మహబూబ్‌నగర్: సమస్యల పరిష్కారం కోసం నిరవధిక సమ్మె చేస్తున్న ఆశ కార్యకర్తలను బుధవారం పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. దీక్ష శిబిరంలో కూర్చున్న ఆశ కార్యకర్తలు ఒక్కసారిగా రోడ్డెక్కి మానవహారంగా వచ్చి ధర్నా చేసేందుకు యత్నించటంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. తరువాత స్వంత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు.
అయితే ఆశ కార్యకర్తలు పోలీసుస్టేషన్‌లోనూ ధర్నాను కొద్దిసేపు కొనసాగించారు. అరెస్టైన వారిలో సీఐటీయూ నాయకులు శ్రీనివాసులు, ఆశ కార్యకర్తలు శివలీల, జయలక్ష్మి, సువార్త, కళావతి, సరస్వతిలు పాల్గొన్నారు.