సాక్షి, బెంగళూరు: దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్‌కు సీఈవో కానున్నారనే వార్తలపై కండ్యూయెంట్ సీఈవో డైరెక్టర్ అశోక్ వేమూరి(49) స్పందించారు. తాను ఇన్ఫీ సీఈవో రేసులో లేనని స్పష్టం చేశారు. అశోక్ వేమూరి ఇన్ఫీ సీఈవో కానున్నారన్న అంచనాలు ఇటీవల ఇండస్ట్రీ వర్గాల్లో క్కర్లుకొట్టాయి. ఈ నేపథ్యంలో ఈ అంచాలన్నీ అవాస్తవాలని తేల్చి పారేశారు. తాను కండ్యూయెంట్ కంపెనీకి కట్టుబడి ఉన్నానని చెప్పారు.
తాను కండ్యూయెంట్ కంపెనీకి, ఖాతాదారులకు, షేర్ హోల్డర్స్, ఉద్యోగులకు పూర్తిగా నిబద్ధుడినై ఉన్నానని ప్రకటించారు. అద్భుతమైన ప్రయాణం మధ్యలో ఉన్నాం, అది వేగంగా అభివృద్ధి చెందే దిశలో ఉంది . ఈ విషయంలో తనకు బోర్డుతో సహా ఇతర ఖాతాదారులు, టీం మద్దతు ఉందని వెల్లడించారు.
తన దీర్ఘ కాల ప్రయాణంలో ఉన్నానని, అది పూర్తి చేయాలని భావిస్తున్నానని ఆఫ్ క్రాస్ రీసెర్చ్ విశ్లేషకుడు షానోన్ క్రాస్ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అంతేకాదు ఇక్కడ (కండ్యూయెంట్) కంటే ఎక్కువ ఉత్తేజకరమైన, వృత్తిపరంగా సంతృప్తికరమైన స్థలం గురించి తాను ఆలోచించలేనని అశోక్ వేమూరి స్పష్టం చేశారు.
కాగా ఇన్ఫోసిస్ సీఎండీగా విశాల్ సిక్కా రాజీనామా అనంతరం ఈ పదవిలో రేసులో ఉ న్న వారి పేర్లలో అశోక్ వేమూరి పేరు ప్రముఖంగా వినిపించింది. ఇన్ఫోసిస్ మాజీ బోర్డు సభ్యుడు కూడా వేమూరి 2013లో కంపెనీ వీడారు.
Comments
Please login to add a commentAdd a comment