
సాక్షి, జడ్చర్ల: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని ఓ ఎస్బీఐ ఏటీఎంలో సోమవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. ఏకంగా రూ. 15 లక్షల నగదును దుండగులు అపహరించారు. తెల్ల కారులో వచ్చిన ఇద్దరు దుండగులు ముఖాలకు మాస్కులు ధరించడంతోపాటు రుమాలును చుట్టుకుని ఏటీఎంలోకి ప్రవేశించారు. ఆ వెంటనే సీసీ కెమెరాల వైర్లను కట్ చేసి, గ్యాస్ కట్టర్‌తో ఏటీఎం మిషన్‌ను కట్ చేశారు. ఏటీఎంలోని డబ్బును అపహరించి షట్టర్‌ను కిందికి దించి వెళ్లిపోయారు. మంగళవారం ఉదయం బ్యాంకు సిబ్బంది ఏటీఎం షట్టర్ మూసి ఉండటాన్ని గమనించి షట్టర్‌ను తెరవగా చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే బ్యాంకు మేనేజర్ దీపిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు.
Comments
Please login to add a commentAdd a comment