CM post
-
మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పీఠంపై ఉత్కంఠ
-
Maharashtra Polls: నాకూ సీఎం కావాలని ఉంది.. అజిత్ పవార్
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సీఎం పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి గెలిస్తే.. తాను సీఎం కావాలనే ఆశతో ఉన్నట్లు అజిత్ పవార్ పేర్కొన్నారు.పుణెలోని దగ్దుషేత్ హల్దవాయ్ గణపతి ఆలయంలో మంగళవారం అజిత్ పవార్ పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. ‘ప్రతిఒక్కరు తమ నాయకుడిని సీఎంగా చూడాలని కోరుకుంటారు. నేను కూడా అదే అనుకుంటున్నారు. కానీ ఎవరైనా సీఎం కావాలనుకుంటే.. వారు మెజార్టీ సంఖ్యకు చేరుకోవాలి. ప్రతి ఒక్కరి ఆకాంక్షలు నెరవేరవు.చదవండి: ‘వారిపై చర్యలు తీసుకోండి’.. ప్రధాని మోదీకి ఖర్గే లేఖప్రతి ఒక్కరికి ఒక అభిప్రాయంక, కోరికలు ఉంటాయి. కానీ అందరూ వారు కోరుకున్నది పొందలేరు. అదంతా ఓటర్ల చేతిలో ఉంటుంది. 288 స్థానాలకుగానూ 145 సీట్లు దక్కించుకోవాలి’ అని ఈ డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా రాబోయే ఎన్నికల్లో సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోనే మహాయుతి కూటమి(బీజేపీ, శివసేన, ఎన్సీపీ) పోటీ చేస్తుందని పేర్కొన్నారు.‘మా కూటమిని మరోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు మేమంతా ప్రయత్నిస్తున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత అంతా కలిసి చర్చించుకొని తదుపరి సీఎంను ఎంచుకుంటాం’ అని తెలిపారు. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏక్నాథ్ శిండేను ముఖ్యమంత్రి చేయాలంటూ శివసేన నేతలు డిమాండ్ చేస్తోన్న తరుణంలో పవార్ స్పందించడం గమనార్హం. మరోవైపు డిప్యూటీ సీఎంగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్‌ను మరోసారి సీఎం పీఠంపై కూర్చోబెట్టాలని బీజేపీ నేతలు ఆకాంక్షిస్తున్నారు. -
ఎన్నికల వేళ.. హర్యానా బీజేపీలో ట్విస్ట్!
చండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ముచ్చటగా మూడోసారి విజయం సాధిస్తే తానే ముఖ్యమంత్రిని అవుతానని బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అనిల్ విజ్ అన్నారు. అయితే ఇప్పటికే హర్యానాలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రస్తుత సీఎం నయాబ్ సింగ్ సైనీని బీజేపీ ప్రకటించిన నేపథ్యంలో ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనిల్ విజ్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అంబాల కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్న అనిల్ విజ్ ఆదివారం మీడియాతో మాట్లాడారు.‘‘ నేను ఇప్పటి వరకు పార్టీ నుంచి ఏం ఆశించలేదు. కానీ ఈసారి మాత్రం నా సీనియార్టీని దృష్టిలో పెట్టుకొని నేను హర్యానాకు సీఎం కావాలనుకుంటున్నా. రాష్ట్రంలోని నలుమూలల నుంచి నన్ను కలవడానికి వస్తున్నారు. అంబాల ప్రజలు కూడా నేను చాలా సీనియర్ నేతను అని.. నేను ఎందుకు ముఖ్యమంత్రి కావొద్దని అడుగుతున్నారు. ప్రజల డిమాండ్, నా సీనియార్టి ఆధారంగా ఈసారి కచ్చితంగా నేను హర్యానా ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నా. నాకు పార్టీ అధిష్టానం ఈసారి సీఎంగా అవకాశం కల్పిస్తే.. హర్యానా ముఖచిత్రాన్ని మార్చివేస్తాను’’ అన్నారు. హర్యానాలో అక్టోబర్ 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 8న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఇక.. సీఎం నయాబ్ సింగ్ సైనీ నేతృత్వంలో హర్యానాలో బీజేపీ మూడోసారి గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఫోకస్ పెట్టింది.#WATCH | BJP candidate from Ambala Cantt Assembly constituency Anil Vij says, "I am the senior most MLA of BJP in Haryana. I have contested elections for 6 times. On the demand of people, I will claim for the designation of CM on the basis of my seniority this time. However, it… pic.twitter.com/jdwQt9nKSS— ANI (@ANI) September 15, 2024చదవండి: తమిళ ప్రజలకు రాముడు తెలియకుండా చేశారు: గవర్నర్ రవి -
ఖట్టర్ రాజీనామా
చండీగఢ్: హరియాణాలో రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి బీజేపీ సీనియర్ నేత మనోహర్‌లాల్ ఖట్టర్ రాజీనామా చేయడం మొదలు ఓబీసీ నేత నాయబ్ సైనీ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడందాకా మంగళవారం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. సంకీర్ణ ప్రభుత్వంలో దుష్యంత్ చౌతాలా సారథ్యంలోని జననాయక్ జనతా పార్టీ(జేజేపీ)తో విభేదాలు ముదరడంతో ఖట్టర్ సీఎం పదవిని వదులుకోవాల్సి వచ్చిందని వార్తలొచ్చాయి. అయితే ఖట్టర్‌ను లోక్‌సభ ఎన్నికల్లో బరిలో నిలిపేందుకే బీజేపీ ఆయనను సీఎం పీఠం నుంచి దింపేసిందని మరో వాదన వినిపించింది. హరియాణాలో లోక్‌సభ సీట్ల సర్దుబాటు విషయంలో జేజేపీతో బీజేపీకి ఏకాభిప్రాయం కుదరకపోవడంతో తెగదెంపులు చేసుకోవాల్సి వచ్చిందని సమాచారం. దీంతో చివరకు సీఎం ఖట్టర్, 13 మంది మంత్రులు రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయను కలిసి తమ రాజీనామా లేఖలను సమర్పించారు. రాజీనామాలను గవర్నర్ ఆమోదించారు. ఆ తర్వాత బీజేపీ ఎమ్మెల్యేలు హరియాణా నివాస్‌లో కలిసి 54 ఏళ్ల సైనీని తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలంటూ సైనీ గవర్నర్‌ను కలిసి కోరారు. ఇందుకు గవర్నర్ ఒప్పుకోవడంతో హరియాణా ముఖ్యమంత్రిగా నాయబ్ మంత్రులుగా మరో ఐదుగురు ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం చకచకా జరిగిపోయాయి. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఖట్టర్ హాజరయ్యారు. జేజేపీతో పొసగని పొత్తు సార్వత్రిక ఎన్నికల వేళ రాష్ట్రంలో బీజేపీ–జేజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి నూకలు చెల్లిపోయాయి. హరియాణాలోని మొత్తం 10 లోక్‌సభ స్థానాల్లోనూ పోటీచేస్తామని జేజేపీ పార్టీ పట్టుబట్టడంతో పార్టీతో పొత్తుకు బీజేపీ ఫుల్స్టాప్ పెట్టిందని తెలుస్తోంది. ఖట్టర్ రాజీనామా తర్వాత డెప్యూటీ సీఎం పదవి నుంచి జేజేపీ నేత దుష్యంత్ తప్పుకోవాల్సి వచ్చింది. గత లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 10 ఎంపీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఈసారీ గెలుపు ఖాయమని భావిస్తోంది. అందుకే గెలవబోయే స్థానంలో ఖట్టర్‌ను నిలపాలని బీజేపీ భావిస్తోంది. కులగణన డిమాండ్‌ను కాంగ్రెస్ తెరమీదకు తెచ్చిన నేపథ్యంలో జనాభాలో 30 శాతమున్న ఓబీసీ వర్గానికి చెందిన సైనీని సీఎంగా చేసింది. 2014లో తొలిసారి ఎంపీ అయిన ఖట్టర్‌ను సీఎంగా ఎంచుకున్నట్లే తొలిసారి ఎంపీ అయిన నాయబ్నూ సీఎంగా కమలదళం ఎన్నుకుంది. ప్రస్తుత హరియాణా శాసనసభ కాలపరిమితి అక్టోబర్‌తో ముగియనుంది. ఈలోపు ఓబీసీ నేతతో సీఎం పదవిని భర్తీచేసి ఓబీసీలను తమవైపు తిప్పుకోవాలని పార్టీ భావిస్తోంది. బలపరీక్షకు అవకాశమివ్వండి తమ ప్రభుత్వానికి 48 మంది ఎమ్మెల్యేల మద్దతుందని, బలనిరూపణకు బుధవారం అసెంబ్లీ ప్రత్యేక సెషన్ నిర్వహణకు అనుమతి ఇవ్వాలంటూ నూతన సీఎం సైనా గవర్నర్‌కు లేఖ రాశారు. 90 మంది సభ్యులున్న అసెంబ్లీలో 41 మంది బీజేపీ సభ్యులున్నారు. తమకు ఆరుగురు స్వతంత్య్ర ఎమ్మెల్యేలు, ఒక హరియాణా లోఖిత్ పార్టీ ఎమ్మెల్యే మద్దతు ఉందని బీజేపీ చెబుతోంది. జేజేపీకి 10 మంది, కాంగ్రెస్‌కు 30 మంది, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్‌కు ఒక ఎమ్మెల్యే ఉన్నారు. -
పవన్ సీఎం రేసులో లేనట్టే!
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీతో పొత్తుతో తాను సీఎం రేసులో లేనన్న విధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ శ్రేణులకు సంకేతాలు ఇచ్చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర పరాజయం అనంతరం బుధవారం హైదరాబాద్‌లో చంద్రబాబు, పవన్ భేటీ జరిగింది. ఆ భేటీలో ఏమి చర్చించారో ఎవరికీ తెలియదు. అయితే, ఆ మరుసటి రోజే (గురువారం) ముఖ్యమంత్రి పదవిని తాను కోరుకోవడంలేదని పవన్ విశాఖపట్నంలో జరిగిన సభలో పార్టీ శ్రేణులందరికీ స్పష్టమైన సంకేతాలిచ్చారు. రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు తప్పదని ఆ సభలో స్పష్టం చేశారు. జనసేన పోటీ చేసే అన్ని స్థానాల్లో గెలవడంతో పాటు మిగిలిన అన్ని స్థానాల్లో టీడీపీని కూడా గెలిపించాలని చెప్పారు. సీఎం పదవిపై తాను, బాబు మాట్లాడుకుంటామని అన్నారు. అవసరమైతే తనను తాను తగ్గించకుంటానని కూడా చెప్పారు. పవన్ వ్యాఖ్యలతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు కంగుతిన్నారు. తనను తాను తగ్గించుకుంటానంటే సీఎం రేసు నుంచి తప్పుకొన్నట్లేనని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు భావిస్తున్నారు. అదీ కాక.. పొత్తులో జనసేన పోటీ చేసిన స్థానాల్లో గెలవడం పక్కనపెడితే.. మిగిలిన స్థానాల్లో టీడీపీని జనసేనే గెలిపించడమేమిటని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు పొత్తుల చరిత్ర పరిశీలిస్తే.. మిత్రపక్షాలనే మోసం చేస్తారన్నది సుస్పష్టమని జనసేన నేతలు చెబుతున్నారు. పొత్తు పెట్టుకున్న పార్టీలకు చంద్రబాబు ఇచ్చేదే అరకొర సీట్లేనని, అక్కడా తన మనుషులను పోటీకి దింపి, పొత్తులో ఉన్న పార్టీనే దెబ్బేసే ఘనుడని, అలాంటి బాబు జనసేనకు ఇచ్చే సీట్లెన్ని, అందులో గెలిచేవెన్ని అని చర్చోపచర్చలు చేస్తున్నారు. ఎక్కువ సీట్లు తీసుకొనే టీడీపీని జనసేన కష్టపడి గెలిపిస్తే.. అప్పుడు మెజార్టీ స్థానాలు గెలిచిన ఆ పార్టీ జనసేనకు ఎందుకు ప్రభుత్వంలో ప్రాతినిధ్యం కల్పిస్తుందని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు చరిత్ర తెలిసిన వారెవరూ ఇలాంటి భ్రమలు పెట్టుకోరని స్పష్టంగా చెప్పేస్తున్నారు. ఈ విషయాలన్నీ తెలిసి కూడా పవన్ ఇలా మాట్లాడారంటే.. ఆయన సీఎం పదవిపై ఆశ వదులుకున్నట్లేనని భావిస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన భేటీలో జనసేనకు చాలా తక్కువ సీట్లిస్తామని చంద్రబాబు చెప్పి ఉంటారని, ముఖ్యమంత్రి పదవిపై సైతం ఎటువంటి పంపకాలకు అవకాశమే లేదని తేల్చి చెప్పి ఉంటారని, అందువల్లే పవన్ విశాఖలో అటువంటి వ్యాఖ్యలు చేశారని జనసేన నాయకులు అంటున్నారు. తొలి నుంచి పవన్ నోట భిన్నమైన మాటలే.. జనసేన పార్టీ ఏర్పాటు నుంచీ సొంత పార్టీ ప్రయోజనాలకన్నా, చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలకే పవన్ పెద్ద పీట వేస్తున్నారని బలమైన ప్రచారం ఉంది. అదే నిజమని నిరూపించేలా పవన్ పలు మార్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై రకరకాలుగా మాట్లాడుతున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన – టీడీపీతో పొత్తుపై చర్చ మొదలైనప్పుడు, పవన్‌కు కూడా సీఎం పదవిని కేటాయించాలని టీడీపీని కోరాలని పార్టీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. దీనిపై పవన్ స్పందిస్తూ.. తాను సీఎం పదవిని చేపట్టడానికి సిద్ధమంటూ కొన్ని సందర్భాల్లో, 2019లో రెండు చోట్లా ఓడిపోయాక ఇప్పుడు టీడీపీని సీఎం పదవి ఎలా అడుగుదామంటూ పార్టీ నాయకులందరినీ గందరగోళపరుస్తూ మరోసారి మాట్లాడారు. ఆ తర్వాత రెండ్రోజులకే మళ్లీ సీఎం పదవిని చేపట్టడానికి సిద్ధమని అన్నారు. టీడీపీ కోరకముందే పొత్తుకు పవన్ సిద్ధపడటం, జనసేనకు కేటాయించే సీట్లు ప్రాధాన్యతే కాదన్నట్టు మాట్లాడుతున్న తమ అధినేత అజెండా ఏమిటో స్పష్టంగా తెలిసిపోతోందని జనసేన నేతల్లో చర్చ సాగుతోంది. -
సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు
భోపాల్: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తానెప్పుడూ సీఎం రేసులో లేనని స్పష్టం చేశారు. పార్టీ ఆదేశాలు మాత్రమే పాటిస్తానని వెల్లడించారు. తానొక పార్టీ కార్యకర్తను మాత్రమేనని పేర్కొన్నారు. అధిష్టానం ఏ పదవి ఇచ్చినా దాన్ని విధిగా నిర్వహిస్తానని తెలిపారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 230 స్థానాలకు గాను 163 సీట్లను కైవసం చేసుకుని అధికారాన్ని ఏర్పరచడానికి సిద్ధంగా ఉంది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కేవలం 66 స్థానాలకే పరిమితమైంది. 2018లో కాంగ్రెస్ పార్టీ 114 సీట్లను సాధించగా.. ఈ సారి ఎన్నికల్లో ఆ సంఖ్య మరింత తగ్గింది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ విజయం సాధించిన తర్వాత సీఎం అభ్యర్థి అనే అంశంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల ప్రచారంలోనూ బీజేపీ సీఎం అభ్యర్థిని ప్రకటించకుండా సమష్టిగా ముందుకెళ్లింది. ప్రధాని నరేంద్ర మోదీని ప్రధాన ముఖచిత్రంగా చూపిస్తూ ప్రజల వద్దకు వెళ్లింది. ఈ సారి ఎన్నికల్లో పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు. సీఎం రేసులో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్, జ్యోతిరాదిత్య సింధియా, బీజేపీ జాతీయ కార్యదర్శి కైలాష్ విజయ వర్గీయ, కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం శివరాజ్ సింగ్‌కు కాకుండా వేరే వ్యక్తిగా సీఎం పదవి ఇస్తారని పుకార్లు పుట్టాయి. అటు.. శివరాజ్ సింగ్నే సీఎం గా ఉండాలని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. సీఎం పదవిపై తాజాగా శివరాజ్ సింగ్ స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదీ చదవండి: ఎమ్మెల్యేలకు సొంతూళ్లలో కనీసం 50 ఓట్లు కూడా రాలేదు: కమల్ నాథ్ -
కాంగ్రెస్ వస్తే.. ఆరు నెలలకో సీఎం
సాక్షి, హైదరాబాద్: ‘కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవి కోసం మాజీ మంత్రి జానారెడ్డి సహా 11 మంది అభ్యర్థులు రెడీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కొత్త సీసాలో పాత సారా లాంటిది. సీల్డ్ కవర్ సీఎంలు, అంతర్గత కుమ్ములాటలు నిత్యకృత్యం. కాంగ్రెస్ ఇస్తున్న గ్యారంటీల సంగతేంటోగానీ ఆరు నెలలకో సీఎం మాత్రం గ్యారంటీ’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారమిక్కడ జరిగిన తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. సుస్థిర ప్రభుత్వం, దృఢమైన నాయకత్వం ఉంటేనే తెలంగాణ అభివృద్ధి నిరంతరంగా సాగుతుందన్నారు. ‘ఎవరు అవునన్నా, కాదన్నా తొమ్మిదిన్నరేళ్లలో మాకు నికరంగా దొరికిన ఆరున్నరేళ్లలో అసాధారణ విజయాలు సాధించాం. తెలంగాణ భూతల స్వర్గమైందని చెప్పడం లేదు. సమస్యలు నిరంతరం ఉంటూనే ఉంటాయి. వాటిని పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత. కేసీఆర్ ప్రజల మనిష్, ఆయన నాయకత్వంలోనే తెలంగాణ నేడు దేశానికి దిక్సూచీగా మారింది. మా పార్టీ ఎమ్మెల్యేలపై అక్కడక్కడా అసంతృప్తి ఉన్నా బీఆర్ఎస్కే ఓటర్లు మద్దతు పలుకుతారు. మేము దైవాంశ సంభూతులం కాదు. అందరినీ సంతృప్తపరచడం సాధ్యం కాదు. ఏ రకమైన ప్రభుత్వం కావాలో మీరే ఎంచుకోండి’అని కేటీఆర్ పేర్కొన్నారు. మరింత వేగంగా అభివృద్ధి చేస్తాం ‘హైదరాబాద్‌లో అభివృద్ధి ఇప్పటి దాకా చేసింది ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది. వచ్చే ప్రభుత్వంలో మరింత వేగంగా హైదరాబాద్ అభివృద్ధి చేసి చూపిస్తాం. 332 కి.మీ. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మించడంతోపాటు ఔటర్ రింగ్‌రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు నడుమ కొత్త హైదరాబాద్‌ను నిర్మిస్తాం. గత రెండున్నర దశాబ్దాల్లో అభివృద్ధి కోణంలో తెలంగాణపై ప్రభావం చూపిన వారు వైఎస్, చంద్రబాబు, కేసీఆర్ మాత్రమే’అని కేటీఆర్ అన్నారు. కర్ణాటక పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు ఉంది. అక్కడి కొత్త ప్రభుత్వం బిల్డర్లపై విధించిన స్పెషల్ ట్యాక్స్ 40 నుంచి 400 శాతానికి పెరిగింది. ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తేనే తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధి కళ్లకు కనబడుతుంది’అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ప్రభాకర్‌రావు, రాఘవరావు, పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం కేటీఆర్ దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ (డిక్కీ) ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. -
Siddaramaiah vs DK Shivakumar: కర్ణాటకలో కుర్చీలాట!
సాక్షి, బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ పార్టిలో వర్గపోరు పెరుగుతోంది. ఎవరికి వారు వర్గాలుగా మారి సీఎం కురీ్చపై టార్గెట్ పెట్టారు. ఇందులో ముఖ్యంగా సిద్ధరామయ్య వర్గం, డీకే శివకుమార్ వర్గం పేర్లు కీలకంగా వినిపిస్తున్నాయి. ఈ సమయంలో గురువారం హోసపేట నగరంలో సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ రానున్న ఐదేళ్ల పాటు తానే సీఎంగా కొనసాగుతానని వ్యాఖ్యలు చేయడంతో డీకే శివకుమార్ వర్గం నోటిలో పచ్చి వెలక్కాయ పడ్డట్లయ్యింది. రెండున్నరేళ్ల తర్వాత అధికార మార్పిడితో తాను సీఎం అవుతానని ఆశలు పెట్టుకున్న డీకే శివకుమార్‌కు ఈ వ్యాఖ్యలు మింగుడు పడడం లేదు. ముఖ్యమంత్రిగా ఆరు నెలలు పూర్తి చేసుకున్న సిద్ధరామయ్య రానున్న ఐదేళ్లపాటు తానే సీఎంగా కొనసాగుతానని నర్మగర్భంగా వ్యాఖ్యలు చేయడంపై రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. సీఎం వ్యాఖ్యలపై అనుకూల, ప్రతికూల వ్యాఖ్యానాలను రాజకీయ విశ్లేషకులు చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టిలో ఈ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెండున్నరేళ్ల తర్వాత తానే సీఎం అనే ఆశలతో ఉన్న ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాత్రం తాను కేవలం హైకమాండ్ మాట మాత్రమే వింటానని, ఎవరేమి చెప్పినా పట్టించుకోనని తెలిపారు. ఇదే సమయంలో కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా అధిష్టాన నిర్ణయమే శిరోధార్యమని బాహాటంగా వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ లోలోపల ఎవరి వర్గానికి వారు మద్దతు ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ విషయంపై మంత్రి ప్రియాంక్ ఖర్గే శుక్రవారం మైసూరులో విలేకరులతో మాట్లాడుతూ సీఎం వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, ఎవరిని కొనసాగించాలి, ఎవరికి అడ్డుకట్ట వేయాలనే విషయం తమ అధిష్టానం చూసుకుంటుందని తెలిపారు. మరో మంత్రి కేఎన్ రాజణ్ణ శుక్రవారం తుమకూరులో మాట్లాడుతూ మాజీ డీప్యూటీ సీఎం, హోం మంత్రి పరమేశ్వరకు కూడా సీఎం అయ్యే అర్హత ఉందని పేర్కొన్నారు. తుమకూరులో హోం మంత్రి పరమేశ్వర మాట్లాడుతూ సీఎం వ్యాఖ్యలపై తాను స్పందించబోనని చెప్పారు. అధికార పంపిణీ కేవలం సీఎం, డీసీఎం మధ్యజరిగిన చర్చ అని, అసలు ఢిల్లీలో ఎలాంటి ఒప్పందం జరిగిందనే విషయంపై వారిద్దరికే స్పష్టమైన అవగాహన ఉందని, అలాంటప్పుడు ఇది సత్యం, ఇది అబద్ధమని తానే వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. అయితే రామనగర ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ మాత్రం డీసీఎం డీకే శివకుమార్‌కు మద్దతు పలికారు. పోస్టు ఖాళీగా లేదు కదా! ఖాళీగా లేని ముఖ్యమంత్రి పదవిపై అవసరంగా చర్చ సాగుతోందని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు, ఎంపీ డీకే సురేశ్ అన్నారు. ఇలాంటి చర్చకు అర్ధం లేదని వ్యాఖ్యానించారు. ‘ప్రస్తుతం సిద్ధరామయ్య సీఎంగా ఉన్నారు. సీఎం పోస్టు ఖాళీగా లేదు. ఆ పదవి ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే దీనిపై చర్చించాలి. ఇప్పుడు మాట్లాడుకోవడం వల్ల లాభం ఏమిటి?’ అని వ్యాఖ్యానించారు. -
ప్రజల ఆ ఒక్క కోరికా తీరుతుందేమో!
గుర్రంపోడు (నాగార్జునసాగర్): ‘నేను ఏ హోదాలో ఉన్నా ముఖ్యమంత్రిగా ఉన్నట్లుగానే లెక్క.. 55 ఏళ్ల రాజకీయ అనుభవమున్న నన్ను తెలుగు రాష్ట్రాల్లో అందరూ గౌరవిస్తున్నారు, ముఖ్యమంత్రిగా చూడాలనే ఆకాంక్ష ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. నేను ఆశించకుండానే అనేక పదవులు వచ్చాయి. ఏ ముఖ్యమంత్రీ చేయని పలు శాఖలకు మంత్రిగా పనిచేశా.. ప్రజల ఆ చివరి కోరిక కూడా నాకు తెలియకుండానే తీరవచ్చు’అని మాజీమంత్రి కుందూరు జానారెడ్డి వ్యాఖ్యానించారు. ‘పదవుల రేసులో నేను ఎప్పుడూ లేను, పదవే రేసులో ఉండి నన్ను వరిస్తుంది’అని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేయకుండానే పీవీ నర్సింహారావు ప్రధానమంత్రి కాలేదా.. ముఖ్యమంత్రి అయినంక, ఆరు నెలల తర్వాత నా కొడుకు రాజీనామా చేస్తాడు.. నేను ఎమ్మెల్యే అవుతా’అంటూ వ్యాఖ్యానించారు. మంగళవారం నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలో జెడ్పీటీసీ సభ్యురాలు గాలి సరితా రవికుమార్, పదిమంది సర్పంచ్‌లు, ఒక ఎంపీటీసీ, పలువురు నాయకులు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జానారెడ్డి మాట్లాడారు. మరోమారు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మాయమాటలకు ప్రజలు మోసపోవద్దని కోరారు. సమావేశంలో నాగార్జున సాగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు జయవీర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గుర్రంపోడు మండల అధ్యక్షుడు తగుళ్ల సర్వయ్య తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ జగనే సీఎం..నాకు అనుభవం లేదు బాబుకు అంత సీన్ లేదు
-
‘చేతి’కి అధికారం ఇచ్చాక? సీఎం సీటు షేరింగ్.. ఓ ఫ్లాప్ ఫార్ములా..!
కర్ణాటకలో అధికార పీఠం కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ హస్తిన వేదికగా హోరాహోరీ తలపడుతున్నారు. మధ్యేమార్గంగా చెరో రెండున్నరేళ్లు పదవిని పంచుకోవాలని అధిష్టానం ప్రతిపాదించినా సిద్ధరామయ్యకు తొలి చాన్సిచ్చేందుకు డీకే ససేమిరా అంటున్నారు. ‘‘అన్నదమ్ముల్లా సమానంగా పంచుకోవడానికి అదేమీ వారసత్వపు ఆస్తి కాదు! సీఎం పదవి. ప్రభుత్వ ఏర్పాటుతో ముడిపడ్డ అంశం. పంచుకునే సమస్యే లేదు’’ అని ఆయన కరాఖండిగా చెబుతున్నారు. డీకే అభ్యంతరాల వెనక సహేతుకమైన కారణాలు లేకపోలేదు. కర్ణాటకతో సహా పలు రాష్ట్రాల్లో ఇలాంటి ప్రయోగాలు పెద్దగా ఫలించిన దాఖలాలు లేవు! ఛత్తీస్‌లో ‘చెయ్యి’చ్చిన భగెల్ ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలోనే ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో పార్టీలోనే ముఖ్య నేతల మధ్య పవర్ షేరింగ్ ఫార్ములా బెడిసికొట్టింది. అక్కడ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ సాధించింది. భూపేశ్ భగెల్ (62), త్రిభువనేశ్వర్ శరణ్ సింగ్‌దేవ్ (70) సీఎం పదవి కోసం పట్టుబట్టారు. దాంతో అధిష్టానం ఇప్పుడు సిద్ధూ–డీకే ద్వయానికి ప్రతిపాదించిన ఫార్ములానే అమలు చేసింది. చెరో రెండున్నరేళ్లు సీఎంగా ఉండేలా రాజీ ఫార్ములా కుదిర్చింది. సింగ్‌దేవ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలతో సరిపెట్టుకోగా తొలుత భగెల్ గద్దెనెక్కారు. తీరా 2021 జూలైలో రెండున్నరేళ్లూ ముగిశాక తప్పుకుని సింగ్‌దేవ్‌కు చాన్సిచ్చేందుకు ససేమిరా అన్నారు. ఇప్పటికీ సీఎంగా కొనసాగుతున్నారు. అగ్ర నేత రాహుల్‌గాంధీ రాష్ట్రాన్ని సందర్శించి అభివృద్ధి పనులన్నీ కళ్లారా చూశాక తనను ఉంచాలో, దించాలో డిసైడ్ చేస్తారని చెబుతూ రెండేళ్లుగా కాలం వెళ్లదీస్తున్నారు. అధిష్టానం జోక్యం కోసం ఎదురు చూసి చిర్రెత్తుకొచ్చిన సింగ్‌దేవ్ ఇటీవలే మంత్రి పదవులకు రాజీనామా చేసినా లాభం లేకపోయింది. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో భగెల్ను మార్చే ఉద్దేశం కూడా హస్తిన పెద్దలకు లేనట్టే కని్పస్తోంది! కర్ణాటకలోనే ఫెయిలైంది’... కర్ణాటకలోనే దాదాపు 20 ఏళ్ల క్రితం బీజేపీ, జేడీ(ఎస్) మధ్య సీఎం పదవి పంపకం కథ ఇలాగే అడ్డం తిరిగింది. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ మెజారిటీ రాలేదు. బీజేపీకి 79, కాంగ్రెస్‌కు 65, జేడీ(ఎస్)కు 58 సీట్లొచ్చాయి. కాంగ్రెస్, జేడీ(ఎస్) సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. కానీ రెండేళ్లకే కాంగ్రెస్‌కు జేడీ(ఎస్) చెయ్యిచ్చింది. సంకీర్ణాన్ని కూలదోసి 2006 ఫిబ్రవరిలో బీజేపీతో జట్టు కట్టింది. చెరో 20 నెలలు సీఎం పదవిని పంచుకునేలా ఒప్పందం కుదిరింది. తొలి చాన్సు దక్కించుకున్న జేడీ(ఎస్) నేత కుమారస్వామి ఒప్పందం మేరకు 2007 అక్టోబర్‌లో గద్దె దిగేందుకు ససేమిరా అన్నారు. 4,5రోజుల హైడ్రామా తర్వాత ఆయన రాజీనామాతో రాష్ట్రం రాష్ట్రపతి పాలనలోకి వెళ్లింది. నెల తర్వా త జేడీ(ఎస్) బెట్టు సడలించడంతో బీజేపీ నేత యడియూరప్ప యడియూరప్ప సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. కానీ శాఖల పంపిణీలో విభేదాలు రావడంతో యడ్డీ సర్కారుకు మద్దతివ్వను పొమ్మన్నారు కుమారస్వామి! అలా బీజేపీ–జేడీ(ఎస్) సంకీర్ణం కథ పూర్తిగా పట్టాలెక్కకుండానే కంచికి చేరింది! యూపీలోనూ అంతే 1996లో ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్, బీఎస్పీ ముందస్తు పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాయి. ఏ పార్టీకీ మెజారిటీ రాలేదు. మొత్తం 424 స్థానాలకు గాను 174 సీట్లతో బీజేపీ అతి పెద్ద పార్టీగా నిలవగా సమాజ్‌వాదీకి 110, బీఎస్పీకి 67, కాంగ్రెస్‌కు 33 స్థానాలు దక్కాయి. కొద్ది నెలల రాష్ట్రపతి పాలన అనంతరం కాంగ్రెస్‌కు బీఎస్పీ గుడ్‌బై చెప్పింది. ఆర్నెల్లకోసారి అధికారాన్ని మార్చుకునే ఒప్పందంతో బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 1997 మార్చిలో మాయావతి సీఎం అయ్యారు. సెప్టెంబర్‌లో ఆమె గద్దె దిగి బీజేపీ నేత కల్యాణ్‌సింగ్ సీఎం అయ్యారు. నెల రోజులకే బీఎస్పీ మద్దతు ఉపసంహరించడంతో సంకీర్ణం కథ ముగిసింది. అంతకుముందు 1995లోనూ బీజేపీ–బీఎస్పీ సంకీర్ణ సర్కారు ఐదు నెలలకే కుప్పకూలింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఢిల్లీకి చేరుకున్న డీకే శివకుమార్.. సీఎం పదవిపై కీలక వ్యాఖ్యలు..
న్యూఢిల్లీ: కర్ణాటక సీఎం పదవి ఎవరికి దక్కుతుందా అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ విషయంపైనే అధిష్టానంతో చర్చలు జరిపేందుకు పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఢిల్లీ చేరుకున్నారు. హైకమాండ్ పిలుపు మేరకు హస్తిన వెళ్లారు. సిద్ధరామయ్య, డీకేలు సీఎం పదవి చెరో రెండేళ్లు చేపట్టాలని కాంగ్రెస్ హైకమాండ్ ప్రతిపాదించిందని ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై స్పందిస్తూ డీకే కీలకవ్యాఖ్యలు చేశారు. ఇద్దరు పంచుకోవడానికి సీఎం పదవి ఏమీ వారసత్వ ఆస్తి కాదని పేర్కొన్నారు. అసలు ఇప్పటివరకు అలాంటి ప్రతిపాదనేమీ తమ ముందుకు రాలేదని చెప్పారు. అలాగే సిద్ధరామయ్యకు 80 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, దీంతో ఆయనకే అవకాశం లభిస్తుందని జరుగుతున్న ప్రచారంపైనా డీకే స్పందించారు. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 135 అని, దీన్ని ఎవరు విడగొట్టలేరని పేర్కొన్నారు. ఎమ్మెల్యేల మద్దతు గురించి అసలు అంత కచ్చితంగా సంఖ్య ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. ఈ సమయంలో డీకే పక్కనే ఉన్న మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే జోక్యం చేసుకుని ఎమ్మెల్యేల మద్దతుపై ఇంకా కౌంటింగ్ జరాగాల్సి ఉందని జోకులు పేల్చారు. మరోవైపు కర్ణాటక సీఎం ఎంపికపై చర్చించేందుకు ఢిల్లీలోని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ మంగళవారం ఉదయం బేటీ అయ్యారు. ఢిల్లీ చేరుకున్న డీకేతోనూ కాంగ్రెస్ అధిష్ఠానం చర్చలు జరపనుంది. ఇద్దరిని బుజ్జగించి సాయంత్రం వరకు సీఎం ఎవరనే విషయాన్ని తేల్చే అవకాశం ఉంది. కాగా.. అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానని డీకే అంతకుముందే స్పష్టం చేశారు. తాను ఎమ్మెల్యేలను విడగొట్టనని, వెన్నుపొటు పొడవనని స్పష్టం చేశారు. బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడబోనని తేల్చిచెప్పారు. చరిత్రలో తన గురించి తప్పుగా ఉండాలని కోరుకోవడం లేదని, చెడ్డపేరుతో వెళ్లాలనుకోట్లేదని చెప్పుకొచ్చారు. దీంతో హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా.. తిరుగుబాటు ఉండదనే సంకేతాలు ఇచ్చారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్‌కు 20 సీట్లు తేవడమే తమ ముందున్న తదుపరి సవాల్ అని డీకే తెలిపారు. చదవండి: నేను వెన్నుపోటు పొడవను.. డీకే శివకుమర్ కీలక వ్యాఖ్యలు.. -
సీఎం పదవికి బసవరాజు బొమ్మై రాజీనామా
కర్ణాటక ముఖ్యమంత్రిగా 19 నెలల 17 రోజులు పనిచేసిన 'బసవరాజు బొమ్మై' ఎట్టకేలకు రాజీనామా చేశారు. ఇందులో భాగంగానే తన రాజీనామా లేఖను గవర్నర్‌కు అందించారు. ఈ రోజు విడుదలైన ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ 136 సీట్లతో భారీ విజయాన్ని కైవసం చేసుకుంది. కేవలం 65 స్థానాలకు పరిమితమైన బీజేపీ ప్రస్తుతం కర్ణాటకలో అధికారం కోల్పోయింది. కన్నడ నాట ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ సీఎం రేసులో డీకే శివకుమార్, సిద్దరామయ్య ఉన్నారు. అయితే ఎవరు కర్ణాటక కొత్త ముఖ్యమత్రి అనేది అధిష్టానం నిర్ణయిస్తుంది. -
అధ్యక్ష పదవికోసం ఆశ పడితే అదే రాక ఉన్న సీఎం పదవి కూడా..
అధ్యక్ష పదవికోసం ఆశ పడితే అదే రాక ఉన్న సీఎం పదవి కూడా పోయెట్లుంది సార్! -
సీఎంగా నా వారసుడిని వారే నిర్ణయిస్తారు: గెహ్లాట్
కొచ్చి/జబల్పూర్: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని పార్టీ సీనియర్ నేత, రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. తన తర్వాత రాజస్తాన్ సీఎం ఎవరన్నది కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి అజయ్ మాకెన్ నిర్ణయిస్తారన్నారు. పార్టీలో ఇటీవల తెరపైకి వచ్చిన ‘ఒక వ్యక్తికి ఒకే పదవి’ అంశంపై చర్చ అనవసరమన్నారు. గెహ్లాట్ శుక్రవారం మహారాష్ట్రలోని షిర్డీలో మీడియాతో మాట్లాడారు. గాంధీ కుటుంబం నుంచి ఎవరూ పోటీలో ఉండరని రాహుల్ గాంధీ తనతో చెప్పారన్నారు. నామినేషన్ ఎప్పుడు దాఖలు చేయాలన్నది రాజస్తాన్ వెళ్లాక నిర్ణయించుకుంటానన్నారు. ఎన్నికలో పోటీ చేయడం అనేది ప్రజాస్వామ్యానికి సంబంధించిన అంశమని, నూతన ప్రారంభానికి శ్రీకారం చుడతామని వ్యాఖ్యానించారు. ఫలితాల తర్వాత కలిసి నడవాల్సిందే.. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కూడా అధ్యక్ష పోస్టుకి పోటీ పడుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా, గెహ్లాట్ స్పందించారు. ‘‘కాంగ్రెస్ మిత్రులు ఎవరైనా అధ్యక్ష పదవిని కోరుకోవచ్చు. అది పెద్ద విషయం కాదు. ఫలితాల తర్వాత అందరూ కలిసి నడవాల్సిందే. బ్లాక్, గ్రామం, జిల్లా స్థాయిల్లో పార్టీని పటిష్టం చేసుకోవడానికి ఐక్యమత్యంగా పనిచేయాలి. కాంగ్రెస్‌ను బలమైన ప్రతిపక్షంగా మార్చుకోవాలి’’ అని ఉద్ఘాటించారు. దేశంలో ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో బలమైన ప్రతిపక్షం తప్పనిసరిగా అవసరమని గెహ్లాట్ అన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడబోనని రాహుల్ గాంధీ ఇప్పటికే పలుమార్లు స్పష్టంగా చెప్పిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై తనకు ఆసక్తి లేదని పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ కూడా తాజాగా తెలిపారు. ఇదీ చదవండి: అతి త్వరలో సీఎంగా సచిన్ పైలట్.. హింట్ ఇచ్చిన మంత్రి -
Sakshi Cartoon: లేదంటే షిండేను మీరు డిప్యూటీ సీఎం చేసేవారేమో!
లేదంటే షిండేను మీరు డిప్యూటీ సీఎం చేశావారేమో! -
మాజీ సీఎం.. తాజాగా డిప్యూటీ సీఎం.. ఫడ్నవీస్ పేరిట ఓ రికార్డు
ముంబై: ముఖ్యమంత్రులుగా వ్యవహరించిన వారు అనంతర కాలంలో మంత్రి పదవులు చేపట్టడం రావడం అరుదనే చెప్పాలి. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా తాజాగా బాధ్యతలు చేపట్టిన దేవేంద్ర ఫడ్నవీస్ పేరిట ఇలాంటి రికార్డు నమోదైంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసి, అనంతరం అంతకంటే తక్కువ పదవులతోనే సరిపెట్టుకున్న నాలుగో మాజీ సీఎం అయ్యారు ఫడ్నవీస్. 2014–19 సంవత్సరాల్లో బీజేపీకి చెందిన ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎంగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం శివసేనతో విభేదాలు తలెత్తాయి. ఎన్సీపీ ఎమ్మెల్యేల అండతో సీఎం పదవిని చేపట్టినా పొత్తు పొసగక మూడు రోజుల్లోనే సీటు దిగిపోయారు. మహారాష్ట్ర సీఎంగా 1975లో కాంగ్రెస్ నేత శంకర్రావు చవాన్ బాధ్యతలు చేపట్టారు. రెండేళ్ల అనంతరం వసంతదా పాటిల్ సీఎం అయ్యారు. 1978లో శరద్ పవార్ ఆయన ప్రభుత్వాన్ని కూలదోసి సీఎం అయ్యారు. చదవండి👉🏻నాకు చేసినట్లు ముంబైకి ద్రోహం చేయకండి: షిండే ప్రభుత్వానికి ఉద్దవ్ వార్నింగ్ పవార్ కేబినెట్లో చవాన్ ఆర్థిక మంత్రిగా కొనసాగారు. 1985–86 సంవత్సరాల్లో శివాజీరావు పాటిల్ ముఖ్యమంత్రి అయ్యారు. అనంతరం, 2004లో సుశీల్ కుమార్ షిండే కేబినెట్లో ఆయన ఆర్థిక మంత్రి అయ్యారు. శివసేనకు చెందిన నారాయణ రాణే 1999లో మహారాష్ట్ర సీఎం అయి తక్కువ కాలంలోనే వైదొలిగారు. అనంతరం కాంగ్రెస్‌కు చెందిన విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ కేబినెట్లో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. చదవండి👉🏻కర్మ అనుభవించక తప్పదు.. ఉద్ధవ్ రాజీనామాపై రాజ్‌ఠాక్రే స్పందన -
సీఎంగా షిండే.. పక్కా ప్లాన్‌తోనే బీజేపీ అలా చేసిందా?
ముంబై: మహారాష్ట్ర సీఎం బాధ్యతలను ఏక్నాథ్ షిండేకు అప్పగిస్తూ బీజేపీ తీసుకున్న అనూహ్య నిర్ణయంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే, ఈ పరిణామం వెనుక అనేక కారణాలున్నాయి. బీజేపీ అన్ని కోణాల్లోనూ ఆలోచించాకే ఈ అడుగు వేసిందని పరిశీలకులు భావిస్తున్నారు. అందులో ముఖ్య కారణాలేవంటే.. ► 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన ఉమ్మడిగా పోటీ చేశాయి. ఫలితాలు వెలువడ్డాక సీఎం పదవి చేపట్టే విషయమై విభేదాలు తలెత్తి రెండు పార్టీలు విడిపోయాయి. ఎన్సీపీ నేత అజిత్ పవార్ మద్దతుతో అనూహ్యంగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణం చేశారు. ఈ హడావుడి పొత్తు ఎంతోకాలం కొనసాగలేదు. ఫడ్నవీస్ దిగిపోయారు. ఈ పరిణామం మాత్రం బీజేపీకి అధికార కాంక్ష ఎక్కువనే అభిప్రాయం కలిగించింది. అందుకే, తమకు అధికారం ముఖ్యం కాదనే అభిప్రాయం కలిగించడానికి తాజాగా ఏక్నాథ్ షిండేను సీఎంగా బలపరిచింది. చదవండి👉🏻ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ లేఖ.. ► సీఎం పదవికి రాజీనామా చేసిన ఉద్ధవ్ ఠాక్రే పదవి నుంచి దిగిపోతూ బీజేపీ తనను వెన్నుపోటు పొడిచిందనే భావం ప్రజల్లో కలిగించడానికి ప్రయత్నించారు. బాలా సాహెబ్ కొడుకుని మీరు(బీజేపీ) గద్దె దించారు’ అంటూ రాజీనామా సందర్భంగా పేర్కొన్నారు. ప్రజల్లో ఉద్వేగాలను రగిలించి, సానుభూతి పొందడంలో సఫలమయ్యారు. ► అదే సమయంలో బీజేపీ కూడా శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ వారసత్వానికే తాము మద్దతిస్తామనే ఇమేజ్ను ప్రజల్లో కలిగించాలని కోరుకుంది. బాలాసాహెబ్ ఆకాంక్షల మేరకు శివసైనికుడే సీఎం పదవిలో ఉంటారని చెప్పడంలో ఆంతర్యం కూడా ఇదే. ► మహారాష్ట్రలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలతో అసలైన శివసేన ఎవరిదనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మరికొంత కాలం ఈ ప్రశ్నకు సమాధానం దొరక్కపోవచ్చు. బాలాసాహెబ్ నిజమైన వారసత్వాన్ని ముందుకు తీసుకువెళతామని ఏక్నాథ్ షిండే అంటున్నారు. అసలైన శివసేన తమ వెంటే ఉందని చెబుతూ 2024 ఎన్నికలకు వెళ్తే సానుకూలత ఉంటుందని కూడా బీజేపీ భావిస్తోంది. ► ఏక్నాథ్ షిండేకు ప్రస్తుతం శివసేన ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది మద్దతిచ్చినా మున్ముందు రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకోవచ్చు. అయితే, ప్రభుత్వాన్ని వీరే నడుపుతూ ఉంటే శివసేనను వీడేందుకుసుముఖంగా ఉండకపోవచ్చు. రెబెల్స్ శిబిరాన్ని చెదరకుండా ఉంచేందుకే బీజేపీ సీఎం పదవిని వదులుకుందని భావిస్తున్నారు. చదవండి👉🏻నాకు చేసినట్లు ముంబైకి ద్రోహం చేయకండి: షిండే ప్రభుత్వానికి ఉద్దవ్ వార్నింగ్ -
Sakshi Cartoon: ఆయన ఎన్నికైన సీఎం కాదు, డబ్బిచ్చి సీఎం అయ్యారు-కాంగ్రెస్
ఆయన ఎన్నికైన సీఎం కాదు, డబ్బిచ్చి సీఎం అయ్యారు-కాంగ్రెస్ -
‘యెడ్డీ డైరీ’ కలకలం
సాక్షి బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప గతంలో సీఎం పదవి కోసం బీజేపీ అగ్రనాయకులకు ముడుపులు ఇచ్చారంటూ తాజాగా ఎన్నికల వేళ బయటపడిన డైరీ కాగితాలు పెను సంచలనం సృష్టిస్తున్నాయి. అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు మార్మోగుతున్నాయి. ఇదంతా కాంగ్రెస్ కుట్ర అని యడ్యూరప్ప ఆరోపిస్తుంటే, ఈ విషయంపై లోక్‌పాల్‌తో విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ‘ద క్యారవాన్’ అనే మేగజీన్ ఈ సంచలన విషయాలను ‘యెడ్డీ డైరీస్’ శీర్షికన కథనంగా ప్రచురించింది. డైరీ అంశంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ బీజేపీ నేతలంతా అవినీతిపరులేనని ఆరోపించారు. ‘బీజేపీలోని కాపలాదారులంతా దొంగలే’ అంటూ రాహులో ఓ ట్వీట్ చేశారు. ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా మాట్లాడుతూ డైరీ అంశంపై లోక్‌పాల్ చేత విచారణ జరగాలని డిమాండ్ చేశారు. యడ్యూరప్ప బీజేపీ పెద్దలకు లంచాలు ఇవ్వడం నిజమో, అబద్ధమో ప్రధాని చెప్పాలని కోరారు. 2017లో డైరీ దొరికితే ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. సరైన దర్యాప్తుæ జరగాలని కర్ణాటక సీఎం కుమారస్వామి అన్నారు. శివకుమార్ ఇంట్లో దొరికాయి 2017లో కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ ఇంట్లో సోదాల సందర్భంగా ఈ డైరీ కాగితాలు ఆదాయపు పన్ను (ఐటీ) విభాగానికి దొరికినట్లు క్యారవాన్ పేర్కొంది. 2009లో కర్ణాటక సీఎం అయ్యేందుకు యడ్యూరప్ప బీజేపీ అగ్రనేతల్లో ఎవరెవరికి లంచాలు ఇచ్చారో, అందుకోసం ఏయే ఎమ్మెల్యే దగ్గర ఆయనెంత తీసుకున్నారో ప్రస్తావిస్తూ యడ్యూరప్ప తన డైరీలో రాసుకున్నట్లుగా ఉందని కథనంలో క్యారవాన్ పేర్కొంది. కర్ణాటక బీజేపీ ఎంపీ శోభా కరంద్లాజేను తాను కేరళలోని ఓ గుడిలో వివాహం చేసుకున్నట్లుగా కూడా ఆ డైరీలో యడ్యూరప్ప రాసినట్లు ఉందంది. నకిలీవి అయ్యుండొచ్చు: ఐటీ విభాగం ఈ కాగితాలపై ఐటీ విభాగం శుక్రవారం స్పందించింది. శివకుమార్ ఇంట్లో తమకు దొరికింది డైరీలోని కొన్ని పేపర్ల జిరాక్స్‌లు మాత్రమేనని స్పష్టం చేసింది. ఆ జిరాక్స్‌లు ఎక్కడి నుంచి వచ్చాయో, వాటి ఒరిజినల్ కాగితాలు ఎక్కడ ఉన్నాయో తెలియదనీ, జిరాక్స్ కాగితాలను ఫోరెన్సిక్ పరీక్షల కోసం హైదరాబాద్‌కు అప్పట్లోనే పంపినా ఒరిజినల్స్ లేనిదే జిరాక్స్‌లతో తామేమీ చెప్పలేమని ఫోరెన్సిక్ విభాగం చెప్పిందని ఐటీ విభాగం ఓ ప్రకటనలో వెల్లడించింది. తాము అప్పుడే యడ్యూరప్పను కూడా పిలిచి విచారించామనీ, ఆ డైరీ తాను రాసింది కాదనీ, అసలు తనకు డైరీ రాసే అలవాటే లేదని ఆయన చెప్పారంది. ఒరిజినల్ కాగితాలు ఎక్కడా లభించనందున ఆ జిరాక్స్‌లు నకిలీవి అయ్యుండొచ్చంది. ఆ డైరీ నిజం కాదు: యడ్యూరప్ప డైరీలో తాను రాసినట్లుగా చెబుతున్న విషయాలన్నీ అవాస్తవాలేనని యడ్యూరప్ప కొట్టిపారేశారు. బెంగళూరు డాలర్స్ కాలనీలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలవి దివాలాకోరు రాజకీయాలని మండిపడ్డారు. అసత్య ఆరోపణలు చేసి లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ నేతలు ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారని ఆక్షేపించారు. ఆ డైరీలోని అంశాలు ఫోర్జరీ చేసినవీ, నకిలీవని ఐటీ అధికారులు నిర్ధారించినట్లు యడ్యూరప్ప చెప్పారు. కాంగ్రెస్ ఆరోపణలకు బీజేపీ ఎదురుదాడి చేసింది. ఆ డైరీ నకిలీదని, డైరీ పేరిట కాంగ్రెస్ చేస్తున్నదంతా నాటకమని, అదంతా ఒక పథకం ప్రకారం సాగుతున్నదని ఆరోపించింది. డైరీలోని చేతిరాత, నకిలీ అని, అది యడ్యూరప్ప సంతకమే కాదని బీజేపీ స్పష్టం చేసింది. ఎవరెవరికి ఎంతెంత? క్యారవాన్ కథనం ప్రకారం ముఖ్యమంత్రి పదవి కోసం బీజేపీ కేంద్ర కమిటీకి రూ. 1000 కోట్లు, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, రవాణా మంత్రి నితిన్ గడ్కరీలకు చెరో రూ. 150 కోట్లు, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు రూ. 100 కోట్లు, బీజేపీ సీనియర్ నేతలు ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషీలకు చెరో రూ. 50 కోట్లు లంచంగా ఇచ్చినట్లు యడ్యూరప్ప డైరీలో రాసుకున్నారు. పలువురు జడ్జీలకు రూ. 250 కోట్లు, న్యాయవాదులకు రూ. 50 కోట్లు ఇచ్చినట్లు రాసుకొచ్చారు. న్యాయమూర్తులు, న్యాయవాదుల పేర్లను డైరీలో పేర్కొనలేదు. అలాగే గడ్కరీ కొడుకు వివాహ వేడుకలకు రూ. 10 కోట్లు ఖర్చు చేశానని డైరీలో యడ్యూరప్ప రాశారు. తాను ముఖ్యమంత్రి అవ్వడంలో రాష్ట్ర మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ప్రముఖ పాత్ర పోషించారని డైరీలో యడ్యూరప్ప రాశారు. ఆయన ఆర్థికంగా ఆదుకున్నారని పేర్కొన్నారు. ఆయనతో పాటు మరో ఎనిమిది మంది ఆర్థిక సాయం చేశారని వారి పేర్లను వివరాలతో సహా రాసుకొచ్చారు. బీజేపీ ఎమ్మెల్యేలు నరేంద్ర స్వామి రూ. 20 కోట్లు, గోళిహట్టి శేఖర్ రూ. 10 కోట్లు, బాలచంద్ర జారకిహోళి రూ. 20 కోట్లు, డి.సుధాకర్ రూ. 20 కోట్లు, శివనగౌడ నాయక్ రూ. 20 కోట్లు, వెంకటరమణప్ప రూ. 20 కోట్లు, నారాయణ స్వామి రూ. 20 కోట్లు, ఆనంద్ అస్నోటికర్ రూ. 20 కోట్లు ఆర్థిక సాయం చేసినట్లు డైరీలో రాసి ఉంది. అయితే వీరంతా తాము ఎలాంటి సాయం చేయలేదని ఒక్కొక్కరిగా చెప్పుకుంటూ వస్తున్నారు. -
చెరో రెండున్నరేళ్లు సీఎం పదవి
ముంబై: మహారాష్ట్ర సీఎం పదవిని రెండున్నరేళ్ల పాటు పంచుకుందామనే ఒప్పందంతోనే బీజేపీ, శివసేన మధ్య పొత్తు జరిగిందని శివసేన మంత్రి రామ్‌దాస్ కదం వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందానికి కట్టుబడకూడదని భావిస్తే ఎన్నికలకు ముందుగానే బీజేపీ తన పొత్తును రద్దుచేసుకోవచ్చని బుధవారం స్పష్టం చేశారు. బీజేపీ, శివసేన మధ్య రెండు ప్రధాన అంశాల గురించి ఒప్పందం కుదిరిందని చెప్పారు. ముఖ్యమంత్రి పదవిని చెరి సగం కాలం పాటు పంచుకోవటం ఒకటి కాగా.. కొంకణ్ ప్రాంతంలోని నానార్ రిఫైనరీ ప్రాజెక్టును రద్దు చేయడం రెండోదని వెల్లడించారు. కాగా, ఒప్పందం జరిగిన తర్వాత బీజేపీ రాష్ట్ర మంత్రి చంద్రకాంత్ పటేల్ పొత్తును ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీ సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై రామ్‌దాస్ పరోక్షంగా మండిపడ్డారు. -
ముందు బఘేల్, తర్వాత దేవ్?
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్ సీఎం పదవిపై నాలుగు రోజుల ఉత్కంఠకు తెరపడనుంది. నలుగురు కీలక నేతలతో దోబూచులాడిన సీఎం పదవి చివరికి భూపేశ్ బఘేల్‌ను వరించే అవకాశాలు కన్పిస్తున్నాయి. రెండున్నరేళ్ల తర్వాత టీపీ సింగ్ దేవ్‌కు సీఎంగా అవకాశమిచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించిందని తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన కాంగ్రెస్..ముఖ్యమంత్రిని ఖరారు చేసేందుకు సుదీర్ఘ చర్చలు సాగించింది. పార్టీ అధ్యక్షుడు రాహుల్‌తోపాటు రాష్ట్ర పరిశీలకుడు ఖర్గే, ఛత్తీస్‌గఢ్ వ్యవహారాల ఇన్చార్జి పీఎల్ పునియా ఈ చర్చల్లో పాల్గొన్నారు. తామ్రధ్వజ్ సాహును ఎంపిక చేస్తూ శనివారం మధ్యాహ్నం నిర్ణయం తీసుకున్నారు. తామ్రధ్వజ్ కేబినెట్లో తాము మంత్రులుగా కొనసాగబోమంటూ సీఎం రేసులో ఉన్న భూపేశ్ బఘేల్, టీపీ సింగ్ దేవ్, చరణ్‌దాస్ మహంత్ తిరుగుబాటు చేశారు. దీంతో సోనియా గాంధీ, ప్రియాంకా వాధ్రా గాంధీ రంగంలోకి దిగి రాజీ ఫార్ములాను తెరపైకి తెచ్చారని సమాచారం. దీని ప్రకారం.. బఘేల్ రెండున్నరేళ్లు, ఆ తర్వాత టీపీ సింగ్ దేవ్‌కు రెండున్నరేళ్లు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించేందుకు అధిష్టానం అంగీకరించింది. అయితే, నేడు రాయ్‌పూర్‌లో జరిగే సీఎల్పీ సమావేశం అనంతరం అంతిమ నిర్ణయం వెలువడుతుందని భావిస్తున్నారు. పలుకుబడి, మైనింగ్ లాబీ.. కుర్మి వర్గానికి చెందిన బఘేల్‌కు కొంత మేర ప్రజల్లో సానుకూలత ఉంది. గట్టి పలుకుబడి, ధనిక మైనింగ్ లాబీ మద్దతు బఘేల్‌కు పుష్కలంగా ఉంది. ఆయన్ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టేందుకు రాజధానిలో భారీగా లాబీయింగ్ జరిగిందని సమాచారం. కాంగ్రెస్ రాజీ సూత్రం సాహు వర్గ నేతలకు గట్టి దెబ్బ అని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ వర్గం వారంతా బీజేపీని వదిలి ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ వెంట ఉన్నారు. ఈ ప్రభావం వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎలా ఉంటుందనే దానిపైనే ప్రస్తుతం అందరి దృష్టీ ఉంది. అయితే, రాజాలు లేదా రాజ్‌పుత్ వర్గానికి చెందిన సింగ్ దేవ్ లాంటి వారికి బదులు గిరిజన నేతలకు ప్రోత్సాహమిచ్చి వృద్ధిలోకి తేలేకపోయిందనే భావం ప్రజల్లో కాంగ్రెస్‌పై ఉంది. -
ముఖ్యమంత్రి పదవి కోసమే పెళ్లికి దూరమా..?
ముఖ్యమంత్రి కావాలనే కాంక్షతోనే నటి నయనతార అవివాహితగా ఉండిపోయిందా? ప్రస్తుతం కోలీవుడ్‌లో ఇదే చర్చనీయాంశంగా మారింది. నానుం రౌడీదాన్, మాయ చిత్రాల ముందు వరకూ నయనతార ఒక కమర్షియల్ హీరోయిన్‌గానే ఉండేది. అదే సమయంలో పలు సమస్యలు, వివాదాల్లో చిక్కుకుంది. ముఖ్యంగా నటుడు శింబుతో ప్రేమ వ్యవహారం చర్చనీయంగానే మారింది. కాగా ఇక్కడ దర్శకుడు జీటీ.నందు కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. ఈయన శింబు హీరోగా కెట్టవన్ చిత్రాన్ని తెరకెక్కించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. నందు ఇటీవల ఒక టీవీ.ఛానల్‌కు ఇచ్చిన భేటీలో పేర్కొంటూ కెట్టవన్ చిత్రాన్ని శింబు హీరోగా చేయడానికి సన్నాహాలు చేశామని, ఆయన ఇప్పుడు కుదరదు అని చెప్పారన్నారు. దీంతో నటుడు ధనుష్‌తో చేద్దామని దర్శకుడు భూపతిపాండియన్‌తో తన వద్ద కథ ఉన్న విషయాన్ని ధనుష్‌కు చెప్పమని కోరానన్నారు. కాగా మళ్లీ శింబునే కెట్టవన్ చిత్రాన్ని చేద్దామని చెప్పారన్నారు. అలా కొంత షూటింగ్ జరిగిన తరువాత తాను ధనుష్‌కు కథ చెప్పిన విషయం తెలుసుకుని శింబు కోపగించుకున్నారన్నారు. అప్పటి నుంచి సమస్య మొదలైందని చెప్పారు. శింబు నయనతార విడిపోవడానికి కారణం శింబు, నయనతార ప్రేమ వ్యవహారం గురించి, వారు విడిపోవడం గురించి పలు కారణాలు ప్రచారంలో ఉన్నాయన్నారు. తనకు తెలిసి ఒక విషయం ముఖ్యమైనదిగా ఉండవచ్చునన్నారు. చాలా కాలం ముందు స్థానిక ట్రిప్లికేన్‌లోని పిళ్లైయార్ కోవిల్ వీధిలో ఉండే ఒక జ్యోతిష్యుడిని తానూ, నటుడు శింబు తరఫు వ్యక్తి ఒకరు కలిశామన్నారు. అప్పుడు శింబు, నయనతార జాతకాలు చూసిన ఆ జ్యోతిష్యుడు నయనతారకు వివాహం అయితే ఆమె నడిరోడ్డున పడే పరిస్థితి ఏర్పడ వచ్చని, పెళ్లి చేసుకోకపోతే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా ఉంటుందని చెప్పారన్నారు. -
ఏడాది వరకు నేనే సీఎం
సాక్షి, బెంగళూరు: కనీసం సార్వత్రిక ఎన్నికలయ్యే వరకైనా తానే కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉంటాననీ, అప్పటి వరకు తననెవరూ టచ్ చేయలేరని ఆ రాష్ట్ర సీఎం హెచ్డీ కుమారస్వామి శుక్రవారం వ్యాఖ్యానించారు. కాంగ్రెస్–జేడీఎస్‌ల సంకీర్ణ ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికల వరకు కొనసాగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చేలా పనిచేయడమే తన తొలి ప్రాధాన్యమని చెప్పారు. సంకీర్ణ ప్రభుత్వం ఎంత కాలం ఉంటుందో ఎవరూ చెప్పలేరని ఆయన పేర్కొనడం గమనార్హం. రుణమాఫీపై గందరగోళం వద్దని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామన్నారు. కుమారస్వామి వ్యాఖ్యలపై చర్చ ఐదేళ్ల పాటు సంకీర్ణ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదనీ, ముఖ్యమంత్రిగా కుమారస్వామి కొనసాగుతారని కాంగ్రెస్ చెబుతున్నా.. సీఎం అందుకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేయడంపై రాష్ట్రంలో చర్చ మొదలైంది. జేడీఎస్–కాంగ్రెస్‌లు అధికారం చేపట్టినప్పటి నుంచి మంత్రివర్గంలో స్థానం కోసం ఇరు పక్షాల నేతలు తీవ్రస్థాయిలో లాబీయింగ్‌లు చేశారు. చివరకు ఇటీవల మంత్రివర్గ విస్తరణ పూర్తవడంతో పదవులు దక్కని వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో సంకీర్ణ ప్రభుత్వంపై చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే లోక్‌సభ ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీకి జేడీఎస్ మద్దతు అవసరం కాబట్టి ఎలాంటి ఇబ్బందులూ తలెత్తే ప్రసక్తే ఉండబోదని పరిశీలకులు భావిస్తున్నారు. ముసాయిదా కమిటీ ఏర్పాటు జేడీఎస్–కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం నెరవేర్చాల్సిన వివిధ హామీలను ఎంపిక చేసేందుకు ఐదుగురు సభ్యులతో ఓ ముసాయిదా కమిటీ ఏర్పాటైంది. కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ ముసాయిదా కమిటీకి నేతృత్వం వహిస్తారు. ఇరు పార్టీల మేనిఫెస్టోల్లోని హామీలను పరిశీలించి వాటిని ఎలా నెరవేర్చాలో నివేదిక ఇవ్వడమే ఈ ముసాయిదా కమిటీ విధి. -
హంగ్ ట్విస్ట్: సిద్దరామయ్య కీలక ప్రకటన