![Basavaraj Bommai resigned from the post of CM - Sakshi](/styles/webp/s3/article_images/2023/05/13/bommai.jpg.webp?itok=Bxj-5pKn)
కర్ణాటక ముఖ్యమంత్రిగా 19 నెలల 17 రోజులు పనిచేసిన 'బసవరాజు బొమ్మై' ఎట్టకేలకు రాజీనామా చేశారు. ఇందులో భాగంగానే తన రాజీనామా లేఖను గవర్నర్‌కు అందించారు. ఈ రోజు విడుదలైన ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ 136 సీట్లతో భారీ విజయాన్ని కైవసం చేసుకుంది.
కేవలం 65 స్థానాలకు పరిమితమైన బీజేపీ ప్రస్తుతం కర్ణాటకలో అధికారం కోల్పోయింది. కన్నడ నాట ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ సీఎం రేసులో డీకే శివకుమార్, సిద్దరామయ్య ఉన్నారు. అయితే ఎవరు కర్ణాటక కొత్త ముఖ్యమత్రి అనేది అధిష్టానం నిర్ణయిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment