పరువు నష్టం దావాపై కేటీఆర్‌ రియాక్షన్‌ | KTR Reacts On Manickam Tagore Defamation Notices | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌పై మాణిక్యం ఠాగూర్‌ పరువు నష్టం దావా: కౌంటర్‌గా కోమటిరెడ్డి ప్రస్తావన

Published Wed, Jan 31 2024 2:41 PM | Last Updated on Wed, Jan 31 2024 2:51 PM

KTR Reacts On  Manickam Tagore Defamation Notices - Sakshi

హైదరాబాద్‌/ఢిల్లీ, సాక్షి: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, తెలంగాణ మాజీ ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్ తనపై పరువు నష్టం కేసు వేయడంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్పందించారు. ఆయన అయోమయంలో ఉన్నారని.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఒకరే ఠాకూర్‌పై గతంలో సంచలన ఆరోపణలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్‌ ప్రస్తావించారు. 

‘‘మాణిక్యం ఠాగూర్ అయోమయంలో ఉన్నారు. ఆయనపై తోటి కాంగ్రెస్ నాయకుడు.. ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగంగానే సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి మీకు(మాణిక్యం ఠాగూర్‌ను ఉద్దశిస్తూ..) రూ. 50 కోట్లతో పీసీసీ పదవి కొనుక్కున్నారని చెప్పారు. అదే మాట మీకు మళ్లీ గుర్తు చేస్తున్నా. పెద్ద ఎత్తున మీడియాలో వచ్చిన ఆ వార్తలనే నేను ప్రస్తావించా. పైగా కోమటిరెడ్డి చేసిన ఆ ఆరోపణలను ఇప్పటిదాకా వెనక్కి కూడా తీసుకోలేదు.. వివరణా ఇవ్వలేదు. 

.. మీరు పంపే పరువు నష్టం నోటీసులు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పంపిస్తే బాగుంటుంది. నా చిరునామాకు కాకుండా మీ ప్రభుత్వంలో సచివాలయంలో కూర్చున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్యాలయానికి పంపించండి అంటూ ఎక్స్‌లో కేటీఆర్‌ సూచించారు. ఇదిలా ఉంటే.. 

తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారని మాణిక్యం ఠాగూర్ నోటీసులు పంపారు. బహిరంగంగా క్షమాపణ చెప్పాలని.. వారంరోజుల్లోగా అదిర జరగకపోతే తదుపరి చట్టపరమైన చర్యలకు ముందుకెళ్తామని నోటీసుల్లో హెచ్చరించారాయన. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement