెల్లవారుజామున బైక్‌ల నుంచి పెట్రోల్ తీసి బాటిళ్లలో నింపుతుండగా రెడ్ హ్యాండ్‌గా పట్టుకున్నామని కాలనీకి చెందిన వెంకటేశ్, తదితరులు తెలిపారు. కావేరమ్మపేటకు చెందిన హసన్, ఇందిరానగర్‌కు చెందిన ముజావిద్, వెంకటేశ్వర కాలనీకి చెందిన నవాజ్ పట్టుబడగా వారిని జడ్చర్ల పోలీస్ స్టేషన్‌లో అప్పగించి ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment