
బాదేపల్లిలోని ఓ రేషన్ దుకాణం వద్ద గుంపులుగా చేరిన జనం
సాక్షి, జడ్చర్ల : కరోనా వైరస్ నియంత్రణకు భౌతిక దూరం పాటించాలని, మాస్క్‌లు ధరించాలని అటు ప్రభుత్వాలు, ఇటు అధికారులు, పాలకులు మొత్తుకుంటున్నా క్షేత్రస్థాయిలో కొందరు పట్టించుకోవడం లేదు. గురువారం జడ్చర్ల లోని పలు రేషన్ దుకాణాల వద్ద జనం గుంపులు గుంపులుగా నిలబడి సరుకులు తీసుకెళ్లారు. ఇప్పటికే కావేరమ్మపేటలో రెండు పాజిటివ్ కేసులు నమోదైనా ప్రజలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం సరికాదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిని అదుపు చేసేందుకు పోలీసులు చర్యలు తీసుకోవాలనివిజ్ఞప్తి చేస్తున్నారు. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా వైరస్ విజృంభించే అవకాశం ఉందనిపేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment