కందుకూరు తొక్కిసలాట ఘటన.. ఇంటూరి నాగేశ్వరరావు అరెస్ట్‌ | Inturi Nageswara Rao Arrested In Kandukur Stampede Incident | Sakshi
Sakshi News home page

కందుకూరు తొక్కిసలాట ఘటన.. ఇంటూరి నాగేశ్వరరావు అరెస్ట్‌

Published Thu, Jan 5 2023 7:08 PM | Last Updated on Thu, Jan 5 2023 7:27 PM

Inturi Nageswara Rao Arrested In Kandukur Stampede Incident - Sakshi

సాక్షి, నెల్లూరు జిల్లా: చంద్రబాబు కందుకూరు సభ తొక్కిసలాట ఘటనలో కందుకూరు టీడీపీ ఇన్‌ఛార్జ్‌ ఇంటూరి నాగేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు ఇంటూరి రాజేష్‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 8 మంది మృతికి కారణమైన నాగేశ్వరరావు, రాజేష్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 304 పార్ట్‌ 2 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

కందుకూరులో ఇరుకు సందులో కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండానే చంద్రబాబు సభ పెట్టడంతో తొక్కిసలాటలో 8 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అసలే 30 అడుగుల ఇరుకు రోడ్లు. దాన్లో కూడా అటూ ఇటూ ఫ్లెక్సీలు, కటౌట్లు పెట్టి... 20 అడుగులకు కుదించేశారు. ఆ ఇరుకు రోడ్లో ఐదారు వేల మంది వచ్చినా... పై నుంచి డ్రోన్లతో షూటింగ్‌ చేస్తే చాలా భారీగా జనం తరలివచ్చినట్లు కనిపిస్తుంది.

ఆ ఫొటోలను పత్రికల్లో, టీవీల్లో విస్తృతంగా ప్రచారం చేయటం ద్వారా ప్రతి సభకూ, రోడ్‌ షోకూ జనం పోటెత్తుతున్నారని చెప్పటం చంద్రబాబు నాయుడి ఉద్దేశం. చంద్రబాబు రోడ్‌ షోలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న ఈ ఫార్ములా.. కందుకూరులో ఎనిమిది నిండు ప్రాణాలను బలి తీసుకుంది. 
చదవండి: Fact Check: ప్రాణాలు పోతున్నా ఆగని టీడీపీ ప్రచార యావ.. ఫేక్‌ వీడియోలతో..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement