సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్ తెలిపారు. ఆయన శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తండ్రి కొడుకుల పార్టీ తెలంగాణను దోచుకుంటుందని దుయ్యబట్టారు. కుటుంబ పాలనతో లూటీ చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. (చదవండి: ‘టీఆర్‌ఎస్‌తో ఏ దోస్తీ లేదు’)
ఫామ్ హౌస్ నుంచి సీఎం కేసీఆర్ బయటకు రావడంలేదని, ఒక్క గ్రామానికైనా, ఒక్క ఆస్పత్రికైనా, ఒక్క పేద వాడి ఇంటికైనా సీఎం వెళ్ళారా ? అని ప్రశ్నించారు. తెలంగాణలో నిజాం సర్కారు కొనసాగుతోందని మండిపడ్డారు. ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని అడ్దుపెట్టుకొని బీజేపీని తెలంగాణలో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గరీబ్ విముక్త్ భారత్ నిర్మాణానికి మోదీ ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఆయుష్మాన్ భారత్‌ను తెలంగాణలో ఎందుకు అమలు చేయడం లేదని తరుణ్ చుగ్ ప్రశ్నించారు. (చదవండి: కొత్త కోడళ్లకు నో రేషన్..)
Comments
Please login to add a commentAdd a comment