వెక్కిరించిన విధి | Fate Hated..Man dead | Sakshi
Sakshi News home page

వెక్కిరించిన విధి

Published Tue, Aug 30 2016 1:06 AM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM

మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబసభ్యులు

మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబసభ్యులు

  • కామెర్ల వ్యాధితో తమ్ముడి
  •  మృత్యువాత
  • అంత్యక్రియలకు వెళ్తూ 
  • రైలుకిందపడి 
  • అన్న దుర్మరణం
  • అభంగపట్నంలో తీవ్ర 
  • విషాదఛాయలు
  • ఇద్దరు కొడుకుల మతితో 
  • తల్లడిల్లిన తల్లిదండ్రులు
  • జడ్చర్ల/కోయిల్‌కొండ: తీవ్ర అనారోగ్యంతో తమ్ముడు మృతిచెందగా.. తమ్ముడిని కడసారి చూసేందుకు రైల్లో వస్తున్న అన్న ప్రమాదవశాత్తు జడ్చర్లరైల్వేస్టేష న్‌లో రైలుకింద పడి దుర్మరణం పాల య్యాడు. రక్తం పంచుకుని పుట్టిన అన్నదమ్ములను విధి చివరిసారిగా చూ సుకోకుండా చేసింది. కొన్నిగంటల వ్యవధిలోనే ఒకే కుటుంబంలో ఇద్దరు చనిపోవడంతో విషాదఛాయలు అలుముకున్నా యి. ఈ సంఘటన సోమవారం చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు.. కోయిల్‌కొండ మండలం అభంగపట్నం గ్రామానికి చెందిన సిర్ర కృష్ణ య్య, వీరమణి దంపతులకు ఓ కూతురుతో పాటు కొడుకులు పరశురామ్, రమేష్‌ ఉన్నారు. ఇటీవల చిన్నకొడుకు రమేశ్‌(18) కామెర్ల వ్యాధి బారినపడ్డాడు. జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరి స్థితి విషమించడంతో ఆదివారం మృతి చెందాడు. దీంతో సోమవారం మతదేహాన్ని సొం తూరు అభంగపట్నం తీసుకెళ్లారు.
     
          హైదరాబాద్‌లో పనిచేస్తున్న వారి పెద్దకొడుకు పరశురామ్‌(23)కు తమ్ముడి మరణవార్త తెలియడంతో అంత్యక్రియల కోసం వచ్చేందుకు ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని బుద్వేలు రైల్వేస్టేçÙన్‌లో రైలు ఎక్కి సొంతూరుకు పయనమయ్యాడు. జడ్చర్ల రైల్వేస్టేçÙన్‌ సమీపంలోకి వచ్చే సరికి ఏం జరిగిందో తెలియదు కానీ అతడు రైలుకింద పడి దుర్మరణం పాల య్యాడు. రైల్వే పోలీసులు గమనించి వివరాలు ఆరాతీయగా అభంగపట్నం గ్రామానికి చెందిన పరశురామ్‌గా గుర్తిం చారు. మతదేహానికి జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. 
     
     
    అభంగపట్నంలో విషాదఛాయలు
    సిర్ర కష్ణయ్య, వీరమణి దంపతులు నిరుపేదలు.. రెక్కాడితేగాని డొక్కాడని బతుకులు వారివి. వారి పెద్దకొడుకు పరశురాం హైదరాబాద్‌లో తాపీమేస్త్రీగా పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. రమేష్‌ గార్లపహాడ్‌ ఉన్నతపాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. అయితే రమేష్‌ రెండురోజులుగా కామెర్ల వ్యాధితో బాధపడుతున్నాడు. ఆస్పత్రిలో చూపించుకున్నా నయం కాలేదు. అయితే  ఒకేరోజు కొడుకులిద్దరూ చనిపోవడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. తమకు దిక్కెవరని విలపించడం ప్రతి ఒక్కరినీ కంటతడిపెట్టించింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వేహెడ్‌కానిస్టేబుల్‌ ముస్తాక్‌ అహ్మద్‌ పేర్కొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement