ఇన్ఫోసిస్‌కు అశోక్ వేమూరి గుడ్‌బై | Infosys Americas head, seen as CEO contender, resigns | Sakshi
Sakshi News home page

ఇన్ఫోసిస్‌కు అశోక్ వేమూరి గుడ్‌బై

Published Thu, Aug 29 2013 1:43 AM | Last Updated on Fri, Sep 1 2017 10:12 PM

Infosys Americas head, seen as CEO contender, resigns

బెంగళూరు: ఇన్ఫోసిస్ టాప్ మేనేజ్‌మెంట్‌లో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా బోర్డు సభ్యుడు అశోక్ వేమూరి రాజీనామా చేశారు. ఉత్తర అమెరికాలో తయారీ విభాగం రీజనల్ హెడ్‌గా ఉన్న సంజయ్ జలోనా ఇకపై వేమూరి స్థానంలో మ్యాన్యుఫ్యాక్చరింగ్ గ్లోబల్ హెడ్‌గా బాధ్యతలు చేపడతారని ఇన్ఫోసిస్ ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికాలో ఫైనాన్షియల్ సర్వీసెస్ వ్యాపార విభాగం హెడ్‌గా చతుర్వేది వైదొలిగిన వారం రోజుల్లోగానే వేమూరి రాజీనామా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇన్ఫీ గ్లోబల్ సేల్స్‌హెడ్ వాసవ్ గత నెలలోనే వైదొలిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement