
సాక్షి, జడ్చర్ల: నిండుగా మద్యం తాగి రోడ్డుపై పడిపోయిన ఓ తండ్రిని వదలివేయకుండా తన కాళ్లపై పడుకోబెట్టుకొని తండ్రి లేచిన తర్వాత ఇంటికి వెళ్లిపోయిన సంఘటన మంగళవారం స్థానిక నేతాజీచౌరస్తా సమీపంలో చోటు చేసుకుంది.
వివరాల ప్రకారం.. కొత్తతండాకు చెందిన మన్యానాయక్ తన బైక్ సర్వీస్ కోసం కుమారుడు హరీష్‌తో కలిసి జడ్చర్లకు వచ్చాడు. అనంతరం తండ్రి మద్యం తాగి రోడ్డుపై పడిపోవడంతో తనయుడు ఎర్రటి ఎండలో తన కాళ్లపైనే పడుకోబెట్టుకున్నాడు. కాగా ఓవైపు ఎండ వేడిమి, నేలపై ఉన్న చీమలు కుడుతున్నా ఆ బాలుడు ఓపికతో ఏమీ జరుగకుండా చూసుకున్నాడు. ఈ తీరును పలువురి కలిచి వేసిన చివరికి ఆ బాలుడిని శభాష్ అంటూ మెచ్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment