చోరీ చేస్తుండగా సీసీ కెమెరాలో నమోదైన వ్యక్తి
సాక్షి, జడ్చర్ల: ఇటీవల కాలంలో జడ్చర్లలో పలు దొంగతనాలకు పాల్పడిన దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. చోరీలు చేయడం.. ఎలాంటి ఆధారాలు లేకుండా ఉండేందుకు సీసీ పుటేజీల రికార్డింగ్ డీవీఆర్ బాక్సులను ఎత్తుకెళ్లడం వీరి అలవాటు. దీంతో ఈ కేసులు పోలీసులకు సవాల్‌గా మారాయి. ఇలాంటి క్రమంలోనే దొంగలకు కనపడని ఓ సీసీ కెమెరా వారిని పట్టించింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
ఈ ఏడాది జులై 5వ తేది రాత్రి బాదేపల్లి పట్టణంలోని ఆర్‌కే గార్డెన్ సమీపంలో గల ఐటీసీ(ఇండియన్ టొబాకో కంపెనీ) గోదాంలో భారీ చోరీ చోటుచేసుకుంది. గోదాం పైకప్పు రేకును కట్టర్‌ద్వార కత్తిరించి లోపలికి ప్రవేశించిన దొంగలు నగదును, సిగరెట్ల నిల్వలను, సీసీ కెమెరాలకు సంబందించిన హార్ట్‌డిస్క్‌లను సైతం వారు అపహరించుకెళ్లారు. భద్ర పరిచిన డబ్బుల దాదాపు రూ.6.85 లక్షలు అపహరించారని అదేవిధంగా రూ.2.40 లక్షల విలువ గల సిగరెట్లు ఎత్తుకెళ్లారని అప్పట్లో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment