తహశీల్దార్ కార్యాలయం ఎక్కి నిరసన | Asha workers strike in Telangana continues | Sakshi
Sakshi News home page

తహశీల్దార్ కార్యాలయం ఎక్కి నిరసన

Published Thu, Oct 8 2015 4:08 PM | Last Updated on Sun, Sep 3 2017 10:39 AM

Asha workers strike in Telangana continues

జగదేవ్‌పూర్ (మెదక్ జిల్లా) : ఆశావర్కర్ల నిరవధిక సమ్మె గురువారం నాటికి 37 రోజులకు చేరుకుంది. సమ్మెలో  భాగంగా ఆశా వర్కర్లు తహశీల్దార్ కార్యాలయం ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 37 రోజుల నుండి సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మా సమస్యలు తీర్చే వరకు సమ్మెను కొనసాగిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆశావర్కర్లు లత, మాధవి, జ్యోతి, అనూరాధ, ప్రియాంక, సంతోష, బీబీ, కవిత, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement