
సాక్షి, కొడంగల్/జడ్చర్ల: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ముందస్తు అరెస్ట్‌పై పోలీసు అధికారులు స్పందించారు. దీనిపై వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణ మాట్లాడుతూ.. కోస్గిలో సీఎం కేసీఆర్ పర్యటన ఉన్న నేపథ్యంలో ముందస్తుగా రేవంత్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. రేవంత్ అదుపులోకి తీసుకుని మహబూబ్‌నగర్‌కు తరలించామని వెల్లడించారు. కేసీఆర్ సభ ముగిసిన వెంటనే రేవంత్‌ను విడుదల చేస్తామని తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకే రేవంత్‌పై కేసులు నమోదు చేసినట్టు స్పష్టం చేశారు.
డీటీసీ పరిసరాల్లో భారీ బందోబస్తు..
ఈ రోజు తెల్లవారుజామున అరెస్ట్ చేసిన రేవంత్‌ను పోలీసులు జడ్చర్ల జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రానికి(డీటీసీ) తరలించారు. అక్కడికి కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చే అవకాశం ఉండటంతో భారీగా బలగాలు మోహరించారు. డీటీసీ పరిసర ప్రాంతాల్లో బందోబస్తు బాధ్యతలను శంషాబాద్ డీసీసీ ప్రకాశ్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు రేవంత్ అరెస్ట్‌కు నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు జడ్చర్లలో ఆందోళన చేపట్టారు.
చదవండి:
రేవంత్ రెడ్డి ముందస్తు అరెస్ట్
‘ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు’
Comments
Please login to add a commentAdd a comment