తమ సమస్యల పరిష్కారం కోసం నిరవధిక సమ్మె చేస్తున్న ఆశ కార్యకర్తలు సోమవారం జడ్చర్ల తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు.
జడ్చర్ల టౌన్ (మహబూబ్‌నగర్ జిల్లా) : తమ సమస్యల పరిష్కారం కోసం నిరవధిక సమ్మె చేస్తున్న ఆశ కార్యకర్తలు సోమవారం జడ్చర్ల తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ముట్టడి సందర్భంగా సీఐటీయూ ఇండస్ట్రియల్ జిల్లా ఉపాధ్యక్షులు దీప్లానాయక్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని, ఆశ కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.
ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో ఇచ్చే గౌరవ వేతనం ఏమాత్రం చాలటం లేదన్నారు. వెంటనే ఆశ కార్యకర్తల డిమాండ్లను తీర్చేందుకు హామీ ఇవ్వాలన్నారు. అప్పటి వరకు సమ్మె విరమించేది లేదని ప్రకటించారు. ముట్టడి అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని తహాశీల్దార్ జగదీశ్వర్‌రెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో మండలంలోని ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.