
సాక్షి, శంషాబాద్: పట్టణంలోని యాక్సిస్ బ్యాంకుకు చెందిన ఏటీఎంలో దొంగతనం చేసేందుకు యత్నించిన ఇద్దరు మైనర్లను ఆర్‌జీఐఏ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని ఇంద్రానగర్ దొడ్డికి చెందిన 9వ తరగతి చదువుతున్న ఓ బాలుడు(14) చదువు మానేసీ ఖాళీగా ఉన్న మరో బాలుడు(16)తో కలిసి ఏటీఎం ధ్వంసం చేసి డబ్బులు కాజేయాలని పథకం వేశారు. ఇద్దరు కలిసి శనివారం అర్ధరాత్రి బస్టాండ్ సమీపంలో ఉన్న యాక్సిస్ బ్యాంకు ఏటీంలోకి వెళ్లారు. ఏటీఎంకు సంబంధించిన కొన్ని వస్తువులను బయటికి తీసిన వెంటనే యాక్సిస్ బ్యాంకుకు సమాచారం అందింది. దీంతో వారు వెంటనే పోలీసులను అప్రమత్తం చేశారు. గస్తీలో ఉన్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని ఇద్దరి అదుపులోకి తీసుకున్నారు. చోరికి యత్నించిన కారణంగా వారిని జువైనల్ హోంకు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment