liquor drunk
-
తండ్రికి వీడని మత్తు.. వదలని బాలుడు
సాక్షి, జడ్చర్ల: నిండుగా మద్యం తాగి రోడ్డుపై పడిపోయిన ఓ తండ్రిని వదలివేయకుండా తన కాళ్లపై పడుకోబెట్టుకొని తండ్రి లేచిన తర్వాత ఇంటికి వెళ్లిపోయిన సంఘటన మంగళవారం స్థానిక నేతాజీచౌరస్తా సమీపంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. కొత్తతండాకు చెందిన మన్యానాయక్ తన బైక్ సర్వీస్ కోసం కుమారుడు హరీష్‌తో కలిసి జడ్చర్లకు వచ్చాడు. అనంతరం తండ్రి మద్యం తాగి రోడ్డుపై పడిపోవడంతో తనయుడు ఎర్రటి ఎండలో తన కాళ్లపైనే పడుకోబెట్టుకున్నాడు. కాగా ఓవైపు ఎండ వేడిమి, నేలపై ఉన్న చీమలు కుడుతున్నా ఆ బాలుడు ఓపికతో ఏమీ జరుగకుండా చూసుకున్నాడు. ఈ తీరును పలువురి కలిచి వేసిన చివరికి ఆ బాలుడిని శభాష్ అంటూ మెచ్చుకున్నారు. చదవండి: (కూకట్పల్లి ప్రాంతానికి ఈ నెల 29న నీళ్లు బంద్..) -
దేవుణ్ని చూపిస్తానని.. 70 అడుగుల బావిలో..
-
దేవుణ్ని చూపిస్తానని.. 70 అడుగుల బావిలో..
సాక్షి, కడప: తాగిన మైకంలో అసలు దేవుడు ఉన్నాడా? లేడా? అని ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణ కారణంగా ఓ వ్యక్తి బావిలో పడ్డాడు. ఈ ఘటన వైఎస్సార్ కడప జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు.. చింతకొమ్మ దిన్నె సమీపంలోని మద్దిమడుగుకి చెందిన కిశోర్ నాయక్, సుగాలి బిడికికి చెందిన రామాంజనేయులు బావి గట్టున కూర్చోని మద్యంగా సేవించారు. తాగిన మైకంలో వీరిద్దరూ దేవుడి గురించి చర్చించుకున్నారు. కిషోర్ నాయక్ దేవుడు ఉన్నాడని వాదించడంతో రామాంజనేయులు లేడని వాదించాడు. వీరి వాదనలు తారస్థాయికి చేరాయి. ఇక కిషోర్ నాయక్ తాగిన మైకంలో పక్కనే ఉన్న బావిలో గంగమ్మ తల్లి ఉంటుందని ఆమెను చూపిస్తాని బావిలోకి దిగే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బావిలో ఉన్న ఓ రాయిపై కిషోర్ నాయక్ కాలు వేయటంతో ఆ రాయి విరిగి సుమారు 70 అడుగుల లోతున పడిపోయాడు. దీంతో ఆందోళన చెందిన రెండో వ్యక్తి స్థానికులకు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని బావిలో పడ్డ వ్యక్తిని రక్షించారు. అనంతరం కిషోర్ నాయక్‌ను ఆస్పత్రికి తరలించారు. -
2 రోజులు.. రూ.400 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: కొత్త సంవత్సరం మందుబాబులకు మంచి ‘కిక్కు’ ఇచ్చింది. నూతన సంవత్సరానికి స్వాగతం చెబుతూ డిసెంబర్ 30, 31 తేదీల్లో రూ.400 కోట్లకు పైగా విలువైన మద్యాన్ని తాగిపారేశారు లిక్కర్ రాయుళ్లు. ఈ రెండు రోజుల్లో దాదాపు 10 లక్షల కేసుల మద్యం విక్రయాలు జరగడం విశేషం. గత ఏడాది డిసెంబర్ చివరి వారమంతా కలిసి రూ.600 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరగ్గా, చివరి రెండు రోజుల్లోనే రూ.400 కోట్ల విలువైన లిక్కర్ అమ్ముడుపోయిందని అంచనా. రాష్ట్రంలో రోజుకు సగటున రూ.62 కోట్ల వరకు మద్యం వ్యాపారం జరుగుతుండగా, న్యూ ఇయర్ సందర్భంగా చివరి రెండు రోజులు కలిపి అందుకు ఆరున్నర రెట్లు విక్రయాలు జరిగాయని ఎక్సైజ్ అధికారులు చెపుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోనే రూ.100 కోట్లకు పైగా విక్రయాలు జరిగాయని ఎక్సైజ్ వర్గాలంటున్నాయి. ఇక బీర్లు, లిక్కర్ వారీగా చూస్తే ఈ 2 రోజుల్లో దాదాపు 4.5 లక్షల కేసుల బీర్లు, 5.10 లక్షల కేసుల లిక్కర్ అమ్మకాలు జరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి లిక్కర్ అమ్మకాలు భారీగా పెరగడం గమనార్హం. ఊగుతూ... తోలుతూ.... తాగడంతో ఆగకుండా అలాగే డ్రైవింగ్ కూడా చేశారు మందుబాబులు. పోలీసుల హెచ్చరికలు లెక్కచేయకుండా తాగి రోడ్ల మీదకు వచ్చిన వాహనదారులు డ్రంకెన్ డ్రైవింగ్‌లో దొరికిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో 3,150 మంది మందుబాబులు డ్రైవింగ్ చేస్తూ బ్రీత్ అనలైజర్ టెస్టులో పోలీసులకు దొరికిపోయారు. వీరిలో అత్యధికంగా హైదరాబాద్ నుంచే ఉన్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 950 మంది, సైబరాబాద్ పరిధిలో 873 మంది మందుబాబులు చిక్కారు. రాచకొండలో మాత్రం స్వల్పంగా 281 కేసులే నమోదయ్యాయి. ఇక కరీంనగర్లో 148, నల్లగొండలో 152, సిద్ధిపేట 99 చొప్పున మందుబాబులు దొరికారు. పట్టుబడిన వారిలో దాదాపు 1,500 మంది 18 నుంచి 35 ఏళ్లలోపు వారే. పట్టుబడిన వారిలో అందరూ విద్యావంతులే కావడం విశేషం. వీరిలో పలువురికి జరిమానాలు విధించగా, కొందరి వాహనాలను స్టేషన్లకు తరలించారు. మంగళవారం రాత్రి 10 గంటలకు మొదలైన పోలీస్ స్పెషల్ డ్రైవ్ బుధవారం ఉదయం 8 గంటల వరకు సాగింది. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ఇంతమంది దొరకడంతో వీరందరి డ్రైవింగ్ లైసెన్సుల్లో పాయింట్లు నమోదు చేయాలని పోలీసులు నిర్ణయించారు. ఆల్కహాలు తీవ్రత ఆధారంగా వీరందరి డ్రైవింగ్ లైసెన్సుల్లో పాయింట్లు నమోదు చేస్తారు. ఆల్రెడీ 12 పాయింట్లకు చేరువలో ఉన్నవారి డ్రైవింగ్ లైసెన్సులు రద్దయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. -
‘అమ్మ’కానికి పసిబిడ్డ
కాజీపేట అర్బన్: కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే మద్యం మత్తులో 8 నెలల బాబును వెయ్యి రూపాయలకు విక్రయించేందుకు యత్నించింది. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లాలోని వరంగల్ బస్టాండ్‌లో మంగళవారం చోటుచేసుకుంది. జనగామ జిల్లా పెంబర్తిలోని ఓ హోటల్లో పనిచేస్తూ సహజీవనం సాగిస్తున్న పెన్నింటి లింగం, సుజాతలకు 8 నెలల క్రితం ఓ బాబు పుట్టాడు. అప్పటికే లింగంకు మరో మహిళతో వివాహం జరగగా వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉంది. ఈ క్రమంలో సుజాత, లింగంల మధ్య తరచూ గొడవలు జరుగుతుండగా సుజాత మద్యానికి బానిసైంది. ఆదివారం అతిగా మద్యం సేవించడంతో సుజాతపై లింగం చేయి చేసుకున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన సుజాత సోమవారం పెంబర్తి రైల్వే స్టేషన్లో రైలు ఎక్కి వరంగల్ రైల్వే స్టేషన్ కు చేరుకుంది. ఆ తర్వాత స్టేషన్ ఎదురుగా ఉన్న బస్టాండ్‌కు చేరుకున్న ఆమె మద్యం మత్తులో నిద్రించగా 8 నెలల బాబు ఏడుస్తున్నా పట్టించుకోలేదు. రెండ్రోజులుగా చంటి బిడ్డతో బస్టాండ్‌లో ఉన్న సుజాతను గస్తీ పోలీసు సిబ్బంది గమనిస్తూనే ఉన్నారు. మంగళవారం ఉదయం ఆమె తన బాబును రూ. వెయ్యికి విక్రయించేందుకు యత్నిస్తుండగా వారు అడ్డుకుని సీడబ్ల్యూసీ అధికారులకు అప్పజెప్పారు. సీడబ్ల్యూసీ అధికారులు ఐసీపీఎస్ అధికారుల సౌజన్యంతో హన్మకొండలోని బాలరక్ష భవన్‌కు సుజాత, బాబును తరలించారు. భర్త లింగంకు సమాచారం అందించి, కౌన్సెలింగ్ అనంతరం స్వధార్ హోంకు తరలించారు. సహజీవనం చేస్తున్న సుజాత, లింగంలను ఒక్కటి చేశారు. ఈ విషయంపై ఇంతేజార్గంజ్ సీఐ శ్రీధర్ మాట్లాడుతూ.. సుజాత తన బిడ్డను రూ. 1,000కి అమ్మకానికి పెట్టిందనేది అవాస్తవమని, ఎక్కడికి వెళ్లాలో తెలియక బస్టాండ్‌లో ఉంటే ప్రయాణికులే ఇదంతా సృష్టించారన్నారు. మానసిక స్థితి సరిలేక, భర్త కొట్టడం వల్ల మనోవేదనకు గురైన సుజాత సరిగా సమాధానం చెప్పడం లేదన్నారు. -
'డ్రంకన్ డ్రైవ్' కు వినూత్న శిక్ష
రాయదుర్గం: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వారికి వినూత్న శిక్షను మెజిస్ట్రేట్ విధించారు. మద్యం సేవించి వాహనాలు నడుపరాదని ప్లకార్డులు చేత పట్టి వరుసగా రెండు వరుసల్లో బారులు తీరి నడుచుకుంటూ రోడ్డుపై ప్రచారం చేసిన సంఘటన సోమవారం ఐటీ జోన్ ప్రాంతంలో చోటు చేసుకుంది. మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు శుక్ర, శనివారం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఇందులో 22 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు. దీంతో వారిని సోమవారం మియాపూర్ కోర్టులో హజరుపర్చారు. మెజిస్ట్రేట్ 22 మందికి వినూత్న శిక్షగా మద్యం సేవించి వాహనాలు నడుపరాదని ప్లకార్డులు చేతిలో పట్టుకొని రోడ్డు ప్రచారం చేసేలా చూడాలని ట్రాఫిక్ పోలీసులకు ఆదేశించారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ నుంచి ట్రిపుల్ఐటీ కూడలి మీదుగా నానక్‌రాంగూడ ఐటీ జోన్‌లోని విప్రో సర్కిల్ వరకు ‘డోంట్ మిక్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ ’ అని వ్రాసి ఉన్న ప్లకార్డులను వారు చేతుల్లో ధరించి వాక్ నిర్వహించారు. ఈ వాక్‌ను మాదాపూర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ టి.నర్సింగ్ రావు, ఎస్ఐలు, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పర్యవేక్షించారు. -
స్వచ్ఛ భారత్‌లో పాల్గొన్న మందుబాబులు
రాంగోపాల్‌పేట్: మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడిన వారికి స్వచ్ఛ భారత్‌లో పాల్గొని వీధులు శుభ్రం చేయాలని కోర్టు శిక్షను విధించింది. గురువారం సాయంత్రం మహంకాళి పోలీసులు మందు బాబులతో సికింద్రాబాద్ స్టేషన్ వద్ద వీధులను శుభ్రం చేయించారు. ఈ నెల 3వ తేదీన మహంకాళి పోలీసులు డ్రంకన్ డ్రైవ్ చేపట్టగా 9 మంది మద్యం సేవించి వాహనాలు నడిపినట్లు గుర్తించి వారిని ఈ నెల 7వ తేదీన 4వ మెట్రో పాలిటన్ కోర్టు ముందు హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ శ్రీదేవి ఇందులో 5 మందికి మూడు రోజులు రోజు గంట చొప్పున, నలుగురు రెండు రోజుల పాటు రోజు గంట చొప్పున స్వచ్ఛ భారత్‌లో పాల్గొనాలని ఆదేశించారు. గురువారం ఉత్తర మండలం ట్రాఫిక్ ఏసీపీ ముత్యంరెడ్డి, మహంకాళి ట్రాఫిక్ అదనపు ఇన్స్పెక్టర్ రామస్వామి, ఎస్సై కోటయ్య తదితరులు వారిచే రోడ్లు శుభ్రం చేయించారు. మందు తాగి వాహనాలు నడుపవద్దని ప్లకార్డులు పట్టుకుని ఆల్ఫా హోటల్ నుంచి మోండా మార్కెట్ రోడ్లో పాత గాంధీ చౌరస్తా వరకు వీధులను శుభ్రం చేశారు. -
ఆర్టీసీ బస్సు కింద పడ్డ బైక్
మెంటాడ(విజయనగరం): మద్యం మత్తులో వాహనం నడుపుతున్న వ్యక్తి అదుపుతప్పి ఆర్టీసీ బస్సు కిందపడ్డాడు. ఈ సంఘటన విజయనగరం జిల్లా మెంటాడ మండల శివారులో జరిగింది. వివరాలు.. ఆండ్ర నుంచి గజపతినగరం బైక్‌పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు ఎదురుగా వస్తున్న విజయనగరం డిపోకు చెందిన బస్సు కింద పడ్డారు. దీంతో వారికి స్వల్పగాయాల య్యాయి. ఇది గమనించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. -
చిన్నారి గొంతు కోసి చంపిన తండ్రి
గుంటూరు: గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట మండలం లింగగుంటల్లో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ఓ కర్కశ తండ్రి తన 9 ఏళ్ల చిన్నారి గొంతు కోసి చంపాడు. అనంతరం తండ్రి ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే స్థానికులు ఆ విషయాన్ని గమనించిన అతన్ని రక్షించి ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని చిన్నారి మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.