
పందిపాలు తాగుతున్న పిల్లి
సాక్షి, జడ్చర్ల టౌన్(మహబూబ్‌నగర్): సమాజంలో ఏ వింత జరిగినా బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైందని పెద్దలు చెప్పడం వింటూ ఉంటాం. అలాంటిదే ఈ వింత. జడ్చర్లలో మంగళవారం ఓ పిల్లి పందిపాలు తాగుతున్న వీడియో వైరల్‌గా మారింది. శ్రీలక్ష్మీనగర్ కాలనీలో కారుపక్కన గోడచాటున పందిపడుకుని ఉండగా అటునుంచి వచ్చిన పిల్లి దాని పాలు తాగడం గమనించిన కొందరు వీడియో తీశారు. పిల్లి కొద్దిసేపు పాలు తాగినా పంది వద్దని వారించకపోవటం విశేషం. దీన్ని సోషల్ మీడిమాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది.
చదవండి: ఈ తెల్లటి డేగ రేటెంతో తెలుసా? జస్ట్ 3.4 కోట్లు!!
Comments
Please login to add a commentAdd a comment