విజయనగరం టౌన్ : జిల్లాలోని పలు మండలాలకు వైఎస్సార్ సీపీ మండల ఇన్‌చార్జిలను నియమించినట్టు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశా రు. డెంకాడ, భోగాపురం మండలాలకు గదిరాజు సూ రపురాజు, గరివిడి మండలానికి గొర్లె వెంకటరమణ, గజపతినగరం, బొండపల్లి మండలాలకు బర్రి చిన్న అప్పన్న, జామి, వేపాడ మండలాలకు పి. జైహింద్‌కుమార్, ఎస్. కోట, ఎల్. కోట మండలాలకు మామిడి అప్పలనాయుడు, నెల్లిమర్లకు కడియాల రామకృష్ణను నియమించినట్టు తెలిపారు. వీరి ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీ కలెక్టరేట్ వద్ద జరిగే మహాధర్నాను నాయకు లు, కార్యకర్తలు విజయవంతం చేయాలన్నారు.
వైఎస్సార్ సీపీ మండల ఇన్‌చార్జిల నియామకం
Published Mon, Dec 1 2014 2:14 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM
Advertisement
Advertisement