జడ్చర్ల: తనిఖీలకు వెళ్లిన ఎక్సై జ్ అధికారులు, సిబ్బందిపై గుడుంబా తయారీదారులు ఒక్కసారిగా కర్రలతో దాడికి పాల్పడ్డారు. దీంతో ఎక్సైజ్ సీఐ, హెడ్‌కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన శనివారం అర్ధరాత్రి జడ్చర్ల మం డలం కిష్టారం సమీపంలోని ఒంటిగుడిసె తండాలో చోటు చేసుకుంది. గుడుంబా నియంత్రణలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ఎక్సైజ్ సీఐ బాలాజీ, ట్రెయినీ ఎస్‌ఐ ఉమామహేశ్వ ర్, హెచ్‌సీ రమేశ్, కానిస్టేబుళ్లు సిద్ధార్థ, వెంకటేశ్ తమ వాహనం లో కిష్టారం సమీపంలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఓ బైక్, లూనాపై నలుగురు వ్యక్తులు 20 లీటర్ల గుడుంబాను తరలి స్తుండగా పట్టుకుని విచారించారు.
తాము ఒంటిగుడిసె తండా సమీపంలో రాజు నుంచి గుడుంబాను కొనుగోలు చేసినట్లు వారు సమాచారం ఇవ్వడంతో ఎక్సైజ్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వీరి రాకను పసిగట్టిన నలుగురు తయారీదారులు విచక్షణారహితంగా కర్రల తో దాడి చేశారు. దీంతో సీఐ, హెచ్‌సీ, ఇద్దరు కానిస్టేబుళ్ల తలలు పగిలి తీవ్ర రక్తస్రావమైంది. బాధితులు బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందారు. అనంతరం జడ్చర్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా సీఐ వీరస్వామి కేసు దర్యాప్తు చేపట్టా రు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదివారం జడ్చర్ల ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. దాడులకు వెళ్లే సమయంలో ఆత్మరక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. నిందితులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
గాయపడిన ఎక్సైజ్ సీఐ బాలాజీ, కానిస్టేబుల్ సిద్ధార్థ
Comments
Please login to add a commentAdd a comment